Renu Desai: మమ్ముట్టిని కలిసిన రేణు దేశాయ్.. ఫుల్ ఫ్యాన్ గర్ల్ మోమెంట్ ఫొటోస్ వైరల్!

రేణు దేశాయ్‌కు ఎంతోకాలంగా ఉన్న కోరిక మలయాళ స్టార్ మమ్ముట్టిని కలిసిన ఆనందాన్ని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ఆయన ఎంతో టాలెంటెడ్, సింపుల్, మంచి మనసున్న వ్యక్తి అని ప్రశంసించారు. ఈ ఫోటోలు, ఆమె ఆనందం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

New Update
Renu Desai

Renu Desai

Renu Desai: రేణు దేశాయ్ తాజాగా తనకు ఎంతో ప్రత్యేకమైన రోజు వచ్చిందని అభిమానులతో పంచుకున్నారు. మలయాళ స్టార్ హీరో మమ్ముట్టిని Mammoottyను కలవాలని ఆమెకు చాలా కాలంగా కోరిక ఉండేది. ఇప్పుడు ఆ కోరిక నెరవేరడంతో రెణు దేశాయ్ తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు.

ఈ సంతోషకరమైన క్షణాన్ని ఆమె ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్నారు. “మమ్ముట్టి సార్‌ను కలవడం నా బకెట్ లిస్ట్‌లో ఉన్న ఒక పెద్ద కోరిక. చివరకు ఆయనతో కొంత సమయం గడిపే అవకాశం రావడం చాలా హ్యాపీగా ఉంది. ఆయన ఎంతో టాలెంటెడ్, చాలా సింపుల్, మంచి మనసున్న వ్యక్తి” అంటూ రెణు దేశాయ్ పోస్ట్ చేశారు.

షేర్ చేసిన ఫోటోలో ఇద్దరూ వ్యానిటీ వాన్‌లో మాట్లాడుకుంటూ కనిపించారు. ఆ ఫోటోలో రెణు దేశాయ్ ముఖంలో కనిపించిన ఆనందం అభిమానులను ఆకట్టుకుంది. ఎంతో ఇష్టపడే నటుడిని కలిసిన ఫ్యాన్‌లా ఆమె ఎగ్జైట్ అయిన తీరు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సినీ ప్రముఖులు కూడా తమకు ఇష్టమైన నటులను కలిసినప్పుడు సాధారణ అభిమానుల్లానే ఆనందపడటం చూడటం చాలా ఆసక్తికరంగా ఉంటుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం రెణు దేశాయ్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisment
తాజా కథనాలు