/rtv/media/media_files/2025/02/18/1jWMJ2SED0NMoJsiDexP.jpg)
palakkad Trithala Fest
కేరళలో జరిగే త్రిథాల ఉత్సవం చాలా ఫేమస్. అక్కడ పాలక్కాడ్ లో దీన్ని ప్రతీ ఏటా నిర్వహిస్తారు. అయితే ఈ ఏడు నిర్వహించిన ఉత్సవంలో కొందరు యువకులు చేసిన పని విమర్శలపాలవుతోంది. త్రిథాల ఉత్సవంలో ఏనుగులతో ఊరేగింపు చేస్తారు. ఇందులో యువకులు హమాస్ నేతల ఫోటోలతో ఊరేగింపు నిర్వహించారు. వీరితో పాటూ స్థానిక ఎమ్మెల్యే, మంత్రి ఎంబీ రాజేశ్ సహా కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే వీటీ బలరాంలు ఇందులో పాల్గొన్నారు. అసలు హమాస్ నేతల చిత్రాలతో ఊరేగింపు చేయడమే తప్పు అంటే అందులో స్థానిక నేతలు పాల్గొనడం మరింత విమర్శలకు దారితీసింది.
Mosque festival?? Why they copy every Hindu things?? https://t.co/nEh1aY9l8F
— Devi Uvacha|உவாச| उवाच 🇮🇳 (@Devi_Uvacha) February 16, 2025
Also Read: Canada: కెనడాలో బోల్తాపడ్డ విమానం..18మందికి తీవ్రగాయాలు
ఎన్నాళ్ళిలా...చర్యలు తీసుకోండి..
కేరళలో ఇలా జరగడం ఇది మొదటిసారి కాదు. ఇంతకు ముందు గతేడాది కేరళలో జరిగిన ర్యాలీలో హమాస్ నేతలు వర్చువల్‌గా పాల్గొన్నారు. దీనిపై అప్పట్లో బీజేపీ మండిపడింది. ఇప్పుడు కూడా మళ్ళీ అదే రిపీట్ అయింది. దీనిపై కేరళ రాష్ట్ర అధ్యక్షుడు కే. సురేంద్రన్ మాట్లాడుతూ...అప్పట్లో ఎల్డీఎఫ్ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఇప్పుడు హమాస్ ఉగ్రవాదులను కీర్తిస్తూ ఏనుగులపై ఊరేగించారని.. వీటి ద్వారా ఏం సందేశం ఇవ్వదలచుకున్నారని మండిపడ్డారు. దీనిపై ముఖ్యమంత్రి ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు. హమాస్ నేతల ఫోటోలను ఊరేగించడంపై వెంటనే చర్యలు తీసుకోవాలని సురేంద్రన్ డిమాండ్ చేశారు. లేదంటే రాజీనామా చేయాలని చెప్పారు.
One year ago, when @BJP4Keralam warned against a rally in Kerala where a Hamas leader virtually participated, the LDF govt took no action. Now, in Palakkad, at a Urus festival, terrorists who killed thousands were glorified—pictures of Ismail Haniyeh & Yahya Sinwar were paraded… pic.twitter.com/eBRfTJvMX9
— K Surendran (@surendranbjp) February 17, 2025
Also Read: Supreme Court: ప్రార్థనా స్థలాలపై ఎన్నాళ్ళు...ఇక చాలు అన్న సుప్రీంకోర్టు