/rtv/media/media_files/2025/04/11/jnZNMuZXHJjITwG2cjfV.jpg)
Renu Desai
Renu Desai : పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్.. తనపై వస్తున్న వార్తలపై స్పందించారు. తన రెండో పెళ్లిపై మీకు ఎంత ఆసక్తి అని ప్రశ్నించారు. ఇటీవల ఆమె ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనేక అంశాలపై తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు.అందులో రెండో వివాహం గురించి కూడా స్పందించారు. ఏకంగా రేణు దేశాయ్ తనకు మరో తోడు కావాలని అనిపిస్తుందని కూడా మాట్లాడారు. ఆద్యకు ప్రస్తుతం 15 ఏళ్లు అని.. తనకు 18 ఏళ్లు వచ్చే వరకు ఆగి ఆ తర్వాత పెళ్లిపై ఒక నిర్ణయం తీసుకుంటానని కూడా చెప్పారు.ఈ క్రమంలో అప్పటి నుంచి రేణుదేశాయ్ పెళ్లిపై రకరకాల రూమర్స్ సోషల్ మీడియాల్లో తెగ వైరల్ చేస్తున్నారు. ఈ పాడ్‌కాస్ట్‌లో అనేక విషయాలు మాట్లాడనని మిగిలిన అంశాలను పక్కనపెట్టి, కేవలం తన రెండో పెళ్లినే హైలైట్ చేస్తూ వార్తలు రాస్తుండటంపై అసహనం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఇన్‌స్టా వేదికగా పోస్ట్ పెట్టారు.
Also Read: సొంత గ్రౌండ్లో ఆర్సీబీ పరమ చెత్త రికార్డు!
‘‘మీడియా వాళ్లు నా రెండో వివాహం విషయమై ఎంతో ఆసక్తిగా ఉన్నారని నాకర్థమవుతోంది. ఇటీవల నేను గంటకు పైగా మాట్లాడిన పాడ్‌కాస్ట్‌లో ఇతర ముఖ్యమైన విషయాల (మతం, బంధాలు, సామాజిక మాధ్యమాల ప్రభావం) కన్నా కూడా శ్రోతలు నా రెండో పెళ్లికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని మరోసారి నిరూపితమైంది. నేను మీ అందరినీ కోరేది ఒక్కటే. దయ చేసి ఈ 44 ఏళ్ల మహిళ వివాహం విషయం నుంచి మీ దృష్టిని మరల్చండి.’’
Also Read: Live in relationship: పెళ్లి కాకుండా తల్లిదండ్రులైన వారికి హైకోర్టు గుడ్‌న్యూస్
‘‘పాడ్‌కాస్ట్‌లో నేను మాట్లాడిన పన్ను ఆంక్షలు, మహిళా భద్రత, ఆర్థిక వృద్ధి, వాతావరణ మార్పులు తదితర విషయాలపై శ్రద్ధ పెట్టడం అవసరం. అలా చేస్తే మనం మంచి పౌరులుగా.. అంతకుమించి గొప్ప మనుషులుగా అవుతాం. నా పెళ్లి గురించి ఇప్పటికే వందలసార్లు మాట్లాడాను. ఎందుకంటే ఇది కచ్చితంగా నా జీవితాన్ని, నా స్నేహితులను ప్రభావితం చేసే విషయం. దయచేసి మీ చదువు, విజ్ఞానం, జర్నలిజంలో మీకున్న అనుభవాన్ని ఒక మహిళ రెండో వివాహం కోసం ఉపయోగించకండి. ఇదేమీ సమాజాన్ని, చట్టాలను ప్రభావితం చేసే విషయం కాదు కదా’’ అని రేణూ దేశాయ్ అసహనం వ్యక్తం చేశారు. .తనకు 44 ఏళ్లు అని.. రెండో పెళ్లి చేసుకొవడం ఒక నార్మల్ పని అన్నారు. తనకు నచ్చిన వాళ్లను చేసుకుంటానని చెప్పుకొచ్చారు. ఇది తన వ్యక్తిగతం, కుటుంబానికి చెందిన విషయమన్నారు. అయితే..దీని వల్ల సమాజానికి ఎలాంటి లాభంలేదన్నారు. అసలు..దీన్ని ఎందుకంతా హైలేట్ చేస్తున్నారో.. అర్థంకావట్లేదన్నారు.
Also Read : తహవ్వుర్ రాణాపై కీలక అప్‌డేట్.. ఎక్కడ ఉంచారంటే..?
మొత్తంగా..నేను మహిళల భద్రత, ఎకానమిక్ డెవలప్ మెంట్, చదువు, పన్ను ఆంక్షలు.. వంటి చాలా అంశాలపై మాట్లాడినట్లు చెప్పుకొచ్చారు. కానీ తన పెళ్లిపై చేసిన కామెంట్స్ లపైన చాలా మంది ఫోకస్ చేశారన్నారు. ఇటీవల చాలా మందికి అసలు.. గాయత్రి మంత్రం అంటే తెలీదు. అంతే కాకుండా.. చిన్న చిన్న మంత్రాలు కూడా నేర్చించడంలేదు. కనీసం చిన్న చిన్న దేవుళ్ల శ్లోకాలు, మన సంప్రదాయాలు కూడా తల్లిదండ్రులు తమ పిల్లలకు నేర్పించడంలేదని బాధపడ్డారు.
Also Read: స్కూల్ బ్యాగ్‌లో కండోమ్స్, తంబాకు ప్యాకెట్లు, కత్తులు, అగ్గిపెట్టలు.. ఎవర్రా మీరంతా!