Donald Trump: ట్రంప్ మొదటి చట్టం ఇదే.. అమెరికాలో అమల్లోకి వచ్చిన లేకెన్ రిలే యాక్ట్
అమెరికాలో ట్రంప్ గవర్నమెంట్ ఫస్ట్ చట్టాన్ని అమలులోకి తెచ్చింది. USలో నేరాలు చేసి పట్టుబడ్డ దోషులను వారి దేశాలకు పంపించే విధంగా లేకెన్ రిలే చట్టం అమల్లోకి తెచ్చారు.
అమెరికాలో ట్రంప్ గవర్నమెంట్ ఫస్ట్ చట్టాన్ని అమలులోకి తెచ్చింది. USలో నేరాలు చేసి పట్టుబడ్డ దోషులను వారి దేశాలకు పంపించే విధంగా లేకెన్ రిలే చట్టం అమల్లోకి తెచ్చారు.
ఏపీ నెల్లూరు జిల్లాలో మరో ఘోరం జరిగింది. గూడూరు పట్టణ సమీపంలోని పంబలేరు వాగులో ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాల సెకండ్ ఇయర్ విద్యార్థిని లేహానెస్సి మృతదేహం కలకలం రేపుతోంది. ఆమెను హత్య చేశారా లేక ఆత్మహత్య చేసుకుందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఐసీసీ మెగా టోర్నీ ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభ వేడుకల షెడ్యూల్ ఖరారైంది. ఫిబ్రవరి 19నుంచి టోర్నీ మొదలుకానుండగా 16న లాహోర్ వేదికగా వేడుకలు ప్రారంభించనున్నారు. క్రికెట్ బోర్డుల ప్రతినిధులు, మాజీ క్రికెటర్లు, సెలబ్రిటీలు హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది.
ఖురాన్‌ను తగలబెట్టిన ఇరాక్ క్రిస్టియన్ సాల్వన్ మోమికా కాల్చి చంపబడ్డాడు. ఈ కేసులో గురువారం స్టాక్‌హోమ్ కోర్టుకు హాజరు కావాల్సివుండగా బుధవారం అతని ఇంట్లోనే గుర్తు తెలియని వ్యక్తులు కాల్చిచంపారు. దీంతో ఈ కేసు తీర్పు ఫిబ్రవరి 3కు కోర్టు వాయిదా వేసింది.
ఒక వ్యక్తి ప్రాణాలు కాపాడేందుకు జపాన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. యాషియోలో భూమికుంగడంతో ఒక భారీగుంత ఏర్పడి డ్రైనేజీ పైపు పగిలింది. ఒక ట్రక్కుతో సహా డ్రైవర్ అందులో పడిపోయాడు. స్నానం చేయొద్దు, బట్టలు ఉతకొద్దు ప్లీజ్ అని ప్రజలను అధికారులు కోరారు.
ప్రభుత్వ భూమిలో అక్రమ విల్లాలు నిర్మించిన లేడీ డాన్ గుర్రం విజయలక్ష్మిని పోలీసులు అరెస్ట్ చేశారు. మల్లంపేటలో రూ.400 కోట్లకు పైగా అక్రమ లావాదేవీలకు పాల్పడిన ఆమెను శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అదుపులోకి తీసుకున్నారు. 5 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
సీతాపుర్ కాంగ్రెస్ ఎంపీ రాకేశ్ రాథోడ్ అరెస్టు అయ్యారు. అత్యాచార ఆరోపణలపై కేసు నమోదు కావడంతో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన ఇంటిముందు మీడియాతో మాట్లాడుతుండగానే అరెస్టు చేసి భారీ భద్రత నడుమ కోర్టుకు తీసుకెళ్లారు.
దక్షిణాఫ్రికా బంగారు గనుల్లో అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్న వారి ఆకలి కేకలు మానవాళిని దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. 1కి.మీ లోతు భూగర్భంలోకి వెళ్లిన వారిని బయటకు రప్పించేందుకు పోలీసులు ఆహారం, నీటి సరాఫరాను ఆపేశారు. దీంతో తొటివారినే పీక్కుతింటున్నారట.
వైసీపీ నేతలకు దిమాక్ ఖరాబ్ అయిందంటూ కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చేసిన వ్యాఖ్యలపై అంబటి రాంబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 'మాకు దిమాక్ లేదు. కానీ మీకుంటే కక్కిన కూటికోసం ఎందుకు కక్కుర్తి పడుతున్నారు. నిజంగా దిమాక్ ఉంటే హామీలు నెరవేర్చండి' అన్నారు.