/rtv/media/media_files/2025/01/30/iDDsdls8qUiAZiJAJD44.jpg)
UP Congress MP Rakesh Rathore arrested in rape case
Congress MP Arrest: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం సీతాపుర్ కాంగ్రెస్ ఎంపీ రాకేశ్ రాథోడ్(UP Congress MP Rakesh Rathore) అరెస్టు అయ్యారు. అత్యాచార ఆరోపణలపై కేసు నమోదు కావడంతో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన ఇంటిముందే మీడియాతో మాట్లాడుతుండగానే అరెస్టు చేసి భారీ భద్రత నడుమ కోర్టుకు తీసుకెళ్లారు.
ఇది కూడా చదవండి: Double ISMART: తెలుగులో ఫ్లాప్.. హిందీలో 100 మిలియన్ల వ్యూస్.. యూట్యూబ్ లో డబుల్ ఇస్మార్ట్ సర్ప్రైజ్!
Congress MP from Sitapur (UP) Rakesh Rathore arrested by UP Police in a Rape case..
— Mr Sinha (@MrSinha_) January 30, 2025
He's close to Rahul Gandhi & Priyanka Vadra...pic.twitter.com/q5XKCnHK4s
ఇది కూడా చదవండి: Suryapet Murder: చంపింది నాన్నమ్మనే.. ప్రైవేట్ పార్ట్స్‌ను కసితీరా తొక్కి.. భార్గవి సంచలన నిజాలు!
పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారం..
ఈ మేరకు ఎంపీ రాకేశ్ రాథోడ్ పెళ్లి చేసుకుంటానని నమ్మించి నాలుగు సంవత్సరాలు తనపై అత్యాచారానికి పాల్పడినట్లు ఓ మహిళ జనవరి 17న పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేకాదు రాథోడ్ తనతో మాట్లాడిన కాల్ రికార్డింగ్స్‌ను పోలీసులకు అందించింది. దీంతో పక్కా ఆధారాలు లభించడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
అయితే బుధవారమే ఎంపీ రాథోడ్ అలహాబాద్ హైకోర్టు లఖ్‌నవూ బెంచ్‌లో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. కానీ కోర్టు రాథోడ్ పిటిషన్ ను తోసిపుచ్చింది. రెండు వారాల్లోగా సెషన్స్ కోర్టులో లొంగిపోవాలని రాథోడుకు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో రాథోడ్ తన ఇంటిముందే మీడియాతో మాట్లాడుతుండగానే అరెస్టు చేసి భారీ భద్రత నడుమ కోర్టుకు తీసుకెళ్లారు.