USA: ఉగ్రవాదులతో దోస్తీ .. అమెరికాలో భారతీయ విద్యార్థి అరెస్టు

హమాస్‌ ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయంటూ బదర్ ఖాన్ సూరీ అనే ఇండియన్ స్టూడెంట్‌ను అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. జార్జ్‌ టౌన్‌ యూనివర్సిటీలో పోస్ట్ డాక్టోరల్‌గా ఉన్న సూరీ భార్య గాజాకు చెందినది. ఈ కారణంగానే అరెస్టు చేశారని బదర్ ఖాన్ సూరీ ఆరోపించాడు.

New Update
Indian Student arrested america

Indian Student arrested america

అమెరికాలో ఇండియన్ స్టూడెంట్‌ను అక్కడి పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. హమాస్‌ ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయంటూ బదర్ ఖాన్ సూరీ అనే విద్యార్థిని ఫెడరల్ ఏజెంట్లు అరెస్టు చేశారు. బదర్‌ ఖాన్ సూరీ జార్జ్‌ టౌన్‌ యూనివర్సిటీలో పోస్ట్ డాక్టోరల్‌గా ఉన్నాడు. వర్జీనియాలో బదర్ ఖాన్‌ను ఫెడరల్‌ ఏజెంట్లు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఖాన్ స్టూడెంట్ వీసాను అమెరికా రద్దు చేసింది. అయితే తన అరెస్టును సవాల్ చేస్తూ సూరీ ఇమ్మిగ్రేషన్ కోర్టులో సవాల్ చేశాడు. తనకు ఎలాంటి నేర చరిత్ర లేదని.. భార్య పాలస్తీనా మూలాలు ఉండటంతోనే అరెస్టు చేశారని బదర్ ఖాన్ సూరీ ఆరోపించాడు. 

ఇది కూడా చూడండి: USA: శాంతి ఒప్పందంపై జెల్స్ స్కీ కు ట్రంప్ కాల్..సుదీర్ఘ చర్చ

ఇది కూడా చూడండి: HYD: ఎల్బీ నగర్ లో దారుణం..బైక్ ను ఢీకొట్టి కిలోమీటర్ ఈడ్చుకెళ్ళిన కారు

స్టూడెంట్ వీసా మీద వెళ్లి..

బదర్ ఖాన్ సూరీ 2020లో శాంతి, సంఘర్షణ అనే అంశంపై ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయంలో పీహెచ్‌‌డీ చేశారు. ఆ తర్వాత స్టూడెంట్ వీసాపై అమెరికా వెళ్లి అక్కడ జార్జ్ టౌన్ యూనివర్సిటీలో పోస్ట్ డాక్టోరిల్ ఫెలో, ఇరాక్, ఆఫ్ఘనిస్థాన్‌లో శాంతిని నెలకొల్పే అంశంపై పరిశోధనలు చేస్తున్నట్లు సమాచారం. అయితే ఇతని భార్య గాజాకు చెందినది. ఈమెకు అమెరికా పౌరసత్వం ఉండటంతో అక్కడే చదువుతోంది. 

ఇది కూడా చూడండి: Google Pixel 9a: వచ్చేసింది వచ్చేసింది.. కిక్కిచ్చే కిర్రాక్ ఫోన్ లాంచ్.. ధర, స్పెసిఫికేషన్ల వివరాలివే!

ఇది కూడా చూడండి: AP: ఆంధ్రాలో మరో సామూహిక అత్యాచారం..మైనర్ ను మూడు రోజులు నిర్భంధించి...

Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

USA: చైనా అయిపోయింది ఇప్పుడు ఈయూ వంతు..

ట్రంప్ సుంకాలపై ప్రపంచ దేశాలు దండెత్తడానిక రెడీ అయ్యాయి. ఇప్పటికే చైన ఏది ఏమైనా తగ్గేదే లే అంటోంది. ఇప్పుడు యూరోపియ్ యూనియన్ సైతం కీలక ప్రకటన చేసింది. తామూ ప్రతిగా 25శాతం సుంకాలను విధిస్తామని చెబుతోంది. 

New Update
Trump

Trump

అమెరికా అధ్యక్షుటు ట్రంప్ టారీఫ్ల మోతకు నెమ్మదిగా ప్రతి స్పందనలు వస్తున్నాయి. ఆయన మొదలుపెట్టిన ఈ ట్రేడ్ వార్ ను చైనా ఇప్పటికే చాలా గట్టిగా ఎదుర్కొంటోంది. ఇప్పుడు యూరోపియన్ యూనియన్ కూడా ఢీ కొనడానికి రెడీ అయింది. యూరోపియన్‌ యూనియన్‌ సైతం ట్రంప్‌ చర్యల్ని వ్యతిరేకిస్తూ మొదటిసారి కీలక ప్రకటన చేసింది. ఉక్కు, అల్యూమినియంపై 25 శాతం టారిఫ్‌ విధిస్తూ మార్చిలో అమెరికా చేసిన ప్రకటనకు ప్రతిగా అమెరికా వస్తువులపై టారిఫ్‌లు విధించాలన్న ప్రతిపాదనకు ఈయూ సభ్యదేశాలు అనుకూలంగా ఓటు వేశాయి. ఈ విషయాన్ని యూరోపియన్‌ కమిషన్‌ స్పష్టం చేసింది. ఇవి ఏప్రిల్‌ 15 నుంచి అమలులోకి వస్తాయని స్పష్టం చేసింది. 

చాలా అన్యాయంగా ఉన్నాయి..

అమెరికా విధిస్తున్న సుంకాలు అన్యాయంగా ఉన్నాయని ఈయూ అంటోంది. దీని వలన ఇరు వైపులా నష్టమే కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను దెబ్బ తీస్తుందని ఈయూ అభిప్రాయం వ్యక్తం చేస్తోంది. అమెరికాకు తాము వ్యతిరేకంగా వెళ్ళాలని అనుకోవడం లేదని...కేవలం ఆ దేశంతో వాణిజ్య పరమైన సమస్యల్ని చర్చించాలని మాత్రమే అనుకుంటున్నామని చెబుతోంది. ఈయూ కూటమిలో మొత్తం 27 దేశాలు ఉన్నాయి. తాము ఆశించినట్లుగా ఇరు దేశాల మధ్య న్యాయమైన రీతిలో చర్చలు జరిగితే.. ప్రతీకార చర్యలను ఎప్పుడైనా నిలిపివేసే అవకాశం ఉంటుందని తెలిపింది. అయితే ఈయూ దేశాలు ఏమేమి వస్తువులపై సుంకాలు విధిస్తారు, ఎంత విధిస్తారు అనేది మాత్రం ఇంకా చెప్పలేదు.  20 బిలియన్ల యూరోలు లక్ష్యంగా మాత్రం ఇి ఉంటాయని తెలుస్తోంది. 

 today-latest-news-in-telugu | usa | donald trump tariffs | us trade war

Also Read: ముగ్గురు పిల్లల తల్లికి ఇంటర్ స్టూడెంట్‌తో మూడో పెళ్లి

Advertisment
Advertisment
Advertisment