TS: ఐఏఎస్ అధికారిపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్
నిన్న అచ్చంపేట సభలో ముఖ్యమంత్రి కాళ్ళు మొక్కడానికి ప్రయత్నించిన ఐఏఎస్ అధికారిపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయింది. ప్రజా సమావేశాల్లో అనుచిత ప్రవర్తన మానాలని సీఎస్ సూచించారు.
నిన్న అచ్చంపేట సభలో ముఖ్యమంత్రి కాళ్ళు మొక్కడానికి ప్రయత్నించిన ఐఏఎస్ అధికారిపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయింది. ప్రజా సమావేశాల్లో అనుచిత ప్రవర్తన మానాలని సీఎస్ సూచించారు.
పాకిస్తాన్ లో ప్రభుత్వం కుప్పకూలిందా అంటే అవుననే వినిపిస్తోంది. డిప్యూటీ ప్రధాని సీజ్ ఫైర్ ప్రకటించిన తర్వాత కూడా పాకిస్తాన్ ఆర్మీ మళ్ళీ కాల్పులు మొదలెట్టడంతో ప్రభుత్వాన్ని ఆర్మీ స్వాధీనం చేసుకుందని అంటున్నారు.
పాక్‌కి సపోర్ట్‌గా కథనాలు ప్రచురించిందని లేఖ ద్వారా కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. బీబీసీకి లేఖ రాసింది. ఇటీవల ప్రచురించిన ఓ ఆర్టికల్‌లో ఉగ్రదాడికి బదులు మిలిటెంట్ దాడి అని బీబీసీ రాసింది. ఈ క్రమంలోనే అభ్యంతరం తెలుపుతూ లేఖ రాసింది.
ట్రంప్ ప్రభుత్వంపై హార్వర్డ్ యూనివర్శిటీ దావా వేసింది. తమకు నిధులు నిలిపేసి...విద్యాపరమైన నిర్ణయాలపై నియంత్రణ సాధించడానికి హార్వర్డ్ ఆరోపిస్తోంది. ట్రంప్ పెట్టిన డిమాండ్లను నిరాకరించడం వల్లనే ఇలా చేస్తున్నారంటూ యూనివర్శిటీ ఆరోపించింది.
తమిళనాడు ప్రభుత్వం వెయ్యి కిలోల ఆలయ బంగారాన్ని కరిగింది. 21 ఆలయాలకు భక్తులు కానుకలుగా సమర్పించిన వాటిని ఇలా చేసింది. దీన్ని బ్యాంకులో డిపాజిట్ చేసి.. ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా ప్లాన్ చేసింది. ఆ ఆదాయాన్ని కూడా తిరిగి ఆలయాలకే ఖర్చు పెడతామని చెబుతోంది.
తెలంగాణలో ఇన్స్టంట్ బీర్ కేఫ్‌లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇన్స్టంట్ కేఫ్‌లో మైక్రో బ్రూవరీ నుంచి అప్పటికప్పుడు తయారై బీరు నేరుగా మందుబాబుల గ్లాసులోకి రాబోతుంది.
కేంద్ర ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది.. 2025-26 ఆర్థిక సంవత్సరంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనులకు కనీస వేతనం రూ.307గా ప్రకటించింది. ఇది 2024-25 సంవత్సరంతో పోలిస్తే రూ.7 ఎక్కువ. కొత్త వేతనం ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది.
కర్ణాటకలో MLA, MLC జీతాలను పెంచుతూ ఆ రాష్ట్ర అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదం తెలిపింది. ప్రభుత్వం CMతోపాటు, మంత్రులు, ఎమ్మెల్యేల జీతాలు 100 శాతం పెంపుకు ప్రతిపాదించింది. పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా ఈ ప్రతిపాదన చేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.