Cherlapally Jail : చర్లపల్లి కేంద్ర కారాగారం పారిశ్రామిక యూనిట్‌లో భారీ స్కాం జరిగినట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. తప్పు చేసి జైలుకు వచ్చిన ఖైదీల ప్రవర్తనలో మార్పు తెచ్చి వారు జైలు నుంచి విడుదలయిన తర్వాత తమకు నచ్చిన రంగంలో జీవోనోపాధి పొందేందుకు గాను జైలులోని పారిశ్రామిక యూనిట్‌లో శిక్షణ ఇస్తారు.సబ్బుల తయారీ, ఫినాయిల్ తయారీ, చేతి రుమాలు, టవళ్లు, ఇనుప వస్తువులు, ఫర్నీచర్, వ్యవసాయం ఇలా ఎవరికీ దేనిలో ఆసక్తి ఉంటే అందులో శిక్షణ ఇస్తారు. శిక్షణ అనంతరం వారితో ఆయా వస్తువులను తయారు చేసి వాటిని బయటి మార్కెట్‌లో విక్రయిస్తుంటారు. అయితే మార్కెట్‌లో విక్రయించగా వచ్చిన సొమ్మును కొంతమంది అధికారులు తమ జేబులో వేసుకున్నట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. ఈ విషయం చాలాకాలంగా సాగుతున్నప్పటికీ ఇటీవల వెలుగులోకి వచ్చింది. దీంతో ఈ విషయంపై విచారణ జరిపించాలని జైళ్లశాఖ డీజీ ఆదేశించినట్లు తెలిసింది.
Also read : AP 10th Result: ఏపీ టెన్త్ ఫలితాల్లో అరుదైన రికార్డ్.. 600 కు 600 మార్కులు!
కాగా చర్లపల్లితో పాటు రాష్ర్టవ్యాప్తంగా ఉన్న జైళ్లల్లో ఖైదీలు తయారు చేసే వస్తువులకు బయటి మార్కెట్‌లో మంచి గుర్తింపు ఉంది. నాణ్యత విషయంలో మిగతా వాటికి జైలు ఖైదీలు తయారు చేసే వస్తువులకు తేడా ఉంటుందని కొనుగోలు దారులు అంటున్నారు. దీంతో వారి వస్తువులకు మార్కెట్‌లో డిమాండ్ ఉంది. "మైనేషన్' అనే బ్రాండ్ నేమ్‌తో ఖైదీలు తయారు చేసిన వస్తువులను అధికారులు బయటి మార్కెట్‌లో విక్రయిస్తుంటారు. అలాగే చర్లపల్లి సెంట్రల్ జైలు పారిశ్రామిక యూనిట్‌లో ఖైదీలు తయారు చేసిన వస్తువులను కూడా విక్రయిస్తుంటారు.అయితే గతంలో జైలు సూపరింటెండెంట్‌గా పనిచేసిన ఓ అధికారి హయాంలో పారిశ్రామిక యూనిట్‌లో తయారైన వస్తువల విక్రయం లెక్కల్లో సుమారు రూ. 25 లక్షల మేర తేడా ఉన్నట్లు ఇటీవల అధికారులు గుర్తించారు.
Also Read: ప్రభుత్వం సంచలన నిర్ణయం..సెలబ్రిటీ బెట్టింగ్ యాప్స్ కేసు సీఐడీకి బదిలీ
ఇదొక్కటే కాకుండా జైలులో నిర్వహించే క్యాంటిన్‌లో కూడా రూ.7 లక్షలకుపైగా గోల్‌మాల్ జరిగినట్లు తేలింది. చర్లపల్లి జైలు ఆధ్వర్యంలో కొనసాగే పెట్రోల్ బంకు ఆదాయంలోనూ పెద్దమొత్తంలో తేడా జరిగినట్లు తేలింది. విషయాన్ని సీరియ్‌సగా తీసుకున్న జైళ్ల శాఖ డీజీ సౌమ్యా మిశ్రా నిధుల గోల్‌మాల్‌పై సమగ్ర విచారణ జరిపేందుకు ఐదుగురు అధికారులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశారు. నిధుల గోల్‌మాల్ విషయంలో వారం రోజుల్లోగా విచారణ జరిపి సమగ్ర నివేదిక అందజేయాలని కమిటీని ఆదేశించారు. డీజీ ఆదేశాల మేరకు బుధవారం మొదటి రోజు కమిటీ చర్లపల్లి జైలును సందర్శించి విచారణ మొదలు పెట్టింది. రికార్డుల పరిశీలించింది.
Also Read: హిమాచల్ ప్రదేశ్ లో హై అలెర్ట్..ఉగ్రదాడి జరగొచ్చనే హెచ్చరికలు
కాగా చర్లపల్లి జైలు పారిశ్రామిక యూనిట్‌లో నిధుల గోల్‌మాల్ వ్యవహారంలో స్టాక్ బుక్ కీలకంగా మారనుంది. యూనిట్‌లో వస్తువుల తయారీకి సంబంధించిన సమాచారం మొత్తం స్టాక్ బుక్‌లో నమోదు చేస్తారు. స్టాక్ బుక్‌లో నమోదు చేసిన వస్తువులు, బయట విక్రయం ద్వారా వచ్చిన డబ్బుల లెక్కసరిగా ఉండాలి. అయితే స్టాక్ బుక్‌లో నమోదు చేసిన వస్తువుల వివరాలు, ఆ సమయంలో వచ్చిన డబ్బుల డిపాజిట్‌విషయంలో భారీ తేడా ఉన్నట్లు విచారణ కమిటీ తేల్చింది. బయట విక్రయించిన వస్తువుల విషయంలో తేడాలు ఉన్నట్లు కమిటీ గుర్తించింది. మరోవైపు వివిధ సందర్భాల్లో పారిశ్రామిక ప్రదర్శనల్లో ఖైదీల ఉత్పత్తులకు ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయగా అక్కడ విక్రయించిన వస్తువుల వివరాలు, అమ్మకం ద్వారా వచ్చిన నగదు విషయంలోనూ తేడాలున్నట్లు తేలింది. దీంతో డీజీ సౌమ్య మిశ్రా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.
Also Read: టిఆర్‌ఎఫ్ ముసుగులో లష్కర్ ఈ తోయిబా దాడులు.. ఆన్‌లైన్‌లో యువకుల రిక్రూట్‌మెంట్!
Also Read: అఘోరీకి దిమ్మతిరిగే షాక్.. 10 ఏళ్లు జైల్లోనే - లాయర్ సంచలన వ్యాఖ్యలు