/rtv/media/media_files/2025/03/19/K3O3nEZgpWamL3ODZevV.jpg)
Satellite Townships
Satellite Townships : తెలంగాణ అసెంబ్లీలో ఈ రోజు ప్రభుత్వం బడ్జె్‌ట్ ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా మధ్య తరగతి ప్రజలకు కాంగ్రెస్ సర్కార్ తీపి కబురు చెప్పింది. హైదరాబాద్ పరిధిలో మధ్యతరగతి వర్గాల సొంతింటి కలను నిజం చేసేలా కీలక నిర్ణయం తీసుకుంది. ఔటర్ రింగు రోడ్డుని ఆనుకొని హైదరాబాద్ నగరం నలువైపులా శాటిలైట్ టౌన్ షిప్‌లు ఏర్పాటు చేయనున్నట్లు డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. అసెంబ్లీలో 2025--26 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.3.04 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టిన భట్టి.. అల్పాదాయ, మధ్యతరగతి వర్గాలకు అందుబాటులో ఉండే విధంగా గృహ సముదాయాలను నిర్మించే ప్రణాళిక రూపొందిస్తున్నామని చెప్పారు.
Satellite Townships Built Near ORR Hyderabad
గత ప్రభుత్వం హయాంలో అసంపూర్తిగా నిలిచిపోయిన గృహాలలో 34,545 నిర్మాణాలకు, 305.03 కోట్లు నిధులను కేటాయించి, వాటిని అందుబాటులోకి తెస్తున్నామని చెప్పారు. ఇక ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని 2024, మార్చి నెలలో ప్రారంభించామని, ఇండ్ల పట్టాలను ఆడబిడ్డల పేరుతోనే ఇవ్వాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.రూ. 22,500 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ప్రతి నియోజకవర్గానికి కనీసం 3,500 చొప్పున మొత్తంగా నాలుగు లక్షల యాభై వేల ఇండ్లను మంజూరు చేస్తామని భట్టి తెలిపారు.. రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ కూడా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయనున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. ఇప్పటికే అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించినట్లు చెప్పారు. ఎలాంటి రాజకీయాలకు తావులేకుండా పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక ఉంటుందన్నారు.
Also Read: Horoscope:నేడు ఈ రాశి వారు వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి...!
Also Read : డైలీ బుల్లెట్ కాఫీ తాగితే.. ఇన్ని ప్రయోజనాలా!
ఇక తెలంగాణ ప్రభుత్వం ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని.. గృహజ్యోతి పథకం క్రింద 200 యూనిట్లకు లోబడి విద్యుత్తును వినియోగిస్తున్నవారికి ఉచిత విద్యుత్‌ను అందిస్తున్నట్లు ఆర్థిక మంత్రి వెల్లడించారు. ఈ పథకం క్రింద 50 లక్షల కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయని తెలిపారు. గృహజ్యోతి పథకం కోసం ఇప్పటికే 1,775.15 కోట్లు విద్యుత్ సంస్థలకు సబ్సిడీగా చెల్లించడం జరిగిందన్నారు. తమ ప్రభుత్వం అన్ని వర్గాల అభ్యున్నతి కోసం పాటు పడుతుందని బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి భట్టి వెల్లడించారు.
Also Read: Yadagiri Gutta: ఇక నుంచి ఆ పుణ్య క్షేత్రంలో మద్యం, మాంసం విక్రయాలు బంద్..!