/rtv/media/media_files/2026/04/15/mangli-2026-04-15-18-28-01.jpg)
MANGLI CASE
MANGLI CASE : సింగర్ మంగ్లీ కేసు(singer mangli case) రోజుకో మలుపు తిరుగుతుంది. రోజు రోజుకు బాధితుల సంఖ్య పెరుగుతుంది. బాధితులు పెరుగుతున్న క్రమంలో రోజుకో ట్విస్ట్ నెలకొంటుంది. కాగా ఈ కేసులో కీలక నిందితులుగా అనుమానిస్తున్న రమావత్ మధు, బాలాజీ నాయక్, భరత్ చౌహాన్‌లు పరారీలో ఉన్నట్లు తెలుస్తుంది. ఈ ముగ్గురిపై నల్గొండ(nalgonda), గద్వాల్(gadwal) లో 62 కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. కాగా,ఈ కేసులను సీఐడీకి బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాగా మధు గ్యాంగ్ కోసం సీఐడీ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. నిందితులు సిమెంట్ కంపెనీలో పెట్టుబడుల పేరుతో కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు తెలుస్తోంది.
Also Read : ప్రపంచ ప్రజలకు గుడ్ న్యూస్.. చమురు ధరలు భారీగా తగ్గుతాయన్న ట్రంప్
Mangli vs Lawyer Subbarao
కాగా, ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని మంగ్లీ అంటుంది. అదే సమయంలో మంగ్లీకి ఈ వ్యవహారంతో సంబంధం లేదని మధు వీడియో రిలీజ్ చేయడం సంచలనంగా మారింది. అదే సమయంలో కంపెనీలో పెట్టిన దాదాపు రూ.20 కోట్లు(Singer Mangli 200 Cr Scam).. హిమాకాంత్ రెడ్డి తీసుకున్నాడని మధు ఆరోపించడం గమనార్హం.హిమాకాంత్ రెడ్డి అడ్వకేట్ సుబ్బారావు ఇద్దరు స్నేహితులని, సుబ్బారావును హిమాకాంత్ రెడ్డే పరిచయం చేశాడని మధు చెప్తున్నాడు.
హిమాకాంత్ రెడ్డి నుంచి డబ్బులు ఇప్పిస్తానని సుబ్బారావు చెప్పాడని, దానికోసం సెలబ్రిటీల నెంబర్స్ కావాలని నన్ను సుబ్బారావు అడిగాడని మధు వెల్లడించాడు.బిగ్‌బాస్‌లోకి వెళ్లాలని ప్రయత్నం చేశాడని వివరించాడు. సుబ్బారావుతో ఉన్నది అసలైన బాధితులు కాదని మధు ఆరోపించారు.
Also Read : స్నాప్‌చాట్ సంచలన నిర్ణయం: 20 శాతం మంది ఉద్యోగులపై వేటు!
Follow Us