/rtv/media/media_files/2024/11/21/7HCd1E4JEmbxOGeUNDZu.jpg)
Renu desai
తనకు రాజకీయాల్లోకి వెళ్ళే అవకాశం ఇంతకు ముందే వచ్చిందని..కానీ పిల్లలు చిన్నవారు కావడం వలన వదులుకున్నానని చెప్పారు రేణూ దేశాయ్. రాజకీయాల్లోకి వెళ్ళడం తన జాతకంలోనే ఉందని అన్నారు. ఇప్పటికీ తనకు అదే కోరికని...కానీ తాను విధి రాతకు వ్యతిరేకంగా ప్రయాణిస్తున్నానని చెప్పుకొచ్చారు రేణు. ఓ పాడ్ కాస్ట్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మనసులో మాటను బయటపెట్టారు. సామాజిక సేవ చేయడం అంటే తనకు ఆనందమని...ఏ చిన్నారీ ఆకలితో ఉండకూడదని అనుకుంటానని ఆమె తెలిపారు. అయితే తాను కొంచెం ముక్కు సూటి మనిషిని...స్నేహితులు, పిల్లలతో ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తానని...అందుకే వారు తాను పోలిటిక్స్ లో పనికి రానని అంటారని నవ్వూతూ చెప్పారు రేణూ దేశాయ్.
మోడీ భక్తురాలిని..బీజేపీకే సపోర్ట్..
తాను ఎప్పటికీ మోడీనే సపోర్ట్ చేస్తానని...ఆమె భక్తురాలిని అని నిర్భయంగా చెప్పుకున్నారు రేణు. మన ధర్మం ఎలా బతకాలో, ఎలా నడుచుకోవాలో నేర్పించింది. అందుకే నేను సనాతురాలినే అని చెప్పుకుంటాననన్నారు ఎవరేం అనుకున్నా ఎప్పటికీ తాను బీజేపీకే సపోర్ట్ చేస్తానని చెప్పుకొచ్చారు. భవిష్యత్తులా తాను ఏదైనా పార్టీలో చేరితే కచ్చితంగా అందరికీ చెప్పే చేస్తానని రేణూ దేశాయ్ అన్నారు. ఇక ఆమె కుమారుడు అకీరా నందన్ గురించి చెబుతూ...ఓజీ సినిమాలో అతను పని చేయడం లేదని తెలిపారు. అకీరా నటన గురించి ఆలోచించిన రోజే నా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు పెడతా. కొందరు యూట్యూబర్లు మనీ కోసం తప్పుడు థంబ్‌నైల్స్ పెడుతున్నారు రేణూ ఆరోపించారు.
today-latest-news-in-telugu | renu-desai | actress | inter-view