Donald Trump: ట్రంప్ మొదటి చట్టం ఇదే.. అమెరికాలో అమల్లోకి వచ్చిన లేకెన్ రిలే యాక్ట్

అమెరికాలో ట్రంప్ గవర్నమెంట్ ఫస్ట్ చట్టాన్ని అమలులోకి తెచ్చింది. USలో నేరాలు చేసి పట్టుబడ్డ దోషులను వారి దేశాలకు పంపించే విధంగా లేకెన్‌ రిలే చట్టం అమల్లోకి తెచ్చారు.

New Update
us relay act

us relay act Photograph: (us relay act )

Donald Trump: అమెరికా 47 అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు స్వీకరించగానే అక్రమ వలసదారులు, నేరస్థులపై ఉక్కుపాదం మోపారు. అగ్రరాజ్యంలో శాంతిభద్రతలు నెలకొల్పడానికి డొనాల్డ్ ట్రంప్ రెండవ సారి అధికారంలోకి రాగానే మొదట లేకెన్‌ రిలే చట్టం అమల్లోకి తెచ్చారు. ఈ చట్టంతో వలసదారులను నిర్భంధించడంతో పాటు.. దేశం నుంచి బహిష్కరించే విధంగా ఓ చట్టాన్ని తీసుకొచ్చారు. దొంగతనాలు, దోపిడిలతో సహా ఇతర చిన్న చిన్న నేరాలకు పాల్పడి పట్టుబడిన వారిని సొంత దేశాలకు పంపించనున్నారు. దేశం నుంచి బహిష్కరించడానికి ఫెడరల్ అధికారులకు విస్తృత అధికారాలు కట్టబెట్టారు ట్రంప్.

ఇది కూడా చదవండి: BRS బాగోతం తెలిసిపోయింది.. ఈ పోల్ పెట్టిందే అందుకు.. సీక్రెట్ చెప్పిన కాంగ్రెస్ నేత!

ఇది కూడా చదవండి: Chief Secretary : తెలంగాణకు కొత్త సీఎస్ ఎవరు.. లిస్ట్లో ఎవరెవరు ఉన్నారంటే!

లేకెన్ రిలే యాక్ట్.. (Laken Relay Act)

లేకెన్ రిలే యాక్ట్ అమెరికా చరిత్రలో ల్యాండ్ మార్క్ లా అంటూ ట్రంప్ ప్రకటించారు. పట్టుబడిన క్రిమినల్స్‌ను వారి సొంత దేశాలకు పంపించేలా చట్టం తీసుకొచ్చారు. గతేడాది జార్జియాలో నర్సింగ్ స్టూడెంట్ రిలేను వెనెజులాకు చెందిన వ్యక్తి దారుణంగా హత్య చేశాడు. రిలే పేరు మీదుగానే అమెరికా చట్టాన్ని రూపొందించింది. అక్రమ వలసదారులపై మరింత కఠినంగా వ్యవహరిస్తామని ట్రంప్ గట్టిగా చెబుతున్నారు. 

ఇది కూడా చూడండి:  USA: గడ్డకట్టే చలిలో నీళ్ళల్లో పడి బతకడం కష్టమే..ఇప్పటికి 18మంది మృతి

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు