Israel: మళ్ళీ మొదలైన ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం..200 మంది మృతి

గాజా స్ట్రిప్, దక్షిణ లెబనాన్, దక్షిణ సిరియాలపై ఇజ్రాయెల్ మళ్ళీ దాడులకు పాల్పడుతోంది. ఈ దాడుల్లో ఇప్పటికి 200 మంది మృతి చెందారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఉగ్రముప్పు పొంచి ఉన్న కారణంగానే దాడులు చేస్తున్నామని ఇజ్రాయెల్ చెబుతోంది.

author-image
By Manogna alamuru
New Update
IDF

Israel Attacks

ఇజ్రాయెల్, హమాస్ ల మధ్య సీజ్ ఫైర్ ఒప్పందం నేటితో ముగిసింది. దీంతో ఈరోజు ఉదయం నుంచే ఇజ్రాయెల్ గాజా పై దాడులు మొదలుపెట్టింది. వైమానిక దాడులు చేస్తూ భీభత్సం సృష్టిస్తోంది. దీంట్లో ఇప్పటి వరకు 200 మంది చనిపోయారని గాజా ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రకటించింది. పాలస్తీనాలో శరణార్థులకు ఆశ్రయమిస్తున్న స్కూల్ పై ఇజ్రాయెల్ విమానాలు అటాక్ చేసాయి. సీజ్ ఫైర్ ఒప్పందానికి హమాస్ అంగీకరించని కారణంగానే దాడులకు ఆదేశించినట్లు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కీలక ప్రకటన చేశారు. తమ బందీలను విడుదల చేయడానికి హమాస్ పదేపదే నిరాకరిస్తోంది. అలాగే అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్‌ విట్‌కాఫ్‌ ప్రతిపాదించిన కాల్పుల ఒప్పందం కొనసాగింపును తిరస్కరించింది. అందుకే దాడులు చేస్తున్నామని అన్నారు. గాజాలోని హమాస్ స్థావరాలే లక్ష్యంగా బాంబులతో విరుచుకుపడుతోంది ఐడీఎఫ్.  

 

దక్షిణ సిరియాలోనూ..

దక్షిణ సిరియాలోని మిలటరీ కమాండ్ సెంటర్ లు, ఆయుధాలు, ఆర్మీ వాహనాలు ఉన్న స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ వైమానికి దాడులు చేస్తోంది.  సిరియాను అసద్ పాలిస్తున్నప్పుడు ఈ స్థావరాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ మిలిటరీ ఆస్తులను సిరియా నూతన ప్రభుత్వ వర్గాల ఆధ్వర్యంలోని బలగాలు నిర్వహిస్తున్నాయి. వీటి నుంచి ఇప్పుడు తమకు ప్రమాదం పొంచి ఉందనే కారణంగా దాడులు చేస్తున్నామని ఇజ్రాయెల్ చెబుతోంది.  మరోవైపు లెబనాన్ కూడా దాడులు చేస్తోంది ఇజ్రాయెల్ సైన్యం. రెండు ప్రదేశాల్లో కలిపి పది మంది దాకా చనిపోయారు. ఇందులో ఒక చిన్నారి కూడా ఉన్నట్లు తెలుస్తోంది. 

Also Read:  TS: తెలంగాణ నెక్స్ట్ సీఎస్ రామకృష్ణారావు!

 

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు