Ethiopia Truck Accident : ఇథియోపియాలో ఘోర ప్రమాదం జరిగింది. పెళ్లి బృందంతో వెళ్తున్న ట్రక్కు ఒకటి నదిలో పడిపోవడంతో సుమారు 71 మంది మృతి చెందారు. దక్షిణ సిడామా ప్రాంత అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, బోనా జిల్లాలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. Also Read: Aus Vs IND: ఇప్పుడు అరవండి మావా... బుమ్రా సంబరాలు మామూలుగా లేవుగా! వివాహ వేడుకకు వెళ్తున్నసమయంలో.. ప్రమాదంలో గాయపడిన వారు బోనా జనరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని ప్రాంతీయ కమ్యూనికేషన్స్ బ్యూరో ఆదివారం అర్థరాత్రి ఒక ప్రకటనలో తెలియజేసింది.ప్రభుత్వ యాజమాన్యంలోని ఇథియోపియన్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ ప్రకారం, ప్రజలందరూ ఒక వివాహ వేడుకకు వెళ్తున్నసమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు, స్థానికులు తెలిపారు. Also Read: Nitish Kumar: కన్నీళ్లు పెట్టించే నితీష్ రెడ్డి బయోగ్రఫీ.. కొడుకు కోసం ఉద్యోగాన్ని వదులుకున్న తండ్రి ఇథియోపియాలో తీవ్రమైన రోడ్డు ప్రమాదాలు చాలా సాధారణంగా జరుగుతుంటాయని అక్కడి అధికారులు తెలిపారు. పేలవమైన డ్రైవింగ్ ప్రమాణాలు, శిథిలమైన వాహనాలు ఇక్కడ సురక్షితమైన రవాణాకు అతిపెద్ద అవరోధాలని అధికారులు చెప్పుకొచ్చారు.నదిలో ప్రజల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. Also Read: Nitesh Kumar reddy: ఆసీస్ గడ్డపై తెలుగు కుర్రాడి ప్రభంజనం.. టెస్టు కెరీర్‌లో తొలి సెంచరీ నమోదు! అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ప్రజలందరూ ఇసుజు ట్రక్కులో ప్రయాణిస్తున్నారు. అయితే అకస్మాత్తుగా ట్రక్కు దారి తప్పి నదిలో పడిపోయింది. మరోవైపు నదిలో ప్రజల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. స్థానిక ప్రజలు, ప్రభుత్వ శాఖలు సహాయ, సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నాయి. కేసు దర్యాప్తులో పోలీసులు నిమగ్నమయ్యారు. Also Read: India vs Australia 4th Test: పుష్ప స్టైల్లో నితీశ్ రెడ్డి.. వీడియో చూస్తే గూస్‌బంప్స్ రావాల్సిందే! దాదాపు ఆరేళ్ల క్రితం 2018లో ఇథియోపియాలో పెద్ద ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విద్యార్థులతో ఉన్న బస్సు కాలువలో పడి 38 మంది ప్రాణాలు కోల్పోయారు.