Ethiopia: నదిలో పడిన ట్రక్కు..71 మంది మృతి!
ఇథియోపియాలో ఘోర ప్రమాదం జరిగింది. పెళ్లి బృందంతో వెళ్తున్న ట్రక్కు ఒకటి నదిలో పడిపోవడంతో సుమారు 71 మంది మృతి చెందారు. మృతదేహల కోసం నదిలో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
ఇథియోపియాలో ఘోర ప్రమాదం జరిగింది. పెళ్లి బృందంతో వెళ్తున్న ట్రక్కు ఒకటి నదిలో పడిపోవడంతో సుమారు 71 మంది మృతి చెందారు. మృతదేహల కోసం నదిలో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
ఆఫ్గానిస్థాన్‌పై పాక్ వైమానిక దాడులు జరిపిన విషయం తెలిసిందే. దీనికి ప్రతీకారంగా పాక్ సరిహద్దు ప్రాంతంలోని కుర్రమ్పై ఆఫ్గానిస్థాన్ దాడులకు పాల్పడింది. ఈ ఎదురు కాల్పుల్లో 25 మంది పాక్ సైనికులు మృతి చెందగా.. మరో 200 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
తూర్పు గోదావరి జిల్లాలో రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. బూరుగుపూడి గేట్ దగ్గర ఉన్న అద్భుత రెసిడెన్సీలో రేవ్ పార్టీ జరుగుతుందని పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని 5 గురు యువతులు, 12 మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు.
డాక్టర్ నిర్లక్ష్యం కారణంగా ఓ వ్యక్తి మృతి చెందాడు. వైద్యం వికటించినందునే వెంకటేష్ మృతి చెందాడని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. ఆస్పత్రి ఎదుట బైఠాయించి ఆందోళన చేశారు. ఈ ఘటనపై విచారణ జరిపి మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
దక్షిణ కొరియా విమానం ప్రమాదానికి కొన్ని గంటల ముందు మరో రెండు వేర్వేరు చోట్ల ఫ్లైట్లు అదుపు తప్పాయి. కెనడాలోని హాలిఫాక్స్ ఎయిర్‌పోర్టుతో పాటు నార్వేలోని టోర్ప్ ఎయిర్‌పోర్టులో విమానాలు అదుపు తప్పాయి. అదృష్టవశాత్తు తృటిలో పెను ప్రమాదాలు తప్పాయి.
తెలంగాణ పోలీసు డిపార్ట్మెంట్లో వరుస ఆత్మహత్య ఘటనలు కలవరం రేపుతున్నాయి. తాజాగా మరో ముగ్గురు కానిస్టేబుళ్లు మృతి చెందారు. ఒకే రోజు వేర్వేరు ఘటనల్లో వీరు ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరు సూసైడ్ చేసుకోగా.. మరొకరు గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు.
కజికిస్తాన్ ప్రమాదం మరవకముందే మరో విమాన ప్రమాదం దక్షిణ కొరియాలో చోటుచేసుకుంది. 175 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో ప్రయాణిస్తున్న విమానం ముయూన్ ఎయిర్‌పోర్టు రన్‌వే గోడను అదుపు తప్పి ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 179 మంది మృతి చెందారు.
ముంబాయికి చెందిన ఓ యువకుడు స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. ఫేక్ మెయిల్ ద్వారా సంస్థకు తెలియకుండా రూ.21.6 కోట్లు కాజేశాడు. ఆ డబ్బుతో కార్లు, బైక్ కొనడంతో పాటు తన ప్రేయసికి ఖరీదైన ఫ్లాట్ గిఫ్ట్‌గా ఇచ్చాడు.
తుర్కియేలో ఆయుధ తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాద ఘటనలో 12 మంది మృతి చెందగా మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. అయితే పేలుడు ఎందువల్ల జరిగిందనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.