Dharani : ”అలా చేయండి”.. ప్రభుత్వానికి ధరణి కమిటీ కీలక సూచనలు

ధరణి కమిటీ ప్రభుత్వానికి పలు సూచనలు చేసింది. 2020 సెప్టెంబర్‌లో ధరణిని ప్రారంభించినప్పటి నుంచి అందులో ఏమైనా అనాధికారిక మార్పులు జరిగాయా ? లేదా ? అని తనిఖీ చేసేందుకు పోర్టల్‌కు సంబంధించి థర్డ్‌ పార్టీ ఆడిట్‌ను పరిగణలోకి తీసుకోవాలని కోరింది.

New Update
Dharani

ధరణి పోర్టల్‌లో నెలకొన్న సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా రేవంత్‌ సర్కా్ర్ ముందడుగులు వేస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతు సంఘాలతో మాట్లాడిన ధరణి కమిటీ తుది నివేదికను సైతం రూపొందించింది. అయితే తాజాగా కమిటీ ప్రభుత్వానికి పలు సూచనలు చేసింది. 2020 సెప్టెంబర్‌లో ధరణిని ప్రారంభించినప్పటి నుంచి అందులో ఏమైనా అనాధికారిక మార్పులు జరిగాయా ? లేదా ? అని తనిఖీ చేసేందుకు పోర్టల్‌కు సంబంధించి థర్డ్‌ పార్టీ ఆడిట్‌ను పరిగణలోకి తీసుకోవాలని కోరింది. 

అయితే ధరణి పోర్టల్‌లో స్థలాల యజమానుల పేర్లను, సర్వే నెంబర్లను, భూమి విస్తరణను మార్చడం.. అలాగే పలు సర్వే నెంబర్లను నిషేధిత జాబితాలో పెట్టడం, తప్పులు నమోదు చేయడం లాంటి అనాధికార మార్పులు జరిగాయని ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే వీటిని పరిశీలించేందుకు కమిటీ.. మూడో పార్టీ ఆడిట్‌ను తీసుకోవాలని రేవంత్‌ సర్కార్‌కు విజ్ఞప్తి చేసింది. అంతేకాదు ప్రభుత్వ డేటాను కాపాడటం, ప్రజల ప్రైవసీ సమస్యలను పరిష్కరించడం కోసం ధరణి పోర్టల్‌ను నియంత్రించే బాధ్యతను నేషనల్‌ ఇన్ఫర్మేటిక్స్‌ సెంటర్ (NIC), సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ (CGG), లేదా టీఎస్‌ఆన్‌లైన్ లాంటి ప్రభుత్వ సంస్థలకు అప్పగించాలని సూచించింది.

Also Read: మూసీకి పూర్వ వైభవం దిశగా అడుగులు.. అక్కడ ఉండేవాళ్లకి బిగ్ షాక్

కొన్ని నెలల క్రితమే రాష్ట్ర ప్రభుత్వం.. రైతు కమిషన్ ఛైర్మన్ ఎం.కోదండ రెడ్డి, భూములు నిపుణుడు ఎం. సునిల్‌ కుమార్‌ తదితర అధికారులతో కలిసి ఓ కమిటీని ఏర్పాటు చేసింది. అలాగే ధరణి పేరుకు త్వరలోనే భూమాత అనే నామకరణం కూడా చేయనుంది. మరోవైపు ప్రస్తుతం ఉన్న రైట్‌ ఆఫ్‌ రికార్డ్స్‌(RoR) యాక్ట్, 2020 లోని పలు మార్పులు చేసి, కొత్త నిబంధనలు తీసుకొచ్చి మళ్లీ ఆర్‌ఓఆర్‌ యాక్ట్‌, 2024 ను తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. అయితే భూ సంస్కరణలను చేపట్టడంలో ప్రభుత్వానికి సాయం చేసేందుకు ల్యాండ్ గవర్నెన్స్ ఇన్నోవేషన్ సెల్ అలాగే లీగల్ సపోర్ట్ సెల్‌ను రూపొందించాలని ప్రభుత్వానికి ధరణి కమిటీ సూచించింది.

పెండింగ్‌లో ఉన్న ధరణి అప్లికేషన్లను పరిష్కరించడం మాత్రమే కాకుండా.. ప్రభుత్వం గ్రామీణ స్థాయిలో ఒక కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించాలని తెలిపింది. దీని ద్వారా రెవెన్యూ సదస్సులు, నిషధిత స్థలాల జాబితాలను సరిచేయడం, అప్‌డేట్ చేయడం లాంటి భూ ఫిర్యాదుల ఆర్జీలను స్వీకరించాలని చెప్పింది. అలాగే నిషేధిత స్థలాల జాబితా నుంచి 1958 కన్నా ముందు ఉన్న అసైన్డ్‌ భూములను డిలీట్‌ చేయాలని కోరింది. అయితే బీఆర్ఎస్‌ హయాంలో వీఆర్వో, వీఆర్‌ఏలను రద్దు చేశాక గ్రామీణ స్థాయిలో రైతులకు సపోర్ట్ చేసే అధికారి ఎవరూ కూడా లేదు. అందుకే రైతులకు అండగా ఉండేందుకు, గ్రామీణ ప్రాంతాల్లో ల్యాండ్ అడ్మినిస్టేషన్‌ను చూసుకునేందుకు ఓ బాధ్యతాయుతమైన వ్యక్తి ఉంచాలని కమిటీ భావిస్తోంది. ఇందుకోసమే పలు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని ప్రభుత్వానికి ప్రతిపాదించింది. దీనివల్ల రైతుల భూ సమస్యలు పరిష్కారమవుతాయని చెబుతోంది. అంతేకాదు విలేజ్‌ రెవెన్యూ కోర్టులు ఏర్పాటు చేయడం వల్ల కూడా భూ సమస్యలను పరిష్కారమవుతాయని కమిటీ స్పష్టం చేసింది.

Also Read: రేషన్ కార్డులకు కొత్త రూల్స్.. ఆదాయం ఎంత ఉండాలో తెలుసా?

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Butta Renuka: వైసీపీకి భారీ షాక్... మాజీ ఎంపీ బుట్టా రేణుక ఆస్తుల వేలం

వైసీపీ మాజీ ఎంపీ బుట్టా రేణుక ఎల్‌ఐసీ హౌసింగ్‌ సంస్థ నుంచి రూ.360 కోట్లు తీసుకొని చెల్లించలేదు. దీంతో అప్పుకోసం తనఖా పెట్టిన ఆస్తులను వేలం వేయనున్నట్లు ఎల్‌ఐసీ ప్రకటించింది.దీర్ఘకాలంగా బకాయిలు చెల్లించనందునే ఆస్తులు వేలం వేస్తున్నట్లు ఆ సంస్థ తెలిపింది.

New Update
Butta Renuka

Butta Renuka

Butta Renuka: వైసీపీ మాజీ ఎంపీ బుట్టా రేణుక ఎల్‌ఐసీ హౌసింగ్‌ సంస్థ నుంచి దాదాపు రూ.360 కోట్ల రుణం తీసుకొని బురిడీ కొట్టేశారు. దీంతో అప్పు కోసం బుట్టా రేణుక దంపతులు తనఖా పెట్టిన ఆస్తులను  వేలం వేయనున్నట్లు ఎల్‌ఐసీ ప్రకటించింది. దీర్ఘకాలంగా బకాయిలు చెల్లించనందునే ఆస్తులు వేలం వేస్తున్నట్లు ఆ సంస్థ స్పష్టం చేసింది. బుట్టా దంపతులు దాదాపు రూ.360 కోట్లను రెండు రుణ ఖాతాల ద్వారా తీసుకున్నారు. ఈ రుణానికి 2019 నవంబరు 18న బుట్టా రేణుక, బీఎస్‌ నీలకంఠకు డిమాండ్‌ నోటీసు పంపింది. ఈ ఆస్తుల రిజర్వు ధరను రూ.360 కోట్లుగా ఎల్‌ఐసీ హౌసింగ్‌ పేర్కొంది. ఈ ఆస్తులన్నింటినీ ఏకమొత్తంలో ఈ-వేలం ద్వారా విక్రయిస్తామని పేర్కొంది.

Also Read :  మాకు నీళ్లు ఆపితే మీ శ్వాస ఆపుతాం...మోదీకి హఫీజ్ వార్నింగ్!

తీసుకున్న రుణానికి కొంతకాలంపాటు కిస్తీలు సక్రమంగా చెల్లించినప్పటికీ ఐదేళ్ల నుంచి తిరిగి చెల్లించడం లేదు. ఇప్పటికే సంస్థ బెంగళూరు బ్రాంచి ప్రతినిధులు పలుసార్లు నోటీసులు పంపడంతోపాటు సంప్రదింపులు జరిపినప్పటికీ బుట్టా దంపతులు స్పందించలేదు. బుట్టా రేణుక, ఆమె భర్త నీలకంఠలు 2018లో 15ఏళ్ల కాలవ్యవధిలో తిరిగి చెల్లించేలా రూ.310 కోట్ల రుణం తీసుకున్నారు. బుట్టా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, బుట్టా కన్వెన్షన్‌ సర్వీసెస్‌ లిమిటెడ్, మెరిడియన్‌ ఎడ్యుటెక్‌ సర్వీసెస్‌ కార్యకలాపాలకు రుణాన్ని వినియోగించారు. రుణంపై సుమారు రూ.40 కోట్ల వరకు చెల్లించారు. అసలు, వడ్డీ కలిపి ఇంకా రూ.340 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంది. వడ్డీ భారం ఎక్కువగా ఉన్నందున కొన్ని ఆస్తులు విక్రయించి రుణం రీషెడ్యూలు చేయాలని వారు కోరారు.

Also Read :  ఉగ్రదాడికి బిగ్‌బాస్ కంటెస్టెంట్లే ప్రధాన కారణం.. అన్వేష్ సంచలన వీడియో!

కరోనా మహమ్మారి సమయంలో బుట్టా రేణుకకు సంబంధించిన పలు వ్యాపారాలు దెబ్బతిన్నాయి. కొన్నింటిని మూసివేయాల్సి వచ్చింది. ఇక ఆ ప్రభావం బుట్టా ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో పాటు బుట్టా రేణుకకు సంబంధించిన ఇతర సంస్థల పైన కూడా పడింది. దీంతో బకాయిలు పేరుకుపోవడంతో తిరిగి చెల్లించని నేపథ్యంలో ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పటికే బకాయిల చెల్లింపు అంశంపై బుట్టా రేణుక నేషనల్ కంపెనీలా ట్రిబ్యునల్ లో అప్పీల్ చేసుకున్నారు. ఎన్సీఎల్టీలో కేసు ఉండగా వేలం ప్రకటన వేయడం నిబంధనలకు విరుద్ధమని బుట్టా రేణుక వాదిస్తున్నా ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ మాత్రం అదేమీ పట్టించుకోవటం లేదు. ఆర్బీఐ నిబంధనల ప్రకారం వెళ్తుంది.

Also Read :  నారాయణ విద్యార్థి సూసైడ్.. సబ్జెక్టు ఫెయిల్ అయినందుకు ప్రిన్సిపాల్ వేధింపులు..

నిబంధనలకు విరుద్ధంగా ప్రతిపాదన ఉందని హెచ్‌ఎఫ్‌ఎల్‌ ప్రతినిధులు అంగీకరించలేదు. రుణం తీసుకున్న మొత్తానికి నెలసరి వాయిదా రూ.3.40 కోట్ల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తం భారంగా మారినందున తొలుత తక్కువ మొత్తం తీసుకుని, చెల్లింపు మొత్తాన్ని క్రమేణా పెంచాలని ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదననూ హెచ్‌ఎఫ్‌ఎల్‌ తిరస్కరించింది. రుణాలు చెల్లించడం ఆపేసినందున హెచ్‌ఎఫ్‌ఎల్‌.. ఎన్‌సీఎల్‌టీని ఆశ్రయించింది. ప్రస్తుతం కేసు పెండింగ్‌లో ఉంది. రుణ నిబంధనలకు అనుగుణంగా బుట్టా రేణుక దంపతులకు చెందిన బంజారాహిల్స్‌లోని ఐదువేల గజాల ఆస్తిని రూ.145 కోట్లకు వేలం వేయగా ఎవరూ ముందుకు రాలేదు. మాదాపూర్‌లోని 7,205 చ.గజాల్లో ఉన్న బుట్టా కన్వెన్షన్‌ వేలానికీ స్పందన రాలేదు. మరోసారి వేలానికీ ప్రయత్నిస్తున్నారు. వేలంలో పాడుకుంటే ఇబ్బందులు వస్తాయోనని చాలామంది వెనకంజ వేస్తున్నట్లు తెలుస్తోంది.

Also Read :  టీచర్ కాదు టార్చర్.. హోం వర్క్ చేయలేదని విద్యార్థినితో దారుణం.. లేడీ టీచర్‌కు రూ.2 లక్షల జరిమానా!

 
 

Advertisment
Advertisment
Advertisment