/rtv/media/media_files/2025/01/30/MTXb7A2MFV6LkC2DAtIn.jpg)
Hyderabad Mallampeta illegal villas Construction case Vijayalakshmi Arrest
Lady Don VijayaLaxmi: ప్రభుత్వ భూమిలో అక్రమ విల్లాలు నిర్మించిన లేడీ డాన్ గుర్రం విజయలక్ష్మిని పోలీసులు అరెస్ట్ చేశారు. మల్లంపేటలో రూ.400 కోట్లకు పైగా అక్రమ లావాదేవీలకు పాల్పడిన ఆమెను శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అదుపులోకి తీసుకున్నారు. 5 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
ఇది కూడా చదవండి: Double ISMART: తెలుగులో ఫ్లాప్.. హిందీలో 100 మిలియన్ల వ్యూస్.. యూట్యూబ్ లో డబుల్ ఇస్మార్ట్ సర్ప్రైజ్!
325 అక్రమ విల్లాలు నిర్మించి..
ఈ మేరకు 2021 నుంచి మల్లంపేటలో ఎలాంటి అనుమతులు లేకుండానే సర్వేనెంబర్ 170/3, 170/4, 170/5 లో 'గ్రూప్ ఆఫ్ కన్‌స్ట్రక్షన్స్'పేరిట 325 అక్రమ విల్లాలు నిర్మించింది. వీటి ఖరీదు రూ. 400 కోట్లకు పైగానే ఉండగా 2024లో బాధితులు విజయలక్ష్మిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో దర్యాప్తు ప్రారంభించిన దుండిగల్ పోలీసులు.. ఎఫ్ఐఆర్ 803/2024 ఆధారంగా సెక్షన్ 318(4), 318(2), 316(2), రెడ్ విత్ 2(5)బీఎన్ఎస్ యాక్ట్ ప్రకారం 2024 సెప్టెంబర్ 29న కేసు నమోదు చేశారు.
ఇక విచారణలో విజయలక్ష్మి ఆర్థిక నేరాలకు పాల్పడ్డట్టు రుజువుకావడంతో 6 నెలల క్రితం లుక్ ఔట్ నోటీసులు జారీ చేసి పాస్ పోర్ట్ సీజ్ చేశారు. దీంతో పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్న విజయలక్ష్మి బుధవారం విదేశాలకు పారిపోతుండగా శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో అర్ధరాత్రి ఒంటిగంటకు అరెస్ట్ చేశారు. అలాగే విజయలక్ష్మి నిర్మించిన 11 విల్లాలను అక్టోబర్‌లో హైడ్రా అధికారులు కూల్చివేశారు.
ఇది కూడా చదవండి: BIG BREAKING: రేప్ కేసులో కాంగ్రెస్ ఎంపీ అరెస్ట్!
అప్పటి నుంచి అజ్ఞాతంలో ఉంటున్న ఆమె.. ఎయిర్ పోర్టులో అడ్డంగా బుక్ అయింది. విచారణ నిమిత్తం ఆమెను దుండిగల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. విషయం తెలియగానే మల్లంపేట విల్లాల బాధితులు దుండిగల్ పోలీస్ స్టేషన్ కు చేరుకొని ఆమెకు వ్యతిరేకంగా సంతకాలు సేకరించారు. తమకు న్యాయం చేయాలని పోలీసులన కోరారు.
ఇది కూడా చదవండి: Suryapet Murder: చంపింది నాన్నమ్మనే.. ప్రైవేట్ పార్ట్స్‌ను కసితీరా తొక్కి.. భార్గవి సంచలన నిజాలు!