Atrocity: రెండు కోట్ల బీమా కోసం దారుణం.. స్నేహితుడి చంపేందుకు కుట్ర

డబ్బు మానవ సంబంధాలను దూరం చేస్తుందని అనేకసార్లు రుజువైంది. అనాథ అయిన ఒక యువకుడిపై రెండు కోట్లు బీమా చేయించి, ఆ డబ్బును కాజేయడానికి అతడిని హతమార్చేందుకు పథకం పన్నారు ఇద్దరు వ్యక్తులు. అయితే ఆ ప్రయత్నం వికటించి కటకటాల పాలయ్యారు.

New Update
Murder

Murder plan

డబ్బు మానవ సంబంధాలను దూరం చేస్తుందని అనేకసార్లు రుజువైంది. డబ్బుకోసం తన,పర అనే బేధం లేకుండా వారిని హతమార్చడానికి(murder) కూడ వెనుకాడరు. అలాంటి ఘటనే ఖమ్మం జిల్లా(khammam) లో నెలకొంది. అనాథ అయిన ఒక యువకుడిపై రెండు కోట్లు బీమా చేయించి, ఆ డబ్బును కాజేయడానికి అతడిని హతమార్చేందుకు పథకం పన్నారు ఇద్దరు వ్యక్తులు. అయితే ఆ ప్రయత్నం వికటించి కటకటాల పాలయ్యారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..​ సారపాకలోని ఐటీసీ పీఎస్పీడీలో గతంలో కాంట్రాక్ట్ కార్మికుడిగా పని చేసిన యశ్వంత్ అనే యువకుడు అనాథ. అతనికి  తల్లిదండ్రులు లేరు. అయితే అదే  గ్రామానికి చెందిన కట్టా సాయిదీపక్, యశ్వంత్ తో గత ఆరు నెలలుగా స్నేహం చేస్తున్నాడు. అతనికి అన్ని విధాలా ఆర్థిక సాయం చేయడంతో పాటు అన్ని విషయాల్లో అండగా ఉంటున్నట్లు నటిస్తూ వచ్చాడు. వీరిద్దరికి భద్రాచలానికి చెందిన ప్రైవేట్ బ్యాంక్ ఇన్సూరెన్స్ సేల్స్ ఆఫీసర్ కొండ భానుప్రకాశ్ కూడా తోడయ్యాడు. అయితే ఈ క్రమంలోనే ఆర్థిక ఇబ్బందులు పడుతున్న  సాయిదీపక్, ఇన్సూరెన్స్ రంగం(insurance-company) లో అవగాహన ఉన్న భానుప్రకాశ్ కలిసి యశ్వంత్ ను చంపాలనుకున్నారు. తద్వారా వచ్చే బీమా సొమ్ము(Accidental Insurance Policy) తో ఆర్థికంగా సెటిల్‌ కావచ్చని ప్లాన్‌చేశారు.  

Also Read :  లవర్ ను చంపేసి క్షుద్ర పూజలు.. శవంతోనే శృంగారం చేసి పరార్!

Atrocity For Two Crores Insurance

అయితే మరో ట్టిస్ట్‌ కూడ నెలకొంది. యశ్వంత్, సాయిదీపక్ ​కులాలు వేరైనా వారిద్దరి ఇంటి పేరు (కట్టా) ఒకటే.  అది కూడా నిందితులకు కలిసివచ్చింది.ముందుగా అనుకున్న ప్లాన్‌ ప్రకారం నాలుగు నెలల క్రితం యశ్వంత్ పేరిట రెండు కోట్ల రూపాయలకు నిందితులు బీమా చేయించారు. అందులో భాగంగా యశ్వంత్ కు సాయిదీపక్ సోదరుడు అవుతాడని రికార్డుల్లో చూపిస్తూ నామినీగా పేరు నమోదు చేయించారు.

అంతా అనుకున్నట్లే జరగడంతో ఇక​పథకంలో భాగంగా గత శనివారం రాత్రి భద్రాచలంలో యశ్వంత్ కు ఒక స్కూటీ ఇప్పించి, మద్యం కొనిచ్చి సారపాక సమీపంలోని మోతె పట్టీనగర్ కు రమ్మని చెప్పారు. అనుకున్న ప్లాన్‌ ప్రకారం సాయిదీపక్, భానుప్రకాశ్ కారులో ముందుగానే అక్కడికి చేరుకున్నారు. అనంతరం యశ్వంత్ వచ్చాక సమ్మక్క-సారలమ్మ గద్దెల వద్ద అతనికి మద్యం తాగించారు, ఈ క్రమంలోనే నిందితులు ఒక్కసారిగా అతడి తలపై బలమైన వస్తువుతో దాడి చేశారు.​ దెబ్బలకు యశ్వంత్ స్పృహ కోల్పోయాడు, అతను చనిపోయాడుకుని అతడిని రోడ్డుపై పడుకోబెట్టి స్కూటీని దూరంగా పడేశారు. చూడాడానికి రోడ్డు ప్రమాదంగా కనిపించేలా ఏర్పాటు చేశారు. అయితే రోడ్డుపై వెళ్తున్న స్థానికులు రక్తం మడుగులో పడి ఉన్న యశ్వంత్ ను చూసి  పోలీసులకు సమాచారం ఇచ్చారు.

ఈ లోపు నిందితులు అక్కడకు వచ్చి గాయపడింది మా వాడే అని నమ్మించి అంబులెన్స్ లో ఆస్పత్రికి తరలించారు.​ యశ్వంత్ ను భద్రాచలం నుంచి ముందు గుంటూరుకు, అక్కడి నుంచి తిరిగి ఖమ్మం తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. అయితే దీనిపై అనుమానం వచ్చిన పోలీసులు విచారించగా అసలు విషయం బయటపడింది. బూర్గంపాడు ఎస్ఐ మేడా ప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read :  మంచిర్యాల జిల్లాలో దారుణం. భర్తను కత్తితో పొడిచి చంపిన భార్య

Advertisment
తాజా కథనాలు