Union Budget 2025: నేటి బడ్జెట్ తో ఆ విషయం తేలిపోయింది.. KTR సంచలన వ్యాఖ్యలు!

జాతీయ పార్టీలు తెలంగాణ ప్రయోజనాలను కాపాడలేవని మరోసారి కేంద్ర బడ్జెట్ తో రుజువైందని కేటీఆర్ అన్నారు. BJP, కాంగ్రెస్ కు చెందిన 16 మంది ఎంపీలు బడ్జెట్లో తెలంగాణకు తెచ్చింది '0' అని అన్నారు. కేంద్రానికి తెలంగాణ అంటే ఎంత చిన్నచూపో మరోసారి తేలిపోయిందన్నారు.

New Update
Union Budget 2025

Union Budget 2025 KTR Reaction

రాష్ట్రానికి చిల్లిగవ్వ కూడా తెచ్చుకోలేని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy), బీజేపీకి చెందిన కేంద్ర మంత్రులు, కాంగ్రెస్, బీజేపీకి చెందిన ఎంపీలు తెలంగాణ సమాజానికి క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) డిమాండ్ చేశారు. జాతీయ పార్టీలు ఎప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడలేవని మరోసారి కేంద్ర బడ్జెట్ (Union Budget 2025) తో రుజువైందన్నారు. ఈ మేరకు ఆయన ప్రకటన విడుదల చేశారు. రెండు పార్టీల నుంచి చెరో ఎనిమిది మంది ఎంపీలను గెలిపించి పార్లమెంటుకు పంపితే, ఆ 16 మంది కలిసి కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తెచ్చింది అక్షరాల గుండు సున్నా అని ఫైర్ అయ్యారు. సీఎంగా ఉంటూ బీజేపీకి గులాంగిరీ చేస్తున్న బడే భాయ్-చోటే భాయ్ అనుబంధంతో తెలంగాణకు నయాపైసా లాభం లేదని తేలిపోయిందన్నారు.

ఇది కూడా చదవండి: Union Budget 2024: ఇది బీహార్ బడ్జెట్.. రేవంత్ రెడ్డి ఓ కోతల రెడ్డి.. మాజీ మంత్రి పంచ్ లు!

Also Read :  వందకు వంద శాతం ఇది దేశాభివృద్ధి బడ్జెట్ : ప్రధాని మోదీ

బీజేపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క్షమాపణ చెప్పాలి..

ఇతర రాష్ట్రాల నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న బీజేపీ ఎంపీలు తమ రాష్ట్రాలకు నిధుల వరద పారిస్తుంటే.. తెలంగాణ బీజేపీ ఎంపీలు, నిస్సహాయ మంత్రులు చేతకాని దద్దమ్మల్లా వ్యవహరిస్తున్నారన్నారు. తెలంగాణకు నిధులు తేలేని బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. తెలంగాణ పార్టీ అయిన బీఆర్ఎస్‌కు ప్రాతినిధ్యం లేకుంటే జరిగే నష్టం ఏమిటో ప్రజలు గమనిస్తున్నారన్నారు. పార్లమెంటులో ప్రాంతీయ పార్టీలకు బలం ఉన్న బీహార్, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలకు దక్కిన ప్రాధాన్యం చూసి.. జాతీయ పార్టీలను గెలిపిస్తే తెలంగాణను నిండా ముంచారని ప్రజలకు అర్థమైందన్నారు. 

ఇది కూడా చదవండి: UNION BUDGET 2025: ఇంత అన్యాయమా?: కేంద్ర బడ్జెట్ పై రేవంత్ ఫైర్!

కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ అంటే ఎంత చిన్నచూపో మరోసారి పార్లమెంట్ సాక్షిగా ఈ బడ్జెట్ రుజువు చేసిందన్నారు. కేంద్ర బడ్జెట్ కేటాయింపులను చూస్తే, కేవలం బీజేపీ పాలిత రాష్ట్రాలకు పెద్దపీట వేసి, ఇతర రాష్ట్రాలకు అన్యాయం జరినట్లు అర్థమైందన్నారు. దేశ ఖజానా నింపే దక్షిణాది రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం సమాఖ్య స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధమన్నారు.

Also Read :  ఏపీలో మరో దారుణం.. ప్రియుడి మోజులో భర్తను అత్యంత దారుణంగా హతమార్చిన భార్య!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు