కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) పార్లమెంట్‌లో నేడు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ (Union Budget 2025) లో ఏపీలోని పోలవరం ప్రాజెక్టు, విశాఖ స్టీల్ ప్లాంట్, విశాఖ పోర్టుకు నిధులు కేటాయించారు. పోలవరం ప్రాజెక్టుకు రూ.5,936 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. ప్రాజెక్టు నిర్మాణానికి బ్యాలెన్స్ గ్రాంటుగా మరో రూ.12,157 కోట్లు కేటాయింపులు చేసింది. విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు రూ.3,295 కోట్లు కేంద్రం కేటాయించగా.. విశాఖ పోర్టుకు రూ.730 కోట్లు నిధులు బడ్జెట్‌లో ప్రకటించారు.
ఇది కూడా చూడండి: Cricket: హమ్మయ్యా...సీరీస్ కొట్టేశారు..నాలుగో టీ20లో భారత్ ఘన విజయం
బడ్జెట్‌పై ఏపీ సీఎం చంద్రబాబు ప్రభావం..
బడ్జెట్ సందర్భంగా కేంద్ర పౌరవిమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన చేశారు. బడ్జెట్‌పై ఏపీ సీఎం చంద్రబాబు ప్రభావం ఉందన్నారు. గత ఏడు నెలలుగా రాష్ట్రంలోని అన్ని సమస్యలపై కేంద్రానికి చెప్పారని రామ్మోహన్ నాయుడు అన్నారు. జల జీవన్ మిషన్‌ను పొడిగించారని, అలాగే మాన్యుఫాక్చర్ రంగంలో ఏపీకి మేలు జరగనుందని తెలిపారు. ఉడాన్ స్కీం ద్వారా కూడా కోట్ల మందికి లబ్ధి చేకూరడంలో కీలక నిర్ణయం తీసుకున్నారన్నారు. సివిల్ ఏవియేషన్ రంగంలో కూడా శరవేగంగా అభివృద్ధి జరుగుతోందని రామ్మోహన్ నాయుడు అన్నారు.
ఇది కూడా చూడండి: Maha Kumbh Mela: రైల్వేశాఖకు పెద్ద షాకిచ్చిన భక్తుడు.. కుంభమేళాకు వెళ్లలేకపోయినందుకు 50 లక్షల నష్ట పరిహారం కట్టాల్సిందే!
ఇదిలా ఉండగా లావు శ్రీకృష్ణ దేవరాయలు కూడా బడ్జెట్‌పై స్పందించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు అభినందనలు తెలిపారు. గడిచిన ఏడు నెలల్లో అమరావతికి రూ.15 వేల కోట్లు, విశాఖ స్టీల్ ప్లాంట్‌కు రూ.16 కోట్లు కేంద్రం ఇచ్చిందన్నారు. పోలవరం కోసం రూ.12 వేల కోట్లు ఇవ్వనున్నారు. రైతులు, ఆక్వా రైతులు ఎక్కువగా ఉండే రాష్ట్రం ఏపీకి ఉపయోగపడే నిర్ణయాలు ఇచ్చారన్నారు. జల జీవన్ మిషన్‌ను ఏపీలో పొడిగించాలని కోరితే పొడిగించారన్నారు. అర్బన్ చాలెంజ్ ఫండ్ ద్వారా టూ టైర్, త్రీ టైర్ నగరాలకు నిధులు రానున్నాయని లావు శ్రీకృష్ణ దేవరాయలు అన్నారు.
ఇది కూడా చూడండి: Chennai Crime: ఏసీ ఆన్ చేసి..రసాయనాలు చల్లుతూ...వీడిన చెన్నై తండ్రికూతుళ్ల డెత్ మిస్టరీ!