భట్టి విక్రమార్క ప్రత్యేక పూజలు.! | Deputy CM Bhatti Vikramarka Special Puja | Telangana Budget 2025
తెలంగాణ అసెంబ్లీలో ఈ రోజు ప్రభుత్వం బడ్జె్ట్ ప్రవేశపెట్టింది. హైదరాబాద్ పరిధిలో మధ్యతరగతి వర్గాల సొంతింటి కలను నిజం చేసే నిర్ణయం తీసుకుంది. ఔటర్ రింగు రోడ్డుని ఆనుకొని హైదరాబాద్ నలువైపులా శాటిలైట్ టౌన్ షిప్లు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది.
తెలంగాణ బడ్జెట్ పై తీవ్ర విమర్శలు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ బడ్జెట్ చూస్తుంటే రేవంత్ సర్కార్ 40 శాతం కమిషన్ పాలన అనిపిస్తుందని ఆరోపించారు. రెండు లక్షల ఉద్యోగాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. నిరుద్యోగ భృతిపై నిలదీశారు.
తెలంగాణ బడ్జెట్ లో రేవంత్ సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పింది. వైద్యారోగ్యశాఖకు రూ. 12 వేల393 కోట్లు కేటాయించిన రేవంత్ సర్కార్.. 27 ఎకరాల్లో కొత్త ఉస్మానియా ఆసుపత్రి నిర్మణానికి రూ. 2700 కోట్లు కేటాయించింది.
తెలంగాణ బడ్జెట్ లో కొత్త రేషన్ కార్డులపై కీలక ప్రకటన వెలువడింది. పౌర సరఫరాల శాఖకు రూ. 5,734 కోట్లు కేటాయించిన ప్రభుత్వం.. అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు ఇస్తామని అలాగే సన్న బియ్యం అందిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు.
తెలంగాణ బడ్జెట్ 2025 26లో రైతులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రైతు భరోసాకు రూ. 18 వేల కోట్లు కేటాయించినట్లుగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. ఇక ఏడాదికి రూ. 12 వేల చొప్పున అందుతాయని ఆయన వెల్లడించారు.