/rtv/media/media_files/2026/04/29/telangana-govt-takes-over-hyderabad-metro-operations-2026-04-29-21-34-52.jpg)
Telangana govt takes over Hyderabad metro operations
హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఈ ప్రాజెక్టును నిర్వహిస్తున్న ఎల్ అండ్ టీ సంస్థ నుంచి 100 శాతం షేర్లను కొనుగోలు చేసింది. ఇందుకు సంబంధించిన షేర్ల బదిలీ ప్రక్రియ బుధవారం అధికారికంగా పూర్తయ్యింది. ఎల్ అండ్ టీకి మెట్రో ప్రాజెక్టులో మొత్తం వాటా రూ.1,461.47 కోట్లు ఉండగా.. ఈ మొత్తాన్ని రేవంత్ సర్కార్ కొనుగోలు చేసింది. దీంతో మెట్రో రైల్వే ఆస్తులు, నిర్వహణ బాధ్యతలు ఇప్పుడు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోకి వచ్చాయి.
Also Read: తెలంగాణ పదోతరగతి పరీక్ష ఫలితాలు విడుదల...ఇలా చెక్ చేసుకోండి
పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్(PPP) పద్ధతిలో ఉన్న మెట్రో ప్రాజెక్టు ఇప్పుడు పూర్తిగా ప్రభుత్వ సంస్థగా మారనుంది. వాస్తవానికి మార్చి 31 నాటికే ప్రభుత్వం మెట్రోను స్వాధీనం చేసుకోవాలని టార్గెట్ పెట్టుకుంది. కానీ ఇండియన్ రైల్వే పైనాన్స్ కార్పొరేషన్ (IRFC) నుంచి రుణం మంజూరు ఆలస్యం అయ్యింది. దీంతో ఈ గడువును ఏప్రిల్ 30కి పొడిగించేశారు. తాజాగా నిధులు రావడంతో ప్రభుత్వం మెట్రోను స్వాధీనం చేసుకుంది.
లాభాలు
మెట్రో రైల్వే ప్రభుత్వం నియంత్రణలోకి వస్తే పలు లాభాలు ఉంటాయని విశ్లేషకులు భావిస్తున్నారు. భవిష్యత్తులో టికెట్ ధరలను కంట్రోల్ చేసే అధికారం పూర్తిగా ప్రభుత్వానికే ఉంటుందని చెబుతున్నారు. ఇక మెట్రో రెండో దశ విస్తరణ పనులు మరింత వేగంగా జరిగే ఛాన్స్ ఉందని అంటున్నారు. ప్రైవేటు సంస్థ లాభం కన్నా ప్రజా సేవకే ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చే ఛాన్స్ ఉంటుందని భావిస్తున్నారు.
Also Read: అమానుషం: కన్నపిల్లలను పోలీస్ స్టేషన్‌లో వదిలేసి వెళ్లిన తల్లిదండ్రులు!
Follow Us