KTR : ఊసరవెల్లి ముదిరితే రేవంత్ రెడ్డి .. బడ్జెట్ పై కేటీఆర్ తీవ్ర విమర్శలు

తెలంగాణ బడ్జెట్ పై తీవ్ర విమర్శలు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ బడ్జెట్ చూస్తుంటే రేవంత్ సర్కార్ 40 శాతం కమిషన్ పాలన అనిపిస్తుందని ఆరోపించారు.  రెండు లక్షల ఉద్యోగాలు ఏమయ్యాయని ప్రశ్నించారు.  నిరుద్యోగ భృతిపై నిలదీశారు.

author-image
By Krishna
New Update
 KTR

KTR

తెలంగాణ బడ్జెట్ పై తీవ్ర విమర్శలు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ బడ్జెట్ చూస్తుంటే రేవంత్ సర్కార్ 40 శాతం కమిషన్ పాలన అనిపిస్తుందని ఆరోపించారు. తొండ ముదిరితే ఊసరవెల్లి అవుతుంది.. అదే ఊసరవెల్లి ముదిరితే రేవంత్ రెడ్డి అవుతుందని ఎద్దేవా చేశారు. రంకెలు కాదు రేవంత్ రెడ్డి  అంకెలు ఎక్కడ పోయినయ్ అని కేటీఆర్ నిలదీశారు. పరిపాలనకు చేతకాని కాంగ్రెస్ ప్రభుత్వం...  ఈ బడ్జెట్ లో 6 గ్యారంటీలు పాతర వేసిందన్నారు.  మహిళలు,  వృద్ధులకు ఇచ్చిన హామీల పైన బడ్జెట్ లో  ఎందుకు ప్రస్తావించలేదన్నారు.  చేనేతకు తమ హయంలో 1200 కోట్ల రూపాయిలు కేటాయిస్తే..  ఇవ్వాల చేనేత కార్మికులకు 300 కోట్లు కేటాయిస్తూ  పరిమితం చేశారని మండిపడ్డారు.  

Also read :   ఢిల్లీలో స్థానిక పిల్లలతో కలిసి క్రికెట్‌ ఆడిన న్యూజిలాండ్‌ ప్రధాని.. ఫొటోలు వైరల్‌

Also read :  బెట్టింగ్‌ యాప్‌లో మాజీ మంత్రి హస్తం.. ఫామ్ హౌస్‌ వేదికగా బ్లాక్ దందా?

సీఎం రేవంత్ చేతిగాని తనం

రెండు లక్షల ఉద్యోగాలు ఏమయ్యాయని కేటీఆర్ ప్రశ్నించారు.  నిరుద్యోగ భృతిపై నిలదీశారు.  రైతు కూలీలకు ఇస్తామన్న రూ.12 వేలు ఎక్కడా అని ప్రశ్నించారు.  సీఎం రేవంత్ చేతిగాని తనం వల్ల తెలంగాణ ఆకాశం నుంచి పాతాలానికి వెళ్లిందన్నారు.  అప్పులు చేసి ఒక్క ప్రాజెక్టు కూడా ప్రారంభించలేదన్నారు.  ఇకనైనా ఢిల్లీకి ముటాలు పంపడం మానుకోవాలని కేటీఆర్ సూచించారు.  ఏ ఒక్క ఊర్లో కూడా రుణమాఫీ పూర్తిగా జరగలేదన్నారు.  ట్రిలియన్ డాలర్ లో ఎన్ని సున్నాలు ఉంటాయో తెలియని దరిద్రపు ప్రభుత్వమని కేటీఆర్ మండిపడ్డారు.  కరోనా కంటే డేంజర్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వమని ఫైరయ్యారు.  పేద ప్రజల కష్టాలు తీర్చే బడ్జెట్ కాదు, ఢిల్లికి మూటలు పంపే బడ్జెట్ అని విమర్శలు గుప్పించారు.  

Also read :  27 ఎకరాల్లో కొత్త ఉస్మానియా ఆసుపత్రి.. రూ. 2700 కోట్లు కేటాయింపు!

Also Read :  ‘ఆపరేషన్‌ కగార్‌’ వెంటనే ఆపండి.. సీపీఐ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ఫ్రొపెసర్ డిమాండ్!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు