Mexico: మెక్సికోలో కూలిన విమానం...ముగ్గురు మృతి
దక్షిణ మెక్సికోలో విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ఒక విమానం కూలిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. ఈ ప్రమాదంలో ఇద్దరు గ్వాటెమాలన్ పైలట్లు, ఒక మెక్సికన్ సిబ్బంది మరణించారని విమానయాన అధికారులు తెలిపారు.
దక్షిణ మెక్సికోలో విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ఒక విమానం కూలిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. ఈ ప్రమాదంలో ఇద్దరు గ్వాటెమాలన్ పైలట్లు, ఒక మెక్సికన్ సిబ్బంది మరణించారని విమానయాన అధికారులు తెలిపారు.
దక్షిణ కాలిఫోర్నియాను 5.1 తీవ్రతతో భూకంపం తాకిందని అమెరికా భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు తెలిపారు.ఇది జూలియన్‌కు దక్షిణంగా 2.5 మైళ్లు కేంద్రీకృతమై ఉందని, ఇది అమెరికా మెక్సికో సరిహద్దు ఎనిమిది మైళ్ల లోతులో ఉందని అధికారులు తెలిపారు.
అమెరికాలో గుడ్ల ధర ఆకాశాన్నంటుతోంది. పరిస్థితి ఎంత దారుణంగా మారిందంటే మెక్సికో, కెనడా వంటి దేశాల నుంచి ప్రజలు గుడ్లను అక్రమంగా రవాణా చేస్తున్నారు. కొన్ని నగరాల్లో ఒక డజను గుడ్ల ధర $10 అంటే సుమారు రూ. 870 కి చేరుకుంది.
అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. న్యూమెక్సికో లోని లాస్ క్రూసెస్ లో లాస్ క్రూస్ లో రెండు గ్రూప్ ల మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా,15 మంది తీవ్ర గాయాల పాలయ్యారు.
కెనడా, మెక్సికో దేశాల వస్తుులపై విధించిన దిగుమతి సుంకాల విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెనక్కు తగ్గారు. టారిఫ్ ల పెంపు కార్యక్రమాన్ని నెలరోజుల పాటూ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మొదలు పెట్టిన వాణిజ్య యుద్దం ప్రమాదకరమైందని దిగ్గజ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ అన్నారు. ఇది ట్రంప్ దుందుడుకు చర్య అని బఫెట్ పేర్కొన్నారు.కెనడా, చైనా , మెక్సికో పై సుంకాల విధింపునునేటి నుంచి అగ్రరాజ్యం మొదలు పెట్టింది.
వలసదారులను బహిష్కరించడం, పరస్పర సుంకాల బెదిరింపు వంటి ట్రంప్ చర్యలకు భయపడటం లేదని మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షేన్‌బామ్ అన్నారు. మెక్సికో సార్వభౌమత్వానికి భంగం కలిగించేందుకు యత్నిస్తే అడ్డుకుంటామని తేల్చిచెప్పారు.
దక్షిణ మెక్సికోలోని టబాస్కో రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. 48 మందితో వెళ్తున్న బస్సును ఓ ట్రక్కు ఢీకొంది. దీంతో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగి 40 మంది సజీవ దహనమయ్యారు. ఇప్పటి వరకు 18 మందికి చెందిన అవశేషాలను గుర్తించినట్లు అధికారు తెలిపారు.
అమెరికా సుంకాల విషయంలో మెక్సికో, కెనడాలకు తాత్కాలిక ఊరట లభించింది. సుంకాల విధింపును నెల రోజుల పాటు నిలిపివేయనున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. సుంకాల అంశంపై రెండు దేశాల మధ్య తదుపరి చర్చలు ఉంటాయని ట్రంప్ తెలిపారు.