ఏపీ, తెలంగాణలో రానున్న 5 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అండమాన్ సమీపంలోని ఆవర్తనం వల్ల పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. మరికొన్ని ప్రాంతాల్లో వర్షాలతో పాటు పిడుగులు కూడా పడతాయని హెచ్చరించారు. అలాగే మరికొన్ని జిల్లాల్లో ఎండలు కూడా ఎక్కువగా ఉంటాయని తెలిపారు.
Also Read: అగ్నివీరులకు గుడ్‌న్యూస్.. పోలీస్ నియామకాల్లో 20 శాతం రిజర్వేషన్లు
కొన్ని జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీలు పెరిగే ఛాన్స్ ఉందన్నారు. సోమవారం పలు ప్రాంతాల్లో పిడుగులు పడతాయని.. వర్షాలు పడే సమయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇలాంటి సమయంలో సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. ముఖ్యంగా రైతులు చెట్ల కింద నిల్చోవద్దని చెప్పారు.
Also Read: డీఎంకే ప్రభుత్వంపై మోదీ ఫైర్.. వాళ్లు తమిళంలో సంతకం చేయాలన్న ప్రధాని
ఇదిలాఉండగా ఇప్పటికే అనకాపల్లి, శ్రీకాకుళం, కాకినడా, పల్నాడు, బాపట్ల, గుంటూరు తదితర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసినట్లు అధికారులు చెప్పారు. ఏపీలో అత్యధికంగా కాకినాడ జిల్లా వేలంకలో 56.25 మిల్లీ మీటర్ల వాన పడినట్లు పేర్కొన్నారు.
Also Read: మణిపూర్‌లో ఉగ్రవాదులు అరెస్ట్.. భారీగా ఆయుధాలు స్వాధీనం
telugu-news | rtv-news | rains | heavy-rains
TG News: IAS అధికారులపై కాంగ్రెస్ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు.. రెస్ట్ తీసుకోమంటూ!
తెలంగాణ IAS అధికారులపై సత్తుపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే మట్టా రాగమయి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఐఏఎస్ కావడానికి బాగా కష్డపడి చదివి జాబ్ రాగానే రిలాక్స్ అవుతారని అన్నారు. దీంతో దేశ అత్యున్నత సర్వీస్ వ్యవస్థను కించపరిచారంటూ ఐఏఎస్ లు మండిపడుతున్నారు.
MLA Matta Ragamayee Photograph: (MLA Matta Ragamayee )
TG News: తెలంగాణ IAS అధికారులపై సత్తుపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే మట్టా రాగమయి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఐఏఎస్ కావడానికి బాగా కష్డపడి చదివి జాబ్ రాగానే రిలాక్స్ అవుతారని సత్తుపల్లి కాంగ్రెస్ నేతల సమావేశంలో అన్నారు. దీంతో దేశ అత్యున్నత సర్వీస్ వ్యవస్థను కించపరిచారంటూ ఐఏఎస్ లు మండిపడుతున్నారు.
రిల్సాక్స్ కావొద్దు..
ఈ మేరకు శనివారం సత్తుపల్లి కాంగ్రెస్ నేతల సమావేశంలో ఆమె పాల్గొన్న ఆమె పనుల గురించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఐఏఎస్ అవ్వడానికి బాగా కష్టపడి చదువుతారు.. ఒకసారి ఐఏఎస్ అయ్యాక రిలాక్స్ అయిపోయి ఏం పని చెయ్యరు. మీరు ఐఏఎస్ అధికారుల లాగా కావొద్దని ఈ మాట రేవంత్ రెడ్డి తమకు చెప్పాడన్నారు. అలాగే సీఎంను, మంత్రులను అందరూ తిట్టినా తమ నేతలు కౌంటర్లు ఇవ్వడం లేదని అసహనం వ్యక్తం చేశారు.
మాకెందుకులే అన్నట్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందరూ వ్యవహరిస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. అయితే ఎమ్మెల్యే రాగమయి వ్యాఖ్యలపై ఐఏఎస్ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశ అత్యున్నత సర్వీస్ వ్యవస్థను కించపరిచారంటూ మండిపడుతున్నారు. రాగమయి క్షమాపణ చెప్పాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
కాంగ్రెస్ కుటుంబమే
ఇక వృత్తిరిత్యా డాక్టర్ మట్టా రాగమయి.. తెలంగాణ శాసనసభలో తొలిసారిగా అడుగుపెట్టిన ఉన్నత విద్యావంతుల్లో ఒకరు. ఒకవైపు ఊపిరితిత్తుల వైద్య నిపుణురాలిగా సేవలందిస్తూనే రాజకీయాల్లోకి వచ్చారు. అయితే నిజంగా తాను ఎమ్మెల్యే అవుతానని ఎన్నడూ అనుకోలేదని చెప్పారు. అత్తమ్మ ఆరోగ్యమ్మ స్ఫూర్తి, తన భర్త డాక్టర్ దయానంద్ ప్రేరణతోనే శాసనసభలో అడుగుపెట్టానని గెలిచిన సందర్భంగా చెప్పారు. మొదటి నుంచి తమది కాంగ్రెస్ కుటుంబమేనని, అత్తమ్మ మండల పరిషత్ ప్రెసిడెంట్‌గా పనిచేశారని గుర్తు చేశారు. మామయ్య కృష్ణమూర్తి జాతీయోద్యమకాలం నుంచి కాంగ్రెస్ వాది, స్వాతంత్య్ర సమరయోధుడు కూడా అని తెలిపారు.
Weather Alert: తెలుగు రాష్ట్రాలకు అలెర్ట్.. 5 రోజులపాటు భారీ వర్షాలు
ఏపీ, తెలంగాణలో రానున్న 5 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పలు ప్రాంతాల్లో వర్షాలతో పాటు పిడుగులు కూడా పడతాయని హెచ్చరించారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
Husband attacks wife : కొండాపూర్ లో దారుణం.. గర్భిణి అయిన భార్యను చంపాలని...
కొండాపూర్లో నడిరోడ్డుపై దారుణం చోటుచేసుకుంది..గర్భిణిని చంపేందుకు భర్త యత్నించడం కలకలం రేపింది. Short News | Latest News In Telugu | నల్గొండ | తెలంగాణ
Nagarjuna Sagar : నాగార్జున సాగర్ ఎర్త్ డ్యాం దగ్గర మరోసారి అగ్నిప్రమాదం..దగ్ధమైన సీసీకెమెరాలు
నాగార్జునసాగర్ డ్యాం వద్ద మరోసారి అగ్నిప్రమాదం జరిగింది. ప్రధాన ఎర్త్ డ్యాం వద్ద ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. Short News | Latest News In Telugu | తెలంగాణ
Telangana: బీజేపీ సన్నబియ్యం ఇవ్వడంపై మహేశ్ కుమార్ గౌడ్ కౌంటర్
బీజేపీ సన్నబియ్యం ఇస్తే దేశం మొత్తం ఎందుకు ఇవ్వడం లేదని బండి సంజయ్కు మహేశ్ కుమార్ గౌడ్ కౌంటర్ వేశారు. బండి సంజయ్కు రోజురోజుకు అభద్రతా భావం పెరుగుతోందని అన్నారు. Short News | Latest News In Telugu | తెలంగాణ
Ram Charan vs. Allu Arjun : పెద్ది సినిమా అప్డేట్…రాంచరణ్ వర్సెస్ బన్నీ ఫ్యాన్స్ రచ్చరచ్చ
గత కొంతకాలంగా మెగాఫ్యామిలీకి, బన్ని ఫ్యాన్స్ కి మధ్య జరుగుతున్న రచ్చ తెలిసిందే. తాజాగా మరోసారి వివాదం........ Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
Sri Rama Navami Shobha Yatra : వైభవంగా కొనసాగుతోన్న శ్రీరామ శోభాయాత్ర
హైదరాబాద్లో శ్రీరామనవమి సందర్భంగా నిర్వహిస్తున్న శ్రీరాముడి శోభాయాత్ర వైభవంగా కొనసాగుతోంది. వేలాదిమందితో ర్యాలీ కదులుతోంది. Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ
GT VS SRH: హైదరాబాద్ ఇక ఇంటికి వెళ్ళిపోయినట్లే...వరుసగా నాలుగో ఓటమి
Weather Alert: తెలుగు రాష్ట్రాలకు అలెర్ట్.. 5 రోజులపాటు భారీ వర్షాలు
Jibli Trend: జిబ్లీలో ఫోటోలు అప్ లోడ్ చేస్తున్నారా..అయితే జాగ్రత్త
57ఏళ్ల వయసులో ఇదేం బుద్ధి.. లవర్ తండ్రి అస్థికలతో బ్లాక్మెయిల్ ‘వస్తేనే ఇస్తా’
Agniveers: అగ్నివీరులకు గుడ్‌న్యూస్.. పోలీస్ నియామకాల్లో 20 శాతం రిజర్వేషన్లు