BIG BREAKING: మరో ఎన్కౌంటర్.. అయిదుగురు మావోయిస్టులు మృతి
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు, భద్రతాదళాలకు మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో అయిదుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది.
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు, భద్రతాదళాలకు మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో అయిదుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది.
మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ పోలీసుల అదుపులో ఉన్నాడని వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డికి, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు తిప్పిరి తిరుపతి తమ్ముడి కూతురు సుమ లేఖ రాసింది.
తన చానల్ వీక్షకులను పెంచుకోవాలని భావించిన ఓ యూట్యూబర్ మాజీ మావోయిస్టుతో సంచలన ఇంటర్వ్యూ చేశాడు. ఈ సందర్భంగా మావోయిస్టుగా ఉన్న సమయంలో తను చేసిన హత్యలను వివరించాడు. ఆ ఇంటర్వ్యూ చూసిన ఓ వ్యక్తి తన తండ్రి చావుకు కారణమని భావించి అతన్నిదారుణంగా హత్య చేశాడు.
కోనసీమజిల్లాలో మావోయిస్టు అగ్రనేత హిడ్మా అనుచరుడిగా భావిస్తున్న మడివిసరోజ్‌ను పోలీసులు రావులపాలెంలో అదుపులోకి తీసుకోవడం సంచలనంగా మారింది. అతడిని అరెస్ట్ చేసి రహస్య ప్రాంతంలో విచారిస్తున్నట్లు సమాచారం. ఆయన ఇచ్చిన సమాచారంతో మావోయిస్టుల కోసం గాలిస్తున్నారు.
కృష్ణా జిల్లాతో పాటు విజయవాడ, కాకినాడలో మొత్తం 31 మంది మావోయిస్టులను పోలీసులు అరెస్ట్ చేసినట్లు ఏడీజీ మహేశ్ చంద్ర లడ్డా తెలిపారు. వీరిలో 9 మంది కేంద్ర కమిటీ సభ్యులు ఉన్నారని వివరించారు. పట్టుబడిన మావోయిస్టులు అంతా హిడ్మా టీం అని తేల్చారు పోలీసులు.
సుదీర్ఘంగా జరిగిన ఈ ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఎన్కౌంటర్లో మావోయిస్ట్ కేంద్ర కమిటీ నాయకుడు హిడ్మా మృతి చెందినట్లుగా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వెల్లడించారు.
దేశవ్యాప్తంగా అత్యంత 'వాంటెడ్' మావోయిస్టు నేతలు హిడ్మా, గణపతి, దేబూజీలను గుర్తించే ఆపరేషన్ చేపట్టింది కేంద్రం. అందులో భాగంగా CRPF కమాండోలు, ఉపగ్రహ నిఘా, డ్రోన్లను ఉపయోగించి ఛత్తీస్‌గఢ్, ఒడిశా, తెలంగాణ, మహారాష్ట్రలలో ఉమ్మడి కార్యకలాపాలను ముమ్మరం చేసింది.
వరుస ఎన్కౌంటర్లు, లొంగుబాట్లతో కూనరిల్లుతున్న మావోయిస్టు పార్టీ సంచలన నిర్ణయం ప్రకటించింది. మరోసారి కాల్పుల విరమణపై కీలక ప్రకటన చేసింది. మరో ఆరునెలల పాటు కాల్పుల విరమణ చేయనున్నట్లు మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ ఒక లేఖ విడుదల చేశారు.
మావోయిస్టు పార్టీకి చెందిన తెలంగాణ కీలక సభ్యులు డీజీపీ శివధర్ రెడ్డి ముందు మంగళవారం లొంగిపోయారు. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు చంద్రన్న అలియాస్ ప్రసాదరావు, రాష్ట్ర కమిటీ సభ్యుడు బండి ప్రకాశ్ లు తెలంగాణ డీజీపీ ముందు లొంగిపోయారు.