/rtv/media/media_files/2025/03/19/JELmx4qdRN33hxhcJG04.jpg)
తెలంగాణ బడ్జెట్ లో కొత్త రేషన్ కార్డులపై కీలక ప్రకటన వెలువడింది. ఈ బడ్జెట్ లో పౌర సరఫరాల శాఖకు రూ. 5,734 కోట్లు కేటాయించింది ప్రభుత్వం. అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు ఇస్తామని అలాగే రేషన్ కార్డు ఉన్నవారందరికీ సన్న బియ్యం ఇస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. కొత్త రేషన్ కార్డుల జారీ, కుటుంబ సభ్యుల పేర్ల నమోదు చేసే ప్రక్రియను జనవరి 26వ తేదీ నుంచి ప్రారంభించినట్లుగా సభలో డిప్యూటీ సీఎం గుర్తుచేశారు.
Also Read : వేసవిలో వీటిని తీసుకుంటే.. ఆరోగ్యం మీ సొంతం
ఇక తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో అంతర్భాగంగా 200 ఎకరాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సిటీని నిర్మించనున్నట్లుగా బడ్జెట్ ప్రసంగంలో భట్టి విక్రమార్క వెల్లడించారు. ఏఐ సిటీ కోసం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖకు బడ్జెట్ లో 774 కోట్ల రూపాయలు ప్రతిపాదించారు.
Also Read : బడ్జెట్ లో కీలక ప్రకటన.. ఆరోగ్యశ్రీలో కొత్తగా 1,835 చికిత్సలు!
విద్యకు అధిక ప్రాధాన్యం
ఇక బడ్జెట్ లో విద్యకు అధిక ప్రాధాన్యం ఇచ్చింది రేవంత్ సర్కార్. ప్రస్తుతం ఉన్న గురుకుల పాఠశాలలను సమర్థవంతంగా నిర్వహించటంతోపాటుగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ తీసుకురాబోతున్నట్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. తెలంగాణలో 58 యంగ్ ఇండియా స్కూల్స్ నిర్మాణం, నిర్వహణ కోసం రూ. 11 వేల 600 కోట్లు కేటాయిస్తున్నట్లుగా వెల్లడించారు.
Also Read : ఢిల్లీలో స్థానిక పిల్లలతో కలిసి క్రికెట్ ఆడిన న్యూజిలాండ్ ప్రధాని.. ఫొటోలు వైరల్
Also Read : ఇదిరా మహేశ్ బాబు రేంజ్.. ఏకంగా 1500 సార్లు టీవీలో టేలికాస్ట్ అయిన ఈ సూపర్ మూవీ ఏంటో తెలుసా?