/rtv/media/media_files/2025/01/17/IxT6HGrSl1xfIPLJnqxe.jpg)
Maoist party released letter on Chhattisgarh encounter
Maoist: ఇటీవల జరిగిన ఛత్తీస్‌గఢ్ - ఒడిశా ఎన్‌కౌంటర్లపై మావోయిస్టు పార్టీ లేఖ విడుదల చేసింది. కేంద్ర కమిటీ సభ్యుడు రామచంద్రారెడ్డి అలియాస్ చలపతి మృతి చెందడం పార్టీకి తీరని లోటు అంటూ ఆయనకు ఘన నివాళి అర్పించింది. ఈ మేరకు సెంట్రల్ రీజనల్ బ్యూరో, సీపీఐ(మావోయిస్టు) ప్రచార కమిటీ పేరుతో రిలీజ్ చేసిన లేటర్‌లో ప్రజా పోరాటంలో అసువులు బాసిన అమరవీరుల త్యాగాలు వృధా కావని పేర్కొంది.
16 మంది 40 గంటల యుద్ధం..
ఏఓబీ ఉద్యమంతో చలపతికి 32 ఏళ్ల అనుబంధం ఉంది. ఆయన 2020 నుంచి జైరామ్ పేరుతో ఒడిశా రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. గత కొంతకాలంగా తీవ్రమైన అనారోగ్యంతో బాధపడ్డారు. నడిచేందుకు కాళ్లు సహకరించకపోయినా రెండు కర్రల సాయంతో తాను ఎంచుకున్న మార్గం, కర్తవ్యం కోసం రాష్ట్రాలు దాటి నడిచివెళ్లారు. అలాంటి గొప్ప వ్యక్తి ఇటీవల పోలీసులు ఏకపక్ష కాల్పుల్లో గరియాబంద్ జిల్లా మైన్ పూర్ అటవీ ప్రాంతంలో విరోచితంగా పోరాడుతూ అమరుడయ్యారు. ఆయనతో పాటు 16 మంది 40 గంటల పాటు పోరాడి ప్రాణాలొదిరారు. అమరుల ఆశయ సాధనకు మనమంతా పునరంకితమవుదాం అని మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది.
ఇది కూడా చదవండి: Telangana Assembly: ఫిబ్రవరి 7న అసెంబ్లీ స్పెషల్ సమావేశాలు.. కులగణనపై కీలక ఘట్టం
ఇదిలా ఉంటే.. ఛత్తీస్‌గఢ్ సుక్మా జిల్లాలో 9 మంది మావోయిస్టులు లొంగిపోయారు. సుక్మా జిల్లా ఎస్పీ కిరణ్ చౌహాన్ లొంగిపోయిన మావోయిస్టులను మీడియా ముందు హాజరుపరిచి వారి వివరాలు వెల్లడించారు. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం నక్సలిజం నిర్మూలన, పునరావాస విధానం 'నియాద్ నెల్ల నార్' పథకం ప్రభావంతో మావోయిస్టులు లొంగిపోతున్నట్లు చెప్పారు.