Summer Effect : చిల్డ్ బీర్ వేసి చిల్ అవుతున్నారు.. సేల్స్ డబుల్!

తెలుగు రాష్ట్రాల్లో బీర్ల సెల్స్ ఒక్కసారిగా పెరిగిపోయాయని షాపు యజమానులు చెబుతున్నారు. వీకెండ్స్ డిమాండ్ మరింత ఎక్కువైందని, గత వారంతో పోలిస్తే సేల్స్ 25 శాతం పెరిగాయని వ్యాపారులు అంటున్నారు. మున్మందు అమ్మకాలు రికార్డు స్థాయిలో ఉంటాయని అంటున్నారు.  

New Update
Beer: బీర్ హెల్త్ కు మంచిదే.. తప్పక తెలుసుకోండి!

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు (Sun) దంచికొడుతున్నాయ్. మార్చిలోనే 40 డిగ్రీలతో భానుడు భగభగమంటున్నాడు.  మార్చిలోనే ఇలా ఉంటే మే నెల వరకు పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.  దీంతో ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు యూత్ బాడీ కూలింగ్ కోసం చిల్డ్ బీర్ వేసి చిల్ అవుతున్నారు.  ఉదయం 10 గంటలనుంచే షాపుల ముందు క్యూ కడుతున్నారు.

Also read :  బిగ్ బాస్ కంటెస్టెంట్లపై కేసు నమోదు.. విష్ణుప్రియ, టేస్టీ తేజ ఇక జైలుకే!

Also Read :  సునీతా విలియమ్స్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఇదే.. ఆమె భారతీయ మూలాలు ఎక్కడంటే?

వీకెండ్స్ మరింత డిమాండ్

దీంతో తెలుగు రాష్ట్రాల్లో బీర్ల సేల్స్ (Beer Sales)  ఒక్కసారిగా పెరిగిపోయాయని షాపు యజమానులు చెబుతున్నారు. వీకెండ్స్ డిమాండ్ మరింత ఎక్కువైందని చెబుతున్నారు.  గత వారంతో పోలిస్తే సేల్స్ 25 శాతం పెరిగాయని వ్యాపారులు అంటున్నారు. సహాజంగా అయితే వారానికోకసారి స్టాక్ తెచ్చుకుంటామని కానీ ఇప్పుడున్న డిమాండ్ వరకు నాలుగు రోజులకొకసారి స్టాక్ తెప్పిస్తున్నామని చెబుతున్నారు వ్యాపారులు.

Also Read :  హలో మిస్టర్ చీటర్.. నిన్ను కర్మ వెంటాడుతోంది: హర్షసాయిపై మాజీ లవర్ షాకింగ్ పోస్ట్!

డిమాండ్ తగ్గట్టుగానే స్టాక్స్ కూడా తెచ్చిపెడుతున్నామని షాపు యజమానులు చెబుతున్నారు. మున్మందు అమ్మకాలు రికార్డు స్థాయిలో ఉన్న ఆశ్చర్యపోనవసరం లేదని అంటున్నారు.  ఈవెంట్స్, పెళ్లిళ్లకు సమ్మర్ మంచి టైమ్ కావడంతో బీర్ల డిమాండ్ మరింతగా ఉంటుందని వ్యాపారులు చెబుతున్నారు.  ఎండకాలం, ఐపీఎల్ పుణ్యమా అని మొత్తానికి తెలుగు రాష్ట్రాల ఖజానాకు భారీగానే ఆదాయం సమకూరుతుందన్నమాట. 

Also Read :  నల్గొండలో ఘోరం.. మాజీ సర్పంచ్‌ను గొడ్డళ్లతో నరికిన దుండగులు!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు