Champions Trophy 2025: ఐసీసీ మెగా టోర్నీ ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభ వేడుకలకు సంబంధించి షెడ్యూల్ విడుదలైంది. ఫిబ్రవరి 19నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నీకి పాకిస్థాన్(Pakistan) ఆతిథ్యం ఇవ్వనుంది. అయితే టోర్నీ సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రారంభ వేడుకలకు సంబంధించి షెడ్యూల్‌ను పీసీబీ అప్రూవ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఫిబ్రవరి 16న లాహోర్ వేదికగా వేడుకలు మొదలుకానుండగా క్రికెట్ బోర్డుల ప్రతినిధులు, మాజీ క్రికెటర్లు, సెలబ్రిటీలు(Celebrities) హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చూడండి: తస్సాదియ్యా మామూలోడు కాదయ్యా సిరాజ్ : ఆమెతో కాదు.. ఈమెతో డేటింగ్!
రోహిత్ శర్మ హాజరుపై ఉత్కంఠ..
ఈ టోర్నీలో పాల్గొనే అన్ని టీమ్స్ కెప్టెన్స్ ప్రారంభ వేడుకల్లో పాల్గొనాల్సివుంటుంది. అయితే భారత్ పాక్ వెళ్లేందుకు నిరాకరించడంతో కెప్టెన్ రోహిత్ శర్మ(Captain Rohit Sharma) ఈ వేడుకలకు హాజరవుతాడా? లేదా అనేదానిపై ఇంకా బీసీసీఐ నుంచి ఎలాంటి సమాచారం లేదు. ఐసీసీ(ICC), పీసీబీ(PCB) కూడా ఎలాంటి విషయాన్ని వెల్లడించలేదు. ఫిబ్రవరి 16న 8 జట్ల కెప్టెన్స్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లు, ఫొటో షూట్‌లు నిర్వహించనున్నారు. ఛాంపియన్ ట్రోఫీ తొలి మ్యాచ్ కరాచీ వేదికగా పాకిస్థాన్ Vs న్యూజిలాండ్ మధ్య జరగనుంది. భారత్ ఆడే మ్యాచ్ లు అన్నీ దుబాయ్ వేదికగా నిర్వహించనున్నారు. ఈ టోర్నీలో భారత్ ఫైనల్ వెళితే ఆ మ్యాచ్ కూడా దుబాయ్‌లోనే జరగనుంది.
ఇదిలా ఉంటే.. ఐసీసీ విధించిన డెడ్‌లైన్‌లోగా స్టేడియాలను సిద్ధం చేసేందుకు పీసీబీ రాత్రి పగలు కష్టపడుతోంది. ఫిబ్రవరి 7న పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చేతుల మీదుగా గడాఫీ స్టేడియం ప్రారంభించనున్నారు. ఇక ఫిబ్రవరి 11న కరాచీలోని నేషనల్ స్టేడియం ప్రారంభోత్సవానికి పాక్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్ధారి ముఖ్య అతిథిగా రానున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీలో 8 జట్లు తలపడనున్నాయి. ఇప్పటికే 7 దేశాలు స్క్వాడ్‌లను ప్రకటించగా ఐసీసీ ఇచ్చిన గడువు పూర్తైనప్పటికి పాక్ స్క్వాడ్‌ను ప్రకటించలేదు. దీంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఇది కూడా చదవండి: ఫిబ్రవరి 7న అసెంబ్లీ స్పెషల్ సమావేశాలు.. కులగణనపై కీలక ఘట్టం
ఇది కూడా చూడండి: Maha Kumbh mela: వీవీఐపీల పాస్ లు రద్దు..వాహనాలకు కూడా నో ఎంట్రీ..కుంభమేళాలో మార్పులు!