మోదీ 3.0 తొలి పూర్తి బడ్జెట్ (Union Budget 2025) లో మధ్యతరగతి ప్రజలకు ఊరటనిస్తూ భారీ ప్రకటన చేశారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) . తన బడ్జెట్ ప్రసంగంలో ఆమె రూ. 12 లక్షల వరకు ఎటువంటి పన్నులు చెల్లించాల్సిన అవసరం లేకుండా రిబేట్ ప్రకటించారు. దీనితో పాటుగా ఆ విధానంలో శ్లాబ్‌లను కూడా మార్చారు. మీరు రూ. 75000 స్టాండర్డ్ డిడక్షన్ కలిపితే రూ. రూ.12,75,000 వరకు పన్ను ఉండదన్నమాట. పన్ను శ్లాబ్‌లలో ప్రభుత్వం చేసిన తాజా మార్పుల తర్వాత, ఎంత ఆదాయం ఉన్నవారికి ఎంత ఆదా అవుతుంది అనే దానిపై తెలుసుకుందాం.
Also Read : నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో రికార్డ్.. నాన్‌స్టాప్ గంటా 14 నిమిషాల స్పీచ్
కొత్త పన్ను శ్లాబ్ ప్రకారం రూ.12 లక్షల వరకు ఆదాయం ఉంటే రూ.80,000 ఆదా అవుతుంది. పాత పన్ను స్లాబ్ ప్రకారం, ఒక వ్యక్తి జీతం రూ. 12 లక్షలు అయితే, దానిపై రూ. 80,000 పన్ను చెల్లించాలి, కానీ పన్ను స్లాబ్‌లో తాజా మార్పు తర్వాత ఇప్పుడది సున్నాగా మారింది. కొత్త పన్ను శ్లాబ్ ప్రకారం రూ.16 లక్షల ఆదాయం ఉంటే రూ.50 వేలు, రూ.18 లక్షల ఆదాయం ఉంటే రూ.70 వేలు ఆదా అవుతుంది. రూ.20 లక్షల ఆదాయంపై రూ.90, వేలు, రూ.25 లక్షలు ఆపైన ఆదాయంపై రూ.1.10 లక్షలు ఆదా అవుతుందన్న మాట. అంటే వీరికి సగటున ఏటా 30% డబ్బు ఆదా అవుతున్నట్టే.
Also Read : శ్లాబుల గజిబిజి.. రూ.12 లక్షల వరకు నో ట్యాక్స్.. రూ.4-8 లక్షలు 5 శాతం ట్యాక్స్.. ఎలా ?
కొత్త పన్ను స్లాబ్ (2025)
రూ 0 నుండి 4 లక్షల వరకు -లేదు
రూ 4-8 లక్షల వరకు పన్ను -5 శాతం
రూ 8 నుండి 10 లక్షల వరకు - 10 శాతం
రూ 12 నుండి 16 లక్షల వరకు - 15 శాతం
రూ 16 నుండి 20 లక్షల వరకు - 20 శాతం
రూ.20- నుండి24 లక్షల వరకు - 25 శాతం
24 లక్షల కంటే ఎక్కువ సంపాదన ఉంటే 30 శాతం
Also Read : ఉడాన్ స్కీమ్‌తో 4 కోట్ల మందికి లబ్ధి.. అసలు ఈ స్కీమ్ ఏంటో తెలుసా?
ఇక కొత్త పన్ను విధానం ప్రకారం గతంలో రూ.15 లక్షల ఆదాయం దాటితే ఏకంగా 30శాతం పన్ను చెల్లించాల్సి ఉండేది. కానీ ఇప్పుడు రూ.16-20 లక్షలు, రూ.20-24 లక్షలు, రూ.24 లక్షలు ఆ పైన కొత్త శ్లాబ్‌లను తీసుకొచ్చారు మంత్రి సీతారామన్. దీంతో రూ.24 లక్షల ఆదాయం దాటితేనే 30శాతం పన్ను కట్టాల్సి ఉంటుంది. పాత పన్ను విధానాన్ని మాత్రం మంత్రి సీతారామన్ కదిలించలేదు. దీని ప్రకారం రూ.2.5 లక్షల వరకు పన్ను లేదు. అక్కడినుంచి రూ.5 లక్షల వరకు 5 శాతం పన్ను , రూ.5,00,001 నుంచి రూ.10 లక్షల వరకు 20 శాతం, ఆ తర్వాత నుంచి 30 శాతం పన్ను విధిస్తారు.
Also Read : Budget-2025: వచ్చేవారం ఆదాయపు పన్ను బిల్లు.. మార్పులేంటంటే ?