/rtv/media/media_files/2025/02/21/jDCHt4W3VvyYdhjW3ix3.jpg)
bombs on buses, Isreal
సెంట్రల్ ఇజ్రాయెల్ ఒక్కసారిగా దద్దరిల్లింది. ఆగి ఉన్న మూడు బస్సుల్లో ఒకేసారి బాంబులు పేలడం ఆందోళనకు దారితీసింది. ఇజ్రాయెల్ లోని బాట్ యామ్ సిటీలో ఈ సంఘటన జరిగింది. ఇవే కాక మరో రెండు బస్సుల్లో కూడా బాంబులున్నట్టు సమాచారం అందడంతో...బాంబ్ స్క్వాడ్ వాటిని నిర్వీర్యం చేసింది. అయితే అదృష్టవశాత్తు ఈ పేలుళ్ళల్లో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. అయితే ఈ దాడులకు పాల్పడింది పాలస్తీనా ఉగ్రవాదులేనని అనుమానాలు మాత్రం వ్యక్తం అవుతున్నాయి. కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా హమాస్ గాజా నుండి నలుగురు బందీల మృతదేహాలను తిరిగి ఇవ్వడంతో ఇజ్రాయెల్ అసంతృప్తిగా ఉంది. దానికి తోడు ఇప్పుడు బాంబులు పేలడంతో మరింత కోపంగా ఉన్నట్టు తెలుస్తోంది.
Also Read : కొడుకుకి ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న పురస్కారం..కానీ ఇంతలోనే తండ్రి..!
అనుమానితుల కోసం గాలింపు..
పేలిన బాంబులు, స్క్వాడ్ నిర్వీర్యం చేసిన రెండు బాంబులు అన్నీ ఒకేలా ఉన్నాయని ఇజ్రాయెల్ పోలీస్ అధికారులు చెబుతున్నారు. అనుమానితుల కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు ప్రధాని కార్యాలయం ప్రకటన చేసింది. దీనిపై ప్రధాని బెంజిమన్ నెతన్యాహు అత్యవసర భద్రతా సమావేశానికి కూడా పిలుపునిచ్చారు. ఈ బాంబు దాడులపై షిన్ బెట్ అంతర్గత భద్రతా సంస్థ దర్యాప్తును నిర్వహిస్తోందని పోలీసులు తెలిపారు. మరోవైపు బాట్ యామ్ మేయర్ బ్రోట్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.
Also Read : రంజాన్ బంపర్ ఆఫర్.. 24 గంటలు షాపులు తెరవచ్చు..!
జనవరి 19 ఇజ్రాయెల్, పాలస్తీనా ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం చేసుకున్నాయి. దాని తరువాత నుంచి హమాస్ సంస్థ తమ దగ్గర ఉన్న ఇజ్రాయెల్ బందీలను విడిచిపెడుతూ వస్తోంది. అయితే రీసెంట్ గా నలుగురు బందీల శవాలను ఇజ్రాయెల్ కు అప్పగించింది. దీంతో మిలిటెంట్ సంస్థ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఆరోపణలు చేసింది. బతికున్నవారిని అప్పగించాలని తాము కోరామని...అందుకు విరుద్ధంగా ఇజ్రాయీలను చంపేసి తమకు అప్పగించారని ఆగ్రహం వ్యక్తం చేసింది.
Also Read : తెగించిన కామాంధులు.. చాక్లెట్ ఆశ చూపి ఎనిమిదేళ్ల చిన్నారిపై.. !