Telangana: మెట్రోను స్వాధీనం చేసుకున్న తెలంగాణ ప్రభుత్వం
హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఈ ప్రాజెక్టును నిర్వహిస్తున్న ఎల్ అండ్ టీ సంస్థ నుంచి 100 శాతం షేర్లను కొనుగోలు చేసింది.
హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఈ ప్రాజెక్టును నిర్వహిస్తున్న ఎల్ అండ్ టీ సంస్థ నుంచి 100 శాతం షేర్లను కొనుగోలు చేసింది.
హైదరాబాద్ మెట్రో రైలు వ్యవస్థలో చారిత్రాత్మక మార్పు చోటుచేసుకుంది. ఈ ప్రాజెక్టును ప్రైవేట్ భాగస్వామ్య సంస్థ ఎల్ అండ్ టీ (L&T) నుంచి స్వాధీనం చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రూ.15 వేల కోట్లతో 100 శాతం ఈక్విటీ వాటాను కొనుగోలు చేయనుంది.
ట్రాన్స్జెండర్లకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం ఇప్పటికే పలు అవకాశాలు కల్పించింది. ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి వారిని వినియెగించుకుంటోంది. తాజాగా వారికి నగరంలోని మెట్రోస్టేషన్లలో సెక్యూరిటీ ఉద్యోగాలను ఇవ్వాలని నిర్ణయించింది.
హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో మార్పులు జరగనున్నాయి. నవంబర్ 3 నుంచి ఈ మార్పులు అమల్లోకి రానున్నట్లు మెట్రో రైలు సంస్థ ప్రకటించింది. కొత్త షెడ్యూల్ ప్రకారం.. ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు రైలు ప్రయాణం అందుబాటులో ఉంటుందని తెలిపింది.
పండుగ సెలవుల తర్వాత హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ స్తంభించిపోయింది. దీంతో మెట్రో స్టేషన్లకు జనం పోటెత్తారు. ఎల్బీ నగర్ వంటి స్టేషన్లలో ఎస్కలేటర్లు పనిచేయక, ప్లాట్‌ఫారంకు చేరడానికి గంటల సమయం పట్టి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
మెట్రో ప్రాజెక్టు నిర్వాహణ నుంచి ఎల్అండ్టీ తప్పుకోవడానికి కారణం ప్రభుత్వ బాధ్యతారాహిత్యమేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. తమ ప్రభుత్వ హయాంలో దశల వారీగా మెట్రో విస్తరణకు గతంలో కేసీఆర్ కేబినెట్ ఆమోదం తెలిపిందని వెల్లడించారు.
హైదరాబాద్ మెట్రో రైలు నిర్వహణ నుంచి L&T తప్పుకుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం చేతికి మెట్రో మొదటి దశ ప్రాజెక్టు రానుంది. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్, ఎల్ ఎండ్ టీ సీఎండీ మధ్య అంగీకారం కుదిరింది.
హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్ట్ నుంచి వైదొలగాలని L&T సంస్థ నిర్ణయించుకుంది. ఈ మేరకు L&T సంస్థ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఓ లేఖ రాసింది. కంపెనీ ఎదుర్కొంటున్న భారీ నష్టాలు, అప్పులు, 2వ దశ ప్రాజెక్ట్‌లో తలెత్తే నిర్వహణ సవాళ్లే కారణమని సంస్థ పేర్కొంది.
శనివారం గణేశ్ నిమజ్జన ఉత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో.. ప్రయాణికులకు గుడ్‌న్యూస్ చెప్పింది. అన్ని మెట్రో స్టేషన్ల నుంచి శనివారం ఉదయం గంటల నుంచి అర్ధరాత్రి ఒంటిగంట వరకు సర్వీసులు అందుబాటులో ఉంటాయని ప్రకటన చేసింది.