/rtv/media/media_files/2025/04/06/VLrwsShzF2jS0uxNvk4Q.jpg)
Husband attacks wife
గచ్చిబౌలిలో నడిరోడ్డుపై దారుణం చోటుచేసుకుంది.. గర్భిణిని చంపేందుకు భర్త యత్నించడం కలకలం రేపింది. గర్భవతిగా ఉన్న భార్యను ఆసుపత్రికి తీసుకువచ్చిన ఓ భర్త బండరాయితో మోదీ హత్య చేసేందుకు యత్నించాడు. నడిరోడ్డు మీద భార్యపై దాడి చేసి దాదాపు పది నుంచి పదిహేను సార్లు బండరాయితో మోదడంతో తీవ్ర గాయాలపాలైన మహిళ చావుబతుకుల మధ్య ఆసుపత్రిలో అపస్మారక స్థితిలో చికిత్స పొందుతుంది.
Also read : మరికొన్ని రోజుల్లో పెళ్లి... కాబోయే భర్త కళ్లముందే యువతి మృతి!
ఏం జరిగిందో ఏమో గానీ
గర్భవతిగా ఉన్న భార్యను ఆసుపత్రికి తీసుకువచ్చిన ఓ భర్త ఏం జరిగిందో ఏమో గానీ, ఒకసారిగా భార్యమీద దాడి చేశాడు.బండరాయితో మోదీ హత్య చేసేందుకు యత్నించాడు. నడిరోడ్డు మీద భార్యపై దాడి చేసి దాదాపు పది నుంచి పదిహేను సార్లు బండరాయితో మోదడంతో తీవ్ర గాయాలపాలైంది. ఆసుపత్రిలో అపస్మారక స్థితిలో చావుబతుకుల మధ్య చికిత్స పొందుతుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య మీద దాడి చేసిన నిందితుడిని గచ్చిబౌలి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అయితే ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. దాడి దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.
Also Read: 131 రోజుల నిరాహార దీక్ష విరమించిన రైతు ఉద్యమ నాయకుడు
పోలీసుల కథనం ప్రకారం… వికారాబాద్‌కు చెందిన ఎండి బస్రత్ (32) బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి ఇంటీరియర్ పనులు చేసుకుంటూ కుటుంబంతో కలిసి హఫీజ్ పేట్ పరిధిలోని ఆదిత్యనగర్‌లో నివాసం ఉంటున్నాడు. కాగా 2023 జనవరిలో అజ్మీర్ దర్గాకు వెళ్లే క్రమంలో ప్రయాణంలో బస్రత్‌కు కోల్‌కతాకు చెందిన షబానా పర్వీన్(22) పరిచయం అయ్యింది. వీరి పరిచయం ప్రేమగా మారగా, 2024 అక్టోబర్‌లో పెళ్లి చేసుకున్నారు.వివాహం అనంతరం ఇద్దరు హఫీజ్ పేట్ ఆదిత్యనగర్‌లో కాపురం పెట్టగా, బస్రత్ ఇంటీరియర్ డిజైన్ పనులు చేస్తున్నాడు. పెళ్లి అనంతరం మొదట అత్తామామలతో కలిసి ఉండగా, కుటుంబంలో కలహాలు ఏర్పడ్డాయి.
Also read: Rameswaram: డీఎంకే ప్రభుత్వంపై మోదీ ఫైర్.. వాళ్లు తమిళంలో సంతకం చేయాలన్న ప్రధాని
దీంతో బస్రత్, షబానా పర్వీన్‌లు స్థానికంగా వేరు కాపురం పెట్టారు. ప్రస్తుతం షబానా పర్వీన్ రెండు నెలల గర్భిణి కాగా, మార్చి 29న పర్వీన్‌కు వాంతులు కావడంతో కొండాపూర్ రాఘవేంద్రకాలనీలోని సియా లైఫ్ ఆసుపత్రిలో చేర్పించారు. రెండు రోజులు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న తరువాత పర్వీన్‌ను ఏప్రిల్ 1వ తేదీన రాత్రి డిశ్చార్జ్ చేశారు. ఆసుపత్రి బయటకు రావడంతోనే, హాస్పిటల్ ముందే భార్యాభర్తలకు గొడవ జరిగింది. ఇద్దరి మద్య మాటామాటా పెరగడంతో బస్రత్ ఒక్కసారిగా తన భార్య పర్వీన్ మీద దాడికి తెగబడ్డాడు. నడిరోడ్డు మీద పెనుగులాటలో కిందపడిన భార్య మీద అక్కడే ఉన్న బండరాయితో దాడి చేశాడు. దాదాపు 10 నుంచి 12సార్లు రాయితో మోదడంతో పర్వీన్ తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితికి వెళ్లింది. చనిపోయిందని భావించిన బస్రత్ అక్కడి నుంచి పారిపోయాడు.
Also read: Ramnavami: రామాలయంలో అపశృతి.. టెంట్లు కూలీ భక్తుల తలలు పలిగాయి
ఈ ఘటనను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా, సంఘటనా స్థలికి చేరుకున్న గచ్చిబౌలి పోలీసులు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న పర్వీన్‌ను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కాగా పర్వీన్ పరిస్థితి విషమంగా ఉండడంతో కుటుంబ సభ్యులు మియాపూర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి, అక్కడి నుంచి నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం కోమాలో ఉన్న పర్వీస్ ప్రాణాలతో పోరాడుతుంది. పర్వీన్ కుటుంబ సభ్యుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న గచ్చిబౌలి పోలీసులు నిందితుడు బస్రత్‌ను ఈనెల 3న అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
vikarabad-district | love-marriage | kondapur | wife-and-husband | latest telangana news | telangana-news-updates | telangana news today | telangana crime news | telangana crime incident | telangana-crime-updates | latest-telugu-news | today-news-in-telugu
Danam Nagender : కేసీఆర్ వరంగల్ సభ సక్సెస్ అవుతుంది.. దానం సంచలన కామెంట్స్
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ వరంగల్ సభ సక్సెస్ అవుతుందని జోస్యం చెప్పారు. కేసీఆర్ కోసం భారీగా జనం వస్తారని అన్నారు. మరోవైపు ఐపీఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ చేసిన ట్వీట్ సబబే అని వెల్లడించారు.
danam nagender brs
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ వరంగల్ సభ సక్సెస్ అవుతుందని జోస్యం చెప్పారు. కేసీఆర్ కోసం భారీగా జనం వస్తారని అన్నారు. ఎప్పటినుండో కేసీఆర్ ను చూడ్డానికి జనం ఆశగా ఉన్నారని.. సభకు కూడా జనం బాగా వస్తారని తాను కూడా అనుకుంటున్నాని తెలిపారు. హిమాయత్ నగర్ కార్పొరేటర్ గడ్డం మహాలక్ష్మి రామన్ గౌడ్ ఆధ్వర్యంలో బుధవారం నారాయణగూడ కమ్యూనిటీ హల్ లో జలమండలి, ఇతర అధికారులు, పారిశుద్ధ్య కార్మికులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కంచ గచ్చిబౌలి భూముల విషయంలో ఐపీఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ చేసిన ట్వీట్ సబబే అని దానం వెల్లడించారు.
Also read : పహల్గాంలో భయంకరమైన కాల్పుల లైవ్ వీడియోలు.. చూశారంటే గజగజ వణకాల్సిందే!
వ్యక్తిగతంగా బాధించింది
అయితే రాష్ట్ర సీఎస్ శాంతకుమారిపై సుప్రీంకోర్టు సీరియస్ అవ్వడం తనను వ్యక్తిగతంగా బాధించిందన్నారు. శాంతకుమారికి మంచి అధికారిగా పేరు ఉందన్నారు. కంచ గచ్చిబౌలి భూముల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేస్తోందని వెల్లడించారు. కాగా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కేసీఆర్‌పై దానం అనుకూలంగా కామెంట్స్ చేయడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. మళ్లీ దానం బీఆర్ఎస్‌లోకి వెళ్తారంటూ పోలిటికల్ సర్కిల్ లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ తరుపున ఎమ్మెల్యేగా గెలిచిన దానం ఆ తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరారు.
Also Read : ఎంత దారుణంగా చంపారంటే.. బయటకు వచ్చిన ఉగ్రదాడి ఫస్ట్ వీడియో!
🔴Pahalgam Terrorist Attack Live Updates: కశ్మీర్ లో ఉగ్రవాదుల వేట.. లైవ్ అప్డేట్స్!
Rohit Sharma: కెవ్ కేక.. T20ల్లో రోహిత్ శర్మ అదిరిపోయే రికార్డు
Shine Tom Chacko షైన్ పై మరో నటి సంచలనం.. సెట్ లో లైంగికంగా..
Khaidi No 12121🔴LIVE : Aghori Srinivas in Chanchalguda | జైలులో అఘోరీ | Sri Varshini | RTV
Marriage cancel : ఉగ్రదాడి ఎఫెక్ట్.. పాపం పాకిస్థాన్ అమ్మాయితో పెళ్లి క్యాన్సిల్!