Telangana Budget 2025 : 27 ఎకరాల్లో కొత్త ఉస్మానియా ఆసుపత్రి.. రూ. 2700 కోట్లు కేటాయింపు!

తెలంగాణ బడ్జెట్ లో రేవంత్ సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పింది. వైద్యారోగ్యశాఖకు రూ.  12 వేల393 కోట్లు కేటాయించిన రేవంత్ సర్కార్..  27 ఎకరాల్లో కొత్త ఉస్మానియా ఆసుపత్రి నిర్మణానికి రూ.  2700  కోట్లు కేటాయించింది.

New Update
osmania

తెలంగాణ బడ్జెట్ లో రేవంత్ సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పింది. వైద్యారోగ్యశాఖకు రూ.  12 వేల393 కోట్లు కేటాయించిన రేవంత్ సర్కార్..  27 ఎకరాల్లో కొత్త ఉస్మానియా ఆసుపత్రి నిర్మణానికి రూ.  2700  కోట్లు కేటాయించింది.  ఇక హైదరాబాద్ లో ట్రాఫిక్ కంట్రోలింగ్ కోసం H CITI లో భాగంగా..  31 ఫ్లై ఓవర్లు,  17 అండర్ పాస్ లు, 10 రోడ్ల విస్తరణ చేపట్టనున్నట్లుగా బడ్జెట్ ప్రసంగలో భట్ట విక్రమార్క వెల్లడించారు.  2028 నాటికి 17 వేల కిలోమీటర్ల గ్రామీణ రహదారుల అభివృద్ధి చేస్తామని తెలిపారు.  దీనికోసం రూ.28 వేల కోట్లు కేటాయించింది.  

Also Read :  Satellite Townships : మధ్యతరగతి ప్రజలకు గుడ్ న్యూస్... ORR సమీపంలో శాటిలైట్‌ టౌన్‌షిప్‌లు

Also Read :  Betting app: బెట్టింగ్‌ యాప్‌లో మాజీ మంత్రి హస్తం.. ఫామ్ హౌస్‌ వేదికగా బ్లాక్ దందా?

Telangana Budget 2025 For Osmania University

ఇక ఆరోగ్యశ్రీ పరిధిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు ప్రభుత్వం పెంచినట్లుగా డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. అంతేకాకుండా ఆరోగ్యశ్రీలో  కొత్తగా 1,835 చికిత్సలను చేర్చినట్లుగా వెల్లడించారు. ఆరోగ్య శ్రీ ప్యాకేజీల ఖర్చును కూడా 20 శాతానికి పెంచినట్లుగా వెల్లడించారు. ఈ బడ్జెట్ లో  రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం కోసం 1,143 కోట్లను కేటాయించింది ప్రభుత్వం.  సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంతో 90 లక్షల పేద కుటుంబాలకు ఆరోగ్య శ్రీ ద్వారా లబ్ధి చేకూరనుంది. 

Also Read :  యాదగిరి గుట్టలో మిస్‌ వరల్డ్‌ క్రిస్టినా పిస్కోవా ప్రత్యేక పూజలు.. వీడియో వైరల్

Also Read :  Human Trafficking: సినిమా అవకాశాల పేరుతో గాలం...వ్యభిచార రొంపిలోకి దింపి...

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు