Renu Desai : రేణు దేశాయ్‌పై ట్రోలింగ్.. ఇద్దరు నిందితుల అరెస్ట్
సినీ నటి రేణు దేశాయ్‌ను టార్గెట్ చేసుకుని సోషల్ మీడియాలో అసభ్యకరమైన, అసభ్య పదజాలంతో దూషించిన ఇద్దరు వ్యక్తులను సైబరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు.
సినీ నటి రేణు దేశాయ్‌ను టార్గెట్ చేసుకుని సోషల్ మీడియాలో అసభ్యకరమైన, అసభ్య పదజాలంతో దూషించిన ఇద్దరు వ్యక్తులను సైబరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు.
రేణు దేశాయ్ టాలీవుడ్లో మరోసారి బిజీ అవుతున్నారు. ‘16 రోజుల పండుగ’ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. కొత్త హీరో కృష్ణ దమ్మాలపాటి నటిస్తుండగా, సాయికిరణ్ అడవి దర్శకత్వం వహిస్తున్నారు. అనసూయతో సహా పలువురు నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
సీనియర్ నటి రేణు దేశాయ్ ఇటీవలే పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో భవిష్యత్తులో సన్యాసం తీసుకునే అవకాశం ఉంది అంటూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ తరచు ఏదో ఒక విషయం గురించి వార్తల్లో నిలుస్తుంటారు. అయితే తాజాగా ఆమె ఇన్ స్టాగ్రామ్ లో కూతురు ఆద్యతో కలిసి ఓ సెల్ఫీ పోస్ట్ చేశారు.
పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్.. తనపై వస్తున్నవార్తలపై స్పందించారు. తన రెండో పెళ్లిపై మీకు ఎంత ఆసక్తి అని ప్రశ్నించారు. ఇటీవల ఆమె ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనేక అంశాలపై మాట్లాడారు.అందులో రెండో వివాహం గురించి కూడా స్పందించారు.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారు. దేశంలో జరిగే అన్ని విషయాలపైనా స్పందిస్తూ ఉంటారు. తాజాగా ఓ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె..తనకు రాజకీయాల్లోకి రావాలని ఉందని చెప్పారు.
ఏపీలో తెలుగు ఇండస్ట్రీ డెవలప్ అయితే బాగుంటదని రేణూ దేశాయ్ తెలిపారు. తెలుగు సినిమా పరిశ్రమ ఏపీకి రావాలని పెద్దలు ఆహ్వానించడం సంతోషకరమని అన్నారు. తన కొడుకు అకీరా నందన్ ఎంట్రీపై తాను కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని చెప్పుకొచ్చారు.
పవన్- అనా లెజినొవా దంపతులు అకీరా నందన్, ఆద్యలతో దిగిన ఫొటోపై వల్గర్ మీమ్స్ క్రియేట్ చేస్తున్న వారిపై రేణూ దేశాయ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. మమ్మల్ని ఎగతాళి చేసే మీకూ ఇంట్లో తల్లి, అక్కాచెల్లెళ్లు, కూతుర్లు ఉంటారని గుర్తుంచుకోవాలంటూ తిట్టిపోసింది.