సేఫ్ హార్బర్ టాక్స్ ఫర్ నాన్ రెసిడెన్స్ ..| Safe harbor tax for non-residents | Budget |RTV
కేంద్ర ప్రభుత్వం శనివారం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఢిల్లీ ప్రజలపై ప్రభావం చూపించే ఛాన్స్ ఉందనే ప్రచారం నడుస్తోంది. రూ.12 లక్షల వరకు పన్ను మినహాయింపు, గిగ్ వర్కర్లకు ఆరోగ్య బీమా వంటి ప్రకటనలు అక్కడి ఓటర్లను ఆకట్టుకోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
జాతీయ పార్టీలు తెలంగాణ ప్రయోజనాలను కాపాడలేవని మరోసారి కేంద్ర బడ్జెట్ తో రుజువైందని కేటీఆర్ అన్నారు. BJP, కాంగ్రెస్ కు చెందిన 16 మంది ఎంపీలు బడ్జెట్లో తెలంగాణకు తెచ్చింది '0' అని అన్నారు. కేంద్రానికి తెలంగాణ అంటే ఎంత చిన్నచూపో మరోసారి తేలిపోయిందన్నారు.
కొత్త పన్ను శ్లాబ్ ప్రకారం రూ.12 లక్షల వరకు ఆదాయం ఉంటే రూ.80,000 ఆదా అవుతుంది. పాత పన్ను స్లాబ్ ప్రకారం, ఒక వ్యక్తి జీతం రూ. 12 లక్షలు అయితే, దానిపై రూ. 80,000 పన్ను చెల్లించాలి, కానీ పన్ను స్లాబ్‌లో తాజా మార్పు తర్వాత ఇప్పుడది సున్నాగా మారింది.