Union Budget : నిర్మలా సీతారామన్ ఫస్ట్ రియాక్షన్ | Niramala Sitaraman First Reaction On Budget | RTV
జాతీయ పార్టీలు తెలంగాణ ప్రయోజనాలను కాపాడలేవని మరోసారి కేంద్ర బడ్జెట్ తో రుజువైందని కేటీఆర్ అన్నారు. BJP, కాంగ్రెస్ కు చెందిన 16 మంది ఎంపీలు బడ్జెట్లో తెలంగాణకు తెచ్చింది '0' అని అన్నారు. కేంద్రానికి తెలంగాణ అంటే ఎంత చిన్నచూపో మరోసారి తేలిపోయిందన్నారు.
కేంద్రం పార్లమెంట్లో 2025 బడ్జెట్ ప్రవేశపెట్టింది. వ్యవసాయం, తయారీ రంగాలకు ఆర్థిక శాఖ పెద్ద పీట వేసింది. ఆయా రంగాలకు భారీగా నిధులు కేటాయించింది. మేక్ ఇన్ ఇండియా, అగ్నికల్చర్ లో ఉత్పదకత పెంచడమే లక్ష్యంగా మోదీ సర్కార్ బడ్జెట్ కేటాయింపులు జరిగాయి.
ఏపీలోని పోలవరం ప్రాజెక్టు, విశాఖ స్టీల్ ప్లాంట్, విశాఖ పోర్టుకు కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయించారు. పోలవరం ప్రాజెక్టుకు రూ.5,936 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు రూ.3,295 కోట్లు కేటాయించారు.
కొత్త పన్ను శ్లాబ్ ప్రకారం రూ.12 లక్షల వరకు ఆదాయం ఉంటే రూ.80,000 ఆదా అవుతుంది. పాత పన్ను స్లాబ్ ప్రకారం, ఒక వ్యక్తి జీతం రూ. 12 లక్షలు అయితే, దానిపై రూ. 80,000 పన్ను చెల్లించాలి, కానీ పన్ను స్లాబ్‌లో తాజా మార్పు తర్వాత ఇప్పుడది సున్నాగా మారింది.