/rtv/media/media_files/2025/03/28/I9CzwEicmpxTEtEPzEJn.jpg)
cheddy gang
ఉమ్మడి వరంగల్ జిల్లాలో చెడ్డీ గ్యాంగ్ చోరీలతో రెచ్చిపోతున్నారు. హన్మకొండలో తాళం వేసిన ఇంట్లో గురువారం రాత్రి దొంగతనానికి పాల్పడ్డారు. సీసీ టీవీలో దొంగతనం దృశ్యాలు రికార్డైంది. నెల రోజుల్లో 9 చోట్ల దొంగతనాలు చేసినట్లు తెలుస్తోంది. చెడ్డీ గ్యాంగ్ ముఠా సభ్యుల వరుస దొంగతనాలు, ఆగడాలు పోలీసులకు సవాల్‌గా మారినాయి.
Also Read : అమెరికాతో ఆ బంధం ముగిసింది.. ఇక ప్రతి చర్య తప్పదు: కెనడా!
భయాందోళనలో స్థానికులు
చెడ్డీ గ్యాంగ్ కదలికలతో వరంగల్ నగర ప్రజలు భయాందోళనకు గురతున్నారు. గురువారం అర్ధరాత్రి ఓ ఇంట్లో చొరబడ్డారు. దొరికిన కాడికి దోచుకు పోతున్నారు. గతంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో దోపిడీలు చేసి ప్రజలను భయబ్రాంతులకు గురి చేసిన ఘటనలు ఉన్నాయి. ఇక చెడ్డీ గ్యాంగ్ ఆట కట్టించేందుకు పోలీసులు కంటి నిండా నిద్రపోకుండా నిఘా పెట్టి వారి ఆట కట్టించారు.
Also Read : మనిషి రక్తాన్ని విషంగా మార్చి.. దోమల్ని చంపే ప్రయోగంలో సైంటిస్టులు సక్సెస్
ఇది కూడా చదవండి: రాత్రిపూట బాగా నిద్రపోవాలంటే ఈ ఆహారాలు తినండి
ఈ మధ్య జరిగిన వరుస చోరీలు నగర ప్రజలను కలవరానికి గురి చేస్తున్నాయి. నెల రోజుల్లోనే 9 దోపిడీలు చేయడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. చెడ్డీ గ్యాంగుల ఆట కట్టించేందుకు స్పెషల్ టీంలను రంగంలోకి దించి వేట కొనసాగిస్తున్నారు. దోపిడీ పెరటంతో వరంగల్ పోలీసులు అలర్ట్ అయ్యారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా చెడ్డీ గ్యాంగ్ ఆగడాలు బయట పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీని కోసం స్పెషల్ టీమ్స్‌ను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలిస్తునట్లు పోలీసులు తెలిపారు.
ఇది కూడా చదవండి: కసాయి తల్లి.. కన్న బిడ్డను చంపి ప్రమాదంగా చిత్రీకరణ
tg-news | latest-telugu-news | today-news-in-telugu | latest telangana news | telangana news live updates | telangana news today | telangana-news-updates | telangana crime case | telangana crime incident | telangana crime news | telangana-crime-updates | telugu crime news