/rtv/media/media_files/2025/03/29/Qqwmquz4vdo2Q08i6Zm4.jpg)
mnregs
ఏపీలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఉపాధి హామీ కూలీలకు అదిరిపోయే శుభవార్త. కేంద్ర ప్రభుత్వం MGNREGA కూలీలకు వేతనం పెంచింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి కనీస వేతనం రూ.307గా నిర్ణయించింది. ఇది 2024-25 కంటే రూ.7 ఎక్కువ. పెరిగిన వేతనం ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రంలో అమల్లోకి రానుంది. కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ ఈ విషయాన్ని తెలిపింది. ఉపాధి హామీ పథకంలో పనిచేసే కూలీలకు కేంద్రం ప్రతీ సంవత్సరం వేతనం పెంచుతుంది. ఆయా రాష్ట్రాల ప్రకారం కనీస వేతనం ప్రకటిస్తుంది. 2024-25లో కనీస వేతనం రూ.300గా ఉంది.. కానీ రాష్ట్రంలో సగటు వేతనం మాత్రం రూ.260గా ఉంది. కూలీలకు వేతనం పెంచడం వల్ల కొంతమేరకైనా ఉపయోగం ఉంటుందని భావిస్తున్నారు.
మరోవైపు ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో పల్లె పండగలో భాగంగా ఉగాది రోజున రూ.557 కోట్లతో 1,202.66 కిలోమీటర్ల మేర 402 రహదారుల పనులు చేపట్టాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ నిర్ణయించింది. గ్రామాలు, మండలాలను కలిపే రోడ్లను నిర్మించనున్నారు. పనులను త్వరగా, నాణ్యతగా పూర్తి చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులకు సూచించారు. నాబార్డు నిధులు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాల్లో ఇప్పటికే 4 వేల కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం చేపట్టారు.
Also Read: Trump-Modi: మోడీ గొప్ప ప్రధాన మంత్రి..ట్రంప్ ప్రశంసలు!
రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. పల్లె పండగలో భాగంగా రోడ్ల నిర్మాణం చేపట్టనున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నాబార్డు నిధుల మంజూరుకు తోడ్పాటు అందించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉప ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. బొగ్గు కొనుగోలు, ఇతర నిర్వహణ ఖర్చుల కోసం రూ.710 కోట్ల దీర్ఘకాలిక రుణాన్ని హడ్కో నుంచి తీసుకునేందుకు ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్(ఏపీపీఎఫ్‌సీఎల్)కు అనుమతిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
Also Read: Ap:ఏపీలో వీరికి ఆదివారం.. రంజాన్ సెలవులు లేవు..
Also Read: Ugadi: ఉగాది పండుగ అసలు ఎందుకు జరుపుకుంటారు? ఉగాది పచ్చడికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి?
ap | workers | government | hike | payments | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates