/rtv/media/media_files/2025/01/30/tqnqfHNt02fkhkuH4zRO.jpg)
south africa Photograph: (south africa)
Cannibals: దక్షిణాఫ్రికాలోని బంగారు గనుల అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్న వారి ఆకలి కేకలు మానవాళిని దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. గనుల్లోకి వెళ్లిన కొంతమంది వ్యక్తులు అక్కడ ఆకలి తట్టుకోలేక వారితో వెళ్లిన వారిని చంపి తింటున్నట్లు వెలుగులోకి రావడం భయాందోళనకు గురిచేస్తోంది. గనుల్లోకి వెళ్తున్న వారిని బయటకు రప్పించేందుకు ఆహారం, నీటి సరఫరాను నిలిపివేశారు పోలీసులు. దీంతో మనుషులు మనుషులను తినే పరిస్థితి ఏర్పడింది. ఒక కిలోమీటర్ భూగర్భంలోకి వెళ్లిన వారిని బయటకు రప్పించేదుకు పోలీసులు చర్యలు చేపట్టగా లోపల ఆకలికి తట్టుకోలేక తోటి వారి శరీర భాగాలను తింటున్నారని గని నుండి బయటకు వచ్చిన ఇద్దరు వ్యక్తులు చెప్పారు. గనిలో సహచరుల కాళ్లు, చేతులు, పక్కటెముకలను ముక్కలుగా చేసి తిన్నారు. బతకాలంటే ఇది మాకు మిగిలి ఉన్న ఏకైక మార్గమని వారు తెలిపారు.
Also Read: జూ.ఎన్టీఆర్ను మళ్లీ అవమానించిన బాలయ్య.. ఫొటోలు వైరల్!
క్రిమినల్ ముఠాల హస్తం..
గత వారం రెస్క్యూ టీమ్ సహాయక చర్యలు చేపట్టగా ఒక లోతైన గనిలోనుంచి 78 మృతదేహాలను బయటకు తీశారు. 246 మంది ప్రాణాలతో బయటపడ్డట్లు పోలీసులు తెలిపారు. ఇక అక్రమదారులకు, ప్రభుత్వానికి మధ్య చాలా కాలంగా వాగ్వాదం జరుగుతోంది. బంగారు గనుల్లోకి ప్రవేశించి బంగారాన్ని వెలికితీసే ప్రమాదకరమైన పనిని కూడా చేస్తున్నారు. ఆగస్ట్‌లో నార్త్ వెస్ట్ ప్రావిన్స్‌లోని బఫెల్‌ఫాంటైన్ బంగారు గని నుంచి వందలాది మంది అక్రమ మైనర్‌లను తిరిగి రప్పించేందుకు ఆహార సరఫరాలను అడ్డుకున్నాం. బంగారం కోసం అక్రమ మైనింగ్ సర్వసాధారణం. అయితే క్రూరమైన క్రిమినల్ ముఠాలు దీని వెనుక ఉన్నాయి. నేరస్తుల కారణంగా గనులు ప్రమాదకరంగా మారుతున్నాయి. దీని కారణంగా లోపలికి వెళ్లలేకపోతున్నాం. అందుకే ఆకలితో అలమటించేలా చేసి ప్రజలను అందులోనుంచి వెళ్లగొట్టే ప్రయత్నం చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
పోలీసుల మారణహోమం..
మైనర్లు పెద్ద సంఖ్యలో గనుల్లో చిక్కుకుపోయారని, వారిని బయటకు రాలేని విధంగా బలహీనులుగా మార్చి పోలీసులే చావుకు కారణమయ్యారని స్థానిక ప్రజలు, పలు సంఘాలు ఆరోపించాయి. దీంతో అధికారులు కోర్టు ఆదేశాలతో రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. రెస్క్యూ సమయంలో గని నుంచి మృతదేహాలను బయటకు తీయడానికి సుదీర్ఘ ప్రక్రియ జరిగింది. అయితే మృతదేహాలు బయటపడటంతో పోలీసుల మారణహోమం అని మండిపడుతున్నారు. ఈ ఘటనపై విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. అక్రమ మైనర్ల ప్రధాన నాయకుడు జేమ్స్ నియో తోలీ.. అవినీతి అధికారుల సహాయంతో పోలీసు కస్టడీ నుంచి తప్పించుకున్నాడని ఆరోపణల నేపథ్యంలో పోలీసులపై ఒత్తిడి మరింత పెరిగింది. మొత్తంగా ఇప్పటి వరకు 1300 మందికి పైగా మైనర్లు గని నుంచి బయటకు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు.
Also Read: Amabati: అవును మాకు దిమాక్ లేదు.. కక్కిన కూటికోసమే కక్కుర్తి: అంబటి సంచలన కామెంట్స్!
గనులు ఖాళీగానే ఉన్నాయి..
దక్షిణాఫ్రికా మైనింగ్ మంత్రి గ్వేడే మాంటాషే మాట్లాడుతూ.. 'ప్రజలు ప్రమాదకరమైన ప్రదేశానికి వెళ్లి మూడు నెలలు ఆకలితో చనిపోతే అది ప్రభుత్వ బాధ్యత ఎలా అవుతుంది?. దక్షిణాఫ్రికా భూమి బంగారం, ప్లాటినం, మాంగనీస్ ఇతర లోహాలతో నిండి ఉంది. దేశంలో 6000 గనులు ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు ఖాళీగా ఉన్నాయి. దేశంలో పెద్ద ఎత్తున నిరుద్యోగం ఉంది. దీని కారణంగా ఇక్కడి ప్రజలు ఇలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతున్నారు' అని గ్వేడే అన్నారు.
Also Read: Suryapet Murder: చంపింది నాన్నమ్మనే.. ప్రైవేట్ పార్ట్స్‌ను కసితీరా తొక్కి.. భార్గవి సంచలన నిజాలు!