TDP-Janasena Allinace: టీడీపీ-జనసేన పొత్తు లాభమా...నష్టమా...ఎవరి వాటా ఎంత?

ఆంధప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీ చేస్తామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన ప్రకటన రాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపు అనే చెప్పొచ్చు. అందుకే అంతటా ఈ విషయం గురించే చర్చించుకుంటున్నారు. వైసీపీకి చెక్ పెట్టేందుకే ఇప్పుడు టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తున్నారనే విషయం అందరికీ తెలిసిందే అయినా టీడీపీ, జనసేన పార్టీల్లో ఈ పొత్తు ఎవరికి ఎక్కువ లాభం అని తెగ చర్చించేసుకుంటున్నారు. క్రితం ఎన్నికల్లో కేవలం ఒక్క సీటు గెలచుకుని నవ్వులు పాలైన జనసేన ఈసారి అయినా టీడీపీ పొత్తుతో కనీస గౌరవనీయమైన స్థానాలు సంపాదించుకోవచ్చని అనుకుంటోంది.

New Update
TDP-Janasena Allinace: టీడీపీ-జనసేన పొత్తు లాభమా...నష్టమా...ఎవరి వాటా ఎంత?

TDP-Janasena Allinace: గత ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేయడం వల్లే ఓట్లు చీలి జగన్ అధికారంలోకి వచ్చారంటూ చెబుతున్న పవన్ (Pawan kalyan) ఈసారి వైసీపీని (YSRCP) గట్టి దెబ్బ కొట్టాలని డిసైడ్ అయ్యే పొత్తుమాట ఎత్తినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. జనసేనతో టీడీపీకి పొత్తు పెద్దగా అక్కర్లేదు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో...చంద్రబాబు అరెస్ట్ అవడంతో ఆ పార్టీకి కూడా జనసేన బలం అవసరమే అని అంటున్నారు. ఇక జనసేన పార్టీకి (Janasena Party) అయితే ఈ పొత్తు తప్పనిసరి. ఒంటరిగా పోటీ చేస్తే గతంలో లాగే గెలుపు ఏమీ ఉండదనే విషయం ఆ పార్టీకి కూడా బాగా తెలుసు. గత ఎన్నికల్లో ఒక్కసీటు గెల్చుకుని పార్టీ పరువు పోగొట్టుకున్న పవన్ సేన ఈసారి ఎన్నికల్లో అమీతుమీ తేల్చుకుని కొన్ని స్థానాల్లో అయినా గెలిచి పరువు నిలబెట్టుకోవాలని చూస్తోంది. అందులో భాగంగానే ఎన్డీఏలో చేరి బీజేపీకి జైకొట్టింది. ఇప్పుడు టీడీపీతో పొత్తు పెట్టుకుంది.

పొత్తుతో రెండు పార్టీలకూ లాభాలు కనిపిస్తున్నా సీట్ల విషయంలో గొడవలు రావొచ్చేమో అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. టీడీపీ, జనసనేల మధ్య పొత్తు ఖరారైనా సీట్లు సర్దుబాటు, ఓట్ల మళ్లింపులో ఏమాత్రం పొరపొచ్చాలు రాకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. చంద్రబాబు పెద్దమనసుతో చిన్న పార్టీకి కనీసం 20, 30 సీట్లన్నా కేటాయించాల్సి ఉంటుంది. మరోపక్క కమ్యూనిస్టు పార్టీలు కూడా చంద్రబాబు (Chandrababu)తో దోస్తీకి సై అంటున్నాయి కనుక అవి కూడా జట్టు కడితే వాటికీ కొన్ని సీట్లను విదల్చక తప్పదు. ఎంతలేదన్నా కనీసం 30, 40 సీట్లు పొత్తు కింద వదులుకోవాలి. 175 సీట్లలో 40 సీట్లు పొత్తు ధర్మం కింద వెళ్తే 135 సీట్లు మాత్రమే సైకిల్ పార్టీకి మిగులుతాయి. టీడీపీకి బలం లేని స్థానాలల్లో జనసేన, కమ్యూనిస్ట్ పార్టీలు పోటీ చేయడానికి ఒప్పుకుంటాయో లేదో తెలియదు.అవి అందుకు అంగీకరించకపోతే తన బలమైన స్థానాల్లో కొన్నింటిని త్యాగం చేయాల్సి వస్తుంది. గత ఎన్నికల్లో ఘోరంగా ఓడిన టీడీపీ (TDP)...ఈసారి ఎలా అయినా గెలిచితీరాలి అనుకుంటోంది. దీని బట్టి వచ్చే ఎన్నికలు ఆ పార్టీకి అగ్నిపరీక్షే. ఒకవేళ మళ్ళీ ఓడిపోయినా...20, 30 సీట్లతో సరిపెట్టుకున్నా తెలుగుదేశం శాశ్వతంగా తెరమరగయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. మరోవైపు ఈసారి కూడా ఆంధ్రలో వైసీపీనే వస్తుందని సర్వేలు కోడై కూస్తున్నాయి.ఇలాంటప్పుడు జనసేనతో పొత్తు బాబుకు ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది సందేహమే. దీనికి పార్టీ అధినేత పూర్తి సుముఖ్ంగా ఉన్నారా లేదా అనే విషయం కూడా స్పష్టంగా తెలియడం లేదు. ఎందుకంటే బాబును జైల్లో కలిశాక రెండు పార్టీలు కలుస్తాయని పవన్ చెప్పారు కానీ బాలకృష్ణ కానీ, లోకేశ్ కానీ ఒక్క మాట దాని గురించి మాట్లాడలేదు. తరువాత కూడా ఎక్కడా ఆ విషయం గురించి మాట మాత్రంగా అయినా ఎత్తలేదు. జగన్‌కు వ్యతిరేకంగా కూడగట్టుకునే మద్దతుకు ...బలమైన స్థానాలు ఇవ్వడం లాంటి భారీ మూల్యం చెల్లించుకునేంత అమాయకుడు బాబు అయితే కాదు. అందుకే పవన్ పొత్తు గురించి చెప్పినా దాని కార్యాచరణ మాత్రం వెంటనే అమలు చేయలేదు. అసలు చంద్రబాబు జైలు నుంచి బయటకు వచ్చేవరకు దాని ఊసు కూడా ఎత్తరనేది స్పష్టం అవుతోంది.

Also Read: సైకో జగన్‌ను శాశ్వతంగా ఇంటికి పంపిస్తాం..

పొత్తు నిర్ణయం కేవలం అరగంటలో తీసుకునే విషయమైతే కాదు. దీనికి టీడీపీ నేతలు టీడీపీ నేతలు, శ్రేణులు ఎంతవరకు సపోర్ట్ చేస్తారనేది కూడా ఆలోచించాల్సిన విషయం. పార్టీ నేతలు, శ్రేణుల సహకారం లేకపోతే బాబు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేరు. ఒకవేళ వాళ్ళని ఒప్పించడానికి ఆయన ప్రయత్నిస్తారు అని అనుకున్నా...ఏం చెప్పి ఒప్పిస్తారనేది పెద్ద ప్రశ్నగా మారింది. ఎందుకంటే నసేనతో పొత్తు వల్ల టీడీపీకి పెద్దగా ఒరిగేది ఏమీ కనిపించడం లేదు కాబట్టి. సీట్లను, ఓట్లను త్యాగం చేసి పరాయి పార్టీకి మద్దతిచ్చేందుకు టీడీపీ కేడర్ ఒప్పుకోకపోవచ్చనే అంటున్నారు.ఎక్కువ మాట్లాడితే పార్టీ వదిలి వెళ్ళి పోయే ప్రమాదం కూడా ఉంది. గోదావరి, విశాఖ వంటి జిల్లాల్లో పలుచోట్ల తిరుగుబాట్లు లేచినా ఆశ్చర్యపోనక్కర్లేదు.అదే జరిగితే కనుక టీడీపీ పరిస్థితి మరీ దారుణంగా తయారవుతుంది.

బీజెపీతో కలిస్తే ఏమైనా లాభం ఉంటుందా...

జనసేన అధినేత పవన్ కల్యాణ్ టీడీపీ కన్నా ముందు బీజెపీతో కలిసి ఉన్నారు. ఇప్పుడు కూడా టీడీపీ, జనసేన, బీజెపీ కలవాలనే ఆయన కోరి ఉంటారు. పోనీ అలా మూడు పార్టీలు కలిస్తే ఏమైనా ఉపయోగం ఉంటుందా అని ఆలోచిస్తే..ఏపీలో బీజెపీకి ఏం బలం లేదు. ఈ విషయం చంద్రబాబుకు బాగా తెలుసు. కాకపోతే ఎన్నికల ఏర్పాట్లు, కేంద్రం నుంచి తగిన సహాయ సహకారాలు అందుతాయనే ఆశ మాత్రం ఉంటుంది. వాటి కోసమే బీజెపీతో కలుస్తారా లేదా అనేది ఆలోచించాలి. అయితే ఇక్కడ మరో విషయం ఏంటంటే.. జగన్ కూడా మోదీకి అనుకూలంగానే వ్యవహరిస్తున్నారు.ఈ నేపథ్యంలో బీజేపీ.. పవన్ పిలుపుకు ఎంతవరకు స్పందిస్తుందన్నది ఆసక్తికరం. జనసేనాని మాటలకు వాల్యూ ఇచ్చి ఒకవేళ బీజెపీ కూడా టీడీపీ, జనసేనలతో కలిస్తే అప్పుడు పరిస్థితి మరింత టఫ్ అవుతుంది. సీట్ల సర్ధుబాటు చేయడం చాలా కష్టం అయిపోతుంది. ఎందుకంటే రాష్ట్రంలో పాగా వేయడానికి బీజెపీ చూస్తోంది. అలాంటప్పుడు ముఖ్యమైన, బలమైన స్థానాల కోసమే ఆ పార్టీ కూడా చూస్తుంది. అప్పుడు ఎవరు త్యాగం చేస్తారు, ఎవరికి ఇవ్వాలి ఇలాంటివన్నీ పెద్ద గొడవే అవుతుంది.

Also Read: మాజీ సీఎం అరెస్ట్ కు నిరసనగా వాళ్లు ఏం చేశారంటే..?

మరోవైపు ఇక ధరల పెరుగుదల నేపథ్యంలో, ఆంధ్రాకు నిధులు కేటాయిడం లేదు లాంటి విషయాల్లో ఏపీ ప్రజలకు బీజెపీ మీద చాలా కోపమే ఉంది. దాన్ని కనుక ఎన్నికల్లో చూపించారంటే మాత్రం టీడీపీ, జనసేనలు బలికావాల్సి ఉంటుంది. ఎన్నికలకు ఇంకా ఆరేడు నెలల గడువు ఉంది కాబట్టి అప్పటి పరిస్థితి ఎలా ఉంటుందో కచ్చితంగా చెప్పడం కష్టం. బాబు అరెస్టుతో నిజంగానే టీడీపీపై ప్రజల్లో సానుభూతి, లోకేశ్ యువగళం పాదయాత్ర ప్రభావం, పవన్ ఎన్నికల కోసం సినిమాలకు తాత్కాలికగా బ్రేక్ ఇచ్చి వారాహి విజయయాత్రను కొనసాగించి హోరాహోరాగా తలపడితే ఆశించినది కొంత సాధ్యం కావొచ్చు. కేడర్‌ ‌ బుజ్జగించి ఓట్ల బ్యాంకులను కూటమి సీట్లవైపు మళ్లించి, ప్రభుత్వ వ్యతిరేకతను ఓట్లలోకి మర్చుకుంటే ఫలితం ఉండొచ్చు.

Advertisment
Advertisment
తాజా కథనాలు