Maoists: మరో 41 మంది మావోయిస్టుల సరెండర్
మావోయిస్టుల లొంగుబాటు కొనసాగుతూనే ఉంది. తాజాగా మరో 41 మంది మావోయిస్టులు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ముందు లొంగిపోయారు. వాళ్ల నుంచి 24 తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు
మావోయిస్టుల లొంగుబాటు కొనసాగుతూనే ఉంది. తాజాగా మరో 41 మంది మావోయిస్టులు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ముందు లొంగిపోయారు. వాళ్ల నుంచి 24 తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు
మావోయిస్టు పార్టీ కీలక నేత హిడ్మా ఎన్‌కౌంటర్‌పై ఆ పార్టీ సంచలన లేఖను విడుదల చేసింది. హిడ్మాది ముమ్మాటికి భూటకపు ఎన్‌కౌంటరే అని తేల్చి చెప్పింది. ఈ మేరకు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ (DKSZC) వికల్ప్ పేరిట లేఖను విడుదల చేసింది.
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు, భద్రతాదళాలకు మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో అయిదుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది.
మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ పోలీసుల అదుపులో ఉన్నాడని వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డికి, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు తిప్పిరి తిరుపతి తమ్ముడి కూతురు సుమ లేఖ రాసింది.
తన చానల్ వీక్షకులను పెంచుకోవాలని భావించిన ఓ యూట్యూబర్ మాజీ మావోయిస్టుతో సంచలన ఇంటర్వ్యూ చేశాడు. ఈ సందర్భంగా మావోయిస్టుగా ఉన్న సమయంలో తను చేసిన హత్యలను వివరించాడు. ఆ ఇంటర్వ్యూ చూసిన ఓ వ్యక్తి తన తండ్రి చావుకు కారణమని భావించి అతన్నిదారుణంగా హత్య చేశాడు.
కోనసీమజిల్లాలో మావోయిస్టు అగ్రనేత హిడ్మా అనుచరుడిగా భావిస్తున్న మడివిసరోజ్‌ను పోలీసులు రావులపాలెంలో అదుపులోకి తీసుకోవడం సంచలనంగా మారింది. అతడిని అరెస్ట్ చేసి రహస్య ప్రాంతంలో విచారిస్తున్నట్లు సమాచారం. ఆయన ఇచ్చిన సమాచారంతో మావోయిస్టుల కోసం గాలిస్తున్నారు.
కృష్ణా జిల్లాతో పాటు విజయవాడ, కాకినాడలో మొత్తం 31 మంది మావోయిస్టులను పోలీసులు అరెస్ట్ చేసినట్లు ఏడీజీ మహేశ్ చంద్ర లడ్డా తెలిపారు. వీరిలో 9 మంది కేంద్ర కమిటీ సభ్యులు ఉన్నారని వివరించారు. పట్టుబడిన మావోయిస్టులు అంతా హిడ్మా టీం అని తేల్చారు పోలీసులు.