/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/WINES-CLOSED-jpg.webp)
నిజంగా ఇది మద్యం ప్రియులకు చేదువార్తే... ఓవైపు ఎండలు దంచి కొడుతున్న సమయంలో పగలంతా కష్టపడి పనిచేసిన మద్యం ప్రియులు రాత్రి చల్లటి బీర్లు తాగి పడుకుందాం అనుకున్నవారికి బ్యాడ్‌న్యూస్. రేపు మద్యం షాపులు క్లోజ్ కానున్నాయి. మద్యం దుకాణాలే కాదు. కల్లు దుకాణాలు కూడా బంద్ ఉండనున్నాయి. 12న శనివారం రోజున హనుమాన్ జయంతి పండుగ సందర్భంగా మద్యం షాపులు క్లోజ్ చేయాలని పోలీసులు ఆదేశించారు. ఇక హైదరాబాద్ నగరంలో హనుమాన్ జయంతి రోజున హనుమాన్ విజయ యాత్రను పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. ఈ క్రమంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడం కోసం నగరవ్యాప్తంగా అన్ని వైన్స్, కల్లు దుకాణాలను బంద్ చేయాలని హైదరాబాద్ నగర పోలీసులు ఆదేశించారు.
Also Read: Live in relationship: పెళ్లి కాకుండా తల్లిదండ్రులైన వారికి హైకోర్టు గుడ్‌న్యూస్
Also Read : బైక్‌పై హిందూ యువకుడు, ముస్లిం యువతి.. నలుగురు యువకులు ఏం చేశారంటే ?
Wine Shops Closed In Hyderabad
దీంతో మార్చి 12వ తేదీన శనివారం నాడు ఉదయం ఆరు గంటల నుంచి మరుసటి రోజు ఉదయం ఆరుగంటల వరకు హైదరాబాద్ నగరంలోని అన్ని వైన్స్, కల్లు దుకాణాలు బంద్ చేస్తున్నారు. ఎవరైనా పోలీసుల ఆదేశాలు ఉల్లంఘించి ఎక్కడైనా అక్రమంగా మద్యాన్ని విక్రయించినట్లు తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. లైసెన్సు రద్దు చేస్తామని వార్నింగ్ ఇస్తున్నారు. పోలీసుల నిర్ణయంతో మందుబాబులు అలెర్ట్ అయ్యారు. రేపటి కోసం ఈ రోజే మద్యం కొనుగోలు చేస్తున్నారు.
Also Read: ఇదొక విచిత్రమైన లవ్ స్టోరీ.. ఫ్యాన్ రిపేర్ కోసం వచ్చి పాపను పడేశాడు!
అయితే ఇదే సమయంలో స్టార్ హోటల్స్ లో ఉన్న బార్లు, లైసెన్స్ ఉన్న క్లబ్బులకు మాత్రం మినహాయింపు ఇస్తున్నట్టు హైదరాబాద్ నగర పోలీసులు ఒక ప్రకటనలో వెల్లడించారు. హనుమాన్ జయంతి రోజున లిక్కర్ షాపులు క్లోజ్ ఉంటాయని వెల్లడించడంతో, మందుబాబులు ఇప్పటినుంచి అలర్ట్ అవుతున్నారు. లిక్కర్ షాప్ ని క్లోజ్ అయ్యే రోజు లిక్కర్ కు ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ముందే కొనుక్కొని రెడీగా పెట్టుకుంటున్నారు.
Also Read: స్కూల్ బ్యాగ్‌లో కండోమ్స్, తంబాకు ప్యాకెట్లు, కత్తులు, అగ్గిపెట్టలు.. ఎవర్రా మీరంతా!
Hanuman Jayanti 2025 | wine-shops-closed-in-telangana | wine-shops-closed | latest telangana news | today-news-in-telugu | latest-telugu-news | breaking news in telugu