SLBC Tunnel: SLBC టన్నల్‌ వద్దకు సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి SLBC టన్నల్‌లో సహాయక చర్యలు పర్యవేక్షించడానికి ఆదివారం వెళ్లనున్నారు. ఈరోజు సాయంత్రం 5 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి SLBC ప్రాజెక్ట్ ఉన్న నాగర్ కర్నూల్ జిల్లా దొమలపెంటకు చేరుకోనున్నారు.

New Update
cm revanth reddy123

cm revanth reddy123 Photograph: (cm revanth reddy123)

SLBC Tunnel లో చిక్కుకున్న వారిని బటయకు తీసే సహాయక చర్యలు గత 8 రోజులుగా కొనసాగుతున్నాయి. టన్నల్ వద్ద జరుగుతున్న పనులను పరిశీలించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆదివారం అక్కడికి వెళ్లనున్నారు. వనపర్తి బహిరంగ సభ నుంచి హెలికాఫ్టర్‌లో నేరుగా ఆయన టన్నల్ వద్దకు బయలుదేరనున్నారు. ఈరోజు సాయంత్రం 5 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి SLBC ప్రాజెక్ట్ ఉన్న నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంటకు చేరుకోనున్నారు.

Also Read :  ఛాతీలో మంట, వికారం గుండెపోటుకు కారణమా?

Revanth Reddy To Visit SLBC Tunnel

Also Read :  NMDC బోర్డు డైరెక్టర్ గా ప్రియదర్శిని గడ్డం

హైదరాబాద్ రేంజ్ ఐజీ సత్యనారాయణ నేతృ‌త్వంలో ముఖ్యమంత్రి పర్యటనకు భద్రతా ఏర్పాట్లు చేశారు. టన్నల్‌లో నలుగురు కార్మికుల ఆచూకీ లభ్యమైంది. ఈ రోజు సాయంత్రానికి వారిని బయటకు తీసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. వారు బతికే అవకాశం కేవలం వన్ పర్సెంట్ మాత్రమే ఉందని రెస్క్యూ టీం నిపునులు చెబుతున్నారు.

Also read : Bolivia Bus Crash: ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు బస్సులు ఢీకొని 37 మంది మృ‌తి

ఆర్మీ, NDRF లాంటి 18 సంస్థలు, 703 మంది సహాయక సిబ్బంది 3 షిప్టుల వారీగా సహాయక చర్యలలో పాల్గొంటున్నారు. శనివారం రాత్రి శిథిలాక కింద గుర్తించగా.. మరో నలుగురు టన్నెల్ బోరింగ్ మెషిన్ (TBM) కింద చిక్కుకున్నట్లు కనిపిస్తున్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. 450 అడుగుల పొడవైన టీబీఎంను కత్తిరిస్తున్నట్లు ఆయన తెలిపారు.

Also read; Uttarakhand: నలుగురు కార్మికులు మృతి.. మరో నలుగురి కోసం గాలింపు

ఫిబ్రవరి 22 నుంచి శ్రీశైలం ఎడమ ఒడ్డు కాలువ (SLBC) సొరంగం కూలిపోయిన పైకప్పు కింద ఇంజనీర్లు, కార్మికులు సహా ఎనిమిది మంది చిక్కుకున్నారు. వారిని సురక్షితంగా బయటకు తీసుకురావడానికి సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు