Renu Desai: ఏపీకి తెలుగు ఇండస్ట్రీ..  రేణూ దేశాయ్‌ కీలక కామెంట్స్

ఏపీలో తెలుగు ఇండస్ట్రీ డెవలప్ అయితే బాగుంటదని రేణూ దేశాయ్‌ తెలిపారు. తెలుగు సినిమా పరిశ్రమ ఏపీకి రావాలని పెద్దలు ఆహ్వానించడం సంతోషకరమని అన్నారు. తన కొడుకు అకీరా నందన్‌ ఎంట్రీపై తాను కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని చెప్పుకొచ్చారు.

New Update
renu desai ap

renu desai ap Photograph: (renu desai ap )

తన కొడుకు అకీరా నందన్‌ సినిమా ఎంట్రీపై నటి రేణూ దేశాయ్‌ స్పందించారు. తాజాగా రాజమహేంద్రవరంలో ఆమె మీడియాతో మాట్లాడారు. అందరిలాగే తన కొడుకు ఎంట్రీ కోసం  తాను కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని ఆమె చెప్పుకొచ్చారు.  ఒక తల్లిలా ఆ క్షణం కోసం చాలా ఏళ్లుగా ఎదురుచూస్తున్నానని  రేణూ దేశాయ్‌ చెప్పుకొచ్చారు. అయితే దీనిపై పూర్తి  నిర్ణయం అకీరా పైనే ఆధారపడి ఉందని స్పష్టంచేశారు.  సినిమాల్లోకి అకీరా ఎప్పుడు అనుకుంటే అప్పుడు వస్తాడంటూ రేణూ దేశాయ్‌ తెలిపారు.  

సెంకడ్ ఇన్నింగ్స్ ఇంకెన్ని సార్లు

ఇక తన సెంకడ్ ఇన్నింగ్స్ పై స్పందించారు రేణూ దేశాయ్‌.  ఇప్పటికే తన సెంకడ్ ఇన్నింగ్స్ ఎన్నోసార్లు అయిపోయిందని నవ్వుతూ చెప్పారు. ప్రస్తుతం తన చేతిలో నాలుగు సినిమాలున్నాయని చెప్పిన రేణూ దేశాయ్.. త్వరలో అవి సెట్స్ పైకి వెళ్లనున్నాయన్నారు. 22 ఏళ్ల తరువాత ఓ యాడ్  కోసం వర్క్ చేశానని తెలిపారు.  తానెప్పుడూ సినిమాల్లోకి రావాలని అనుకోలేదని..  ఇదంతా విధి రాత అని ఆమె అభిప్రాయపడ్డారు.  

ఇక రాజమహేంద్రవరం ఓ స్వర్గమని.. ఇక్కడి  పచ్చని పొలాలు చూసి తన మనసు అనందంతో నిండిపోయిందిన్నారు.  తనకు మూగజీవాలంటే  చాలా ఇష్టమని తెలిపిన రేణూ దేశాయ్‌..  సామాజిక సేవా కార్యక్రమాల కోసం నా కుమార్తె ఆద్య పేరుతో ఫౌండేషన్ ఏర్పాటు చేశానని తెలిపారు.  ఏపీలో తెలుగు ఇండస్ట్రీ డెవలప్ అయితే బాగుంటదని తెలిపారు.  తెలుగు సినిమా పరిశ్రమ ఏపీకి రావాలని పెద్దలు ఆహ్వానించడం సంతోషకరం అని అన్నారు.  

అకీరా నందన్‌ సినిమా ఎంట్రీ గురించి రేణూ దేశాయ్‌  స్పందించడం కొత్తేమీ కాదు. గతంలోనూ ఆమె ఇదే విషయాన్ని చెప్పారు.  అటు  అకీరా నందన్‌ కూడా ఇండస్ట్రీలోకి రావడానికి ఇంట్రెస్ట్ గానే ఉన్నాడు.  ఇప్పటికే న్యూయార్క్‌లోని ఫిల్మ్‌ స్కూల్‌లో శిక్షణ తీసుకుంటున్నాడు.  అంతేకాకుండా  పియానో కూడా నేర్చుకున్నాడు. అయితే అకీరా నందన్‌  ఎంట్రీపై మెగా ఫ్యాన్స్ చాలా ఆశలు పెట్టుకున్నారు. పవన్ కల్యాణ్ సినిమాలు తగ్గించడంతో ఆయన ప్లేస్ లో అకీరాను చూసుకోవాలని అనుకుంటున్నారు.  

Also Read :  విజయ్‌కి పోటీగా రాజకీయాల్లోకి త్రిష..  టార్గెట్ సీఎం కుర్చీ

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Suriya 796CC వెంకీ అట్లూరి- సూర్య క్రేజీ అప్డేట్..

వెంకీ అట్లూరి - సూర్య కాంబోలో తెరకెక్కనున్న '796CC' మూవీకి సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. ఇందులో ఫీమేల్ లీడ్ గా కీర్తి సురేష్ ని ఎంపిక చేసేందుకు పరిశీలిస్తున్నారట మేకర్స్ డైరెక్టర్ వెంకీ ఆమెకు స్క్రిప్ట్ వినిపించగా సానుకూలంగా స్పందించారట.

New Update
keerthi suresh with suriya in venky atluri movie

keerthi suresh with suriya in venky atluri movie

Suriya 796CC టాలీవుడ్ మహానటి కీర్తిసురేష్ పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేస్తూ కెరీర్ లో బిజీగా ముందుకెళ్తోంది. ఈ క్రమంలో కీర్తి నెక్స్ట్ ప్రాజెక్ట్ కి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వైరల్ అవుతోంది. వెంకీ అట్లూరి - సూర్య కాంబోలో '796CC' వర్కింగ్ టైటిల్ తో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. 

సూర్య జోడీగా.. 

అయితే ఈ సినిమాలో కథానాయికగా కీర్తి సురేష్ ని ఎంపిక చేసేందుకు పరిశీలిస్తున్నారట మేకర్స్. ఇప్పటికే  డైరెక్టర్ వెంకీ ఆమెకు స్క్రిప్ట్ వినిపించగా సానుకూలంగా స్పందించారట. దీంతో ఆమె ఫైనల్ కాల్ కోసం వెయిట్ చేస్తున్నారని సమాచారం.  కీర్తి పాన్ ఇండియా ఆకర్షణ, నటన నైపుణ్యం కారణంగా ఈ ప్రాజెక్ట్ కి  ఆమె అనువైన ఎంపిక అని భావించారట మేకర్స్. 

ఒక్కోసారి ఒక్కో కొత్త కాన్సెప్ట్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న వెంకీ.. ఈసారి 80s బ్యాక్ డ్రాప్ ఆటో మొబైల్ ఇంజనీరింగ్ కథ నేపథ్యంలో సినిమాను రూపొందించబోతున్నారట. ఇండియాస్ ఫస్ట్ మారుతి కారు వచ్చిన సమయంలో జరిగే కథ. అందుకే ఈ సినిమాకు  ‘796CC’ టైటిల్ అనుకుంటున్నారు.. కానీ ఇంకా ఫిక్స్ చేయలేదు. ఇందులో సూర్య యంగ్ ఇంజనీరింగ్ గా కనిపించబోతున్నారు. ఇప్పటికే సూర్య- కీర్తి సురేష్ 'Thaanaa Serndha Koottam' అనే తమిళ్ చిత్రంలో కలిసి నటించారు. ఇందులో వీరిద్దరి కాంబినేషన్ బాగా వర్కౌట్ అయ్యింది. ‘సర్‌’, ‘లక్కీ బాస్కర్‌’ సినిమాలతో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకున్నారు డైరెక్టర్ వెంకీ అట్లూరి. 

ఇదిలా ఉంటే ప్రస్తుతం సూర్య 'రెట్రో' మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. కార్తీక్ సుబ్బరాజు తెరకెక్కించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మే 1న విడుదల కానుంది. ఇందులో సూర్య జోడీగా పూజ హెగ్డే నటించింది. 'కంగువా' నిరాశ చెందిన ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.   

cinema-news | latest-news | telugu-news | keerthi-suresh

Advertisment
Advertisment
Advertisment