ఇంటర్నేషనల్ Israel-Hamas War: వెనక్కి తగ్గిన ఇజ్రాయెల్...తెరుచుకున్న రఫా దారులు ఇజ్రాయెల్ దాడులతో గాజా పట్టణం వణుకుతోంది. ఉత్తర గాజాలో దాడులు చేస్తాము అక్కడి నుంచి తరలివెళ్ళిపోండి అని ఆ ప్రదేశాన్ని ఖాళీ చేయించింది ఇజ్రాయెల్. దీంతో అక్కడి ప్రజలంతా 20 కిలోమీటర్లకు పైగా ప్రయాణించి దక్షిణ గాజాకు చేరుకున్నారు. కానీ ఇజ్రాయెల్ అక్కడ కూడా దాడులు చేస్తోంది. దీంతో పాలస్తీనియన్ల పరిస్థితి దారుణంగా తయారైంది. అయితే ఎట్టకేలకు ఇజ్రాయెల్ కాస్త వెనక్కి తగ్గింది. అమెరికా చెప్పిన మాటలను కాస్త చెవికి ఎక్కించుకుని గాజాకు మానవతా సహాయం చేసేందుకు రఫా దారులను ఓపెన్ చేసింది. By Manogna alamuru 22 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Israel-Hamas conflict:చిన్నారులను చిదిమేస్తున్న యుద్ధం - హృదయ విదారకంగా గాజా యుద్ధాలు ఎప్పుడూ మానవ మనుగడకు ప్రమాదమే. ఇవి మనుషులకు ఎప్పుడూ శాంతిని ఇవ్వలేవు. యుద్ధం అయిపోయాక భవిష్యత్తులో చరిత్ర పాఠాలుగా చదువుకోవచ్చునేమో కానీ అది జరుగుతున్నప్పుడు మాత్రం అన్నిరకాలుగా నష్టమే తప్ప ఒరిగేదేమీ ఉండదు. ఇందుకు నిదర్శనమే ఇజ్రాయెల్-హమాస్‌ల మధ్య వార్. By Manogna alamuru 21 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ నగరం కింద మరో నగరం ఉంది-గాజా మీద దాడి అంత ఈజీ కాదు హమాస్‌ను మట్టుబెట్టే లక్ష్యంతో ముందుకు వెళుతోంది ఇజ్రాయెల్. క్షిపణులు, వైమానిక దాడులతో గాజా మీద విరుచుకుపడుతోంది. సరిహద్దుల్లో మరింత సైన్యాన్ని, యుద్ధ ట్యాంకులను మోహరించింది. భూదాడులు నిర్వహించి హమాస్‌ను సమూలంగా నాశనం చేయాలనే అనుకుంటోంది. కానీ గాజాలో భూదాడులు చేయడం అంత ఈజీ కాదని నిపుణులు అంటున్నారు. గాజా కింద మరో గాజా ఉందని చెబుతున్నారు. By Manogna alamuru 21 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Joe Biden:మేం చేసిన తప్పు మీరు చేయోద్దు- ఇజ్రాయెల్‌ను హెచ్చరించిన బైడెన్ 9/11 తర్వాత మేము చేసిన తప్పునే మీరూ చేయొద్దు అంటూ అగ్రరాజ్యం అధ్యక్షుడు జో బైడెన్ ఇజ్రాయెల్‌ను హెచ్చరించారు. హమాస్‌ను ఎదుర్కొనేందుకు కళ్ళు మూసుకుపోయి తప్పులు చేయొద్దని చెప్పారు. ఇజ్రాయెల్, హమాస్‌ల మధ్య యుద్ధం ముదురుతున్న వేళ బైడెన్ హెచ్చరికలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. By Manogna alamuru 20 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Israel-Hamas War: కొనసాగుతున్న భీకర యుద్ధం..బలౌతున్న సామాన్య పాలస్తీనియన్లు ఇజ్రయెల్, హమాస్ మారణకాండలో సామాన్య పాలస్తీనియన్లు బలౌతున్నారు. ఎవరు ఎంత చెబుతున్నా ఇరుపక్షాలు యుద్ధాన్ని మాత్రం ఆపడం లేదు. శత్రువుల కోసం వేటాడుతున్న ఇజ్రాయెల్ గాజా మీద ఎడాపెడా క్షిపణులతో దాడులు చేస్తూనే ఉంది. దీంతో అక్కడ బీభత్స వాతావరణ నెలకొంది. తాజాగా ఖాన్ యూనిస్‌లో ఓ భవనం మీద బాంబును వేయగా అందులో ఉన్న 15 మంది చనిపోయారు. దాదాపు 40 మంది గాయాలపాలయ్యారు. By Manogna alamuru 20 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Sanjay Raut: హమాస్ ఉగ్ర సంస్థతో బీజేపీని పోల్చిన శివసేన యూబీటీ నేత.. శివసేన యూబీటీ నాయకుడు, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ భారతీయ జనతా పార్టీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాషాయ పార్టీని ఆయన ఉగ్రసంస్థ హమాస్‌తో పోల్చడం రాజకీయంగా దుమారం రేపుతోంది. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ఇజ్రాయెల్-హమాస్ వివాదం గురించి చేసిన వ్యాఖ్యలపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ స్పందనకు కౌంటర్ ఇస్తూ సంజయ్ రౌత్ చేసిన విమర్శలు ప్రస్తుతం చర్చనీయాంశమవుతున్నాయి. By B Aravind 19 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Bomb attack on hospital:ఆసుపత్రిపై దాడి మిలిటెంట్ల పనే- ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహు గాజాలో ఆసుపత్రి దాడిలో 500 మంది అక్కడిక్కడే చనిపోయారు. ఈ దాడి గురించి ఇజ్రాయెల్ సైన్యం, హమాస్ మిలిటెంట్లు ఒకరినొకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఉగ్రవాదులు ప్రయోగించిన రాకెట్టే గురితప్పి ఆ దారుణం జరిగిందని ఇజ్రాయెల్ అంటోంది. ఇది కచ్చితంగా ఉగ్రమూకల దుశ్చర్యే అని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఆగ్రహం వ్యక్తం చేశారు. By Manogna alamuru 18 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Israel attack on Gaza: గాజా ఆసుపత్రిలో పేలిన బాంబు, 500మంది మృతి యుద్ధాలెప్పుడూ మానవాళికి చేటే చేస్తాయి. ఇది చాలా సార్లు నిరూపితమైంది. ఇప్పుడు కూడా అదే జరిగింది. ఇజ్రాయెల్, హమాస్‌ల మధ్య యుద్ధం అమాయక ప్రాణాలను బలి తీసుకుంది. గాజాలో ఓ ఆసుపత్రి మీద బాంబు పడి దాదాపు 500 మంది మృత్యువాత పడ్డారు. By Manogna alamuru 18 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Israel-Hamas War: సరిహద్దులో ఇజ్రాయెల్ సేనలు-గాజాలో ఉద్రిక్త వాతావరణం ఇజ్రాయెల్, హమాస్ యుద్ధం పదోరోజుకు చేరుకుంది. ఇప్పటికే అల్లకల్లోలంగా ఉన్న గాజా పరిస్థితి మరింత దారుణంగా మారబోతోందా అంటే అవుననే సంకేతాలే కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఒకరి మీద ఒకరు విమానాలు, క్షిపణులతో దాడులు చేసుకుంటున్నారు. దీనికి తోడు 3 లక్షలకు పైగా సైన్యంతో గాజాను చుట్టుముట్టడానికి ఇజ్రాయెల్ రెడీగా ఉంది. ప్రభుత్వ ఆదేశాల కోసం వారు ఎదురుచూస్తున్నారు. By Manogna alamuru 17 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn