/rtv/media/media_files/2025/01/23/0nBfp3i2UZe5MV4zjVQP.jpg)
Medigadda barrage and former TSIDC chairman Prakash Photograph: (Medigadda barrage and former TSIDC chairman Prakash)
Kaleshwaram Project: కాళేశ్వరం బరాజ్‌ల నిర్మాణంలో అవకతవలు జరిగినట్లు వచ్చిన ఆరోపణలు రాష్ట్రంలో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దీనిపై జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ విచారణ చేస్తోంది. అయితే తాజాగా ఈ కమిషన్ పలు కీలక వ్యాఖ్యలు చేసింది. మేడిగడ్డ బరాజ్‌కు సంబంధించి సాంకేతిక అంశాలతో ఇరిగేషన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్‌కు సంబంధం లేదని.. వాటిని ఇంజినీర్లకు వదిలేయాలని సూచనలు చేసింది.
మేడిగడ్డ బరాజ్ అంశంపై క్రాస్ ఎగ్జామినేషన్..
ఇక వివరాల్లోకి వెళ్తే.. మేడిగడ్డ బరాజ్ అంశంపై బుధవారం క్రాస్ ఎగ్జామినేషన్ జరిగింది. గత ప్రభుత్వం తరఫున రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (TSIDC)) మాజీ చైర్మన్, బీఆర్‌ఎస్ నేత ప్రకాశ్‌రావు హాజరయ్యారు. కుంగిపోయిన 7వ బ్లాక్‌కు మరమ్మతులు పునరుద్ధరించాలని తెలిపారు. దీంతో జస్టిస్ ఘోష్ ఆయన్ని మధ్యలోనే అడ్డుకున్నారు. టెక్నికల్ అంశాలతో మీకు సంబంధం లేదన్నారు. దీన్నిఇంజినీర్లకే వదిలేయాలని సూచించారు.
Also Read: ప్రైవేట్ బడుల్లో వారికి ఉచిత చదువులు.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం!
అయితే తుమ్మిడిహెట్టి నుంచి బరాజ్ నిర్మాణాన్ని మేడిగడ్డకు ఎందుకు తరలించారని కమిషన్ అడిగింది. ప్రజల సాగునీటి డిమాండ్లు నెరవేర్చేందుకే 200 టీఎంసీలు అవరసరమయ్యాయని ప్రకాశ్ తెలిపారు. తుమ్మిడిహెట్టి వద్ద తగినంత నీటి లభ్యత లేకపోవడం వల్లే బరాజ్‌ను తరలించాల్సి వచ్చిందని క్లారిటీ ఇచ్చారు. తుమ్మిడిహెట్టి వద్ద కేవలం 165 టీఎంసీల జలాల లభ్యత ఉందని కేంద్ర జలసంఘం కూడా చెప్పినట్లు తెలిపారు. అందులో కూడా ఇతర రాష్ట్రాల వాటా 63 టీఎంసీలు పోగా తెలంగాణకు కేవలం 102 టీఎంసీలే మిగులుతాయని చెప్పారు.
Also Read : Maha kumbh mela: ఈసారి కప్ నమ్‌దే.. గంగాస్నానం చేసిన ఆర్సీబీ జెర్సీ
ఎగువన మహారాష్ట్ర, కర్ణాటకల రాష్ట్రాలు పలు జలాశయాలను నిర్మించి నీటిని తరలించుకుంటున్నాయని.. దీనివల్ల గత 50 ఏళ్లుగా తెలంగాణకు ప్రవాహాలు తగ్గిపోయాయని తెలిపారు. సాగునీటి కోసమే తెలంగాణ ఉద్యమం జరిగిందని అన్నారు. దీనిపై కమిషన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ అంశంలో రాజకీయాలు చేయొద్దని.. ఉద్యమంతో తమకు ఏం సంబంధం అంటూ ప్రశ్నించింది. తుమ్మిడిహెట్టి వద్ద బరాజ్‌తో ప్రాణహిత-చేవేళ్ల ప్రాజెక్టును నిర్మించడమే ఉత్తమమని.. 2015 ఏప్రిల్‌లోనే రిటైర్డ్ ఇంజినీర్ల కమిటి సిఫార్సు చేసినట్లు కమిషన్ తెలిపింది.
Also Read: ఈ కుక్కర్లోనే ఉడికించి.. ఫినాయిల్ తో కడిగి: వెలుగులోకి భయంకర నిజాలు!
మేడిగడ్డ బరాజ్ అనవసరమని.. దీనికి ఖర్చు అవుతుండటంతో పాటు సమయం చాలా పడుతుందని కమిటీ చెప్పినట్లు పేర్కొంది. అయితే నీటి లభ్యత లేకపోవడం వల్ల ముంపును తగ్గించడం కోసం తుమ్మడిహెట్టికి బదులు వెన్‌గంగా నదిపై 20 టీఎంసీల వార్ధా బరాజ్ నిర్మించాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయంచినట్లు ప్రకాశ్ చెప్పారు. టీఎస్‌ఐడీసీ ఛైర్మన్‌గా నాటికి మీరు నియామకం కానందున మీ సమాధానం అవసరం లేదని ప్రకాశ్‌కు కమిషన్ చెప్పింది.
Also Read : GHMC విస్తరణ .. ఆ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు వీలినం!