Ap Govt : ఏపీ మహిళలకు శుభవార్త..ఆ పథకం తిరిగి ప్రారంభం!
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్టీఆర్ బేబీ కిట్ల పంపిణీ పథకాన్ని మరోసారి అమలు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది.గత వైసీపీ ప్రభుత్వం ఈ పథకాన్నిరద్దు చేసింది.
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్టీఆర్ బేబీ కిట్ల పంపిణీ పథకాన్ని మరోసారి అమలు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది.గత వైసీపీ ప్రభుత్వం ఈ పథకాన్నిరద్దు చేసింది.
మంగళగిరి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పై దాడి కేసును సీఐడీకి అప్పగిస్తూ ఏపీ ప్రభుత్వం ఓ సంచలన నిర్ణయం తీసుకుంది.మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటిపై దాడి కేసును కూడా ఏపీ ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది.
ఏపీ సీఎం చంద్రబాబుని టాలీవుడ్ హీరో మెగాస్టార్ చిరంజీవి కలిశారు. ఈ మేరకు వరద బాధితుల సహాయార్థం తనయుడు రామ్ చరణ్‌తో కలిసి ప్రకటించిన కోటి రూపాయల చెక్‌ను చంద్రబాబుకు అందజేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు.. చిరంజీవి, రామ్ చరణ్‌కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
AP: ఈరోజు ఇంద్రకీలాద్రి దుర్గగుడికి సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు. సీఎం వెంట డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉండనున్నారు. మధ్యాహ్నం ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.
తన కాలేజీలవైపు హైడ్రా బుల్డోజర్లు రాకుండా ఆపడానికి.. ఆస్తులపైకి ఈడీ దాడులు చేయకుండా ఉండేందుకు మల్లారెడ్డి కొత్త స్కెచ్ వేశారన్న చర్చ జోరుగా సాగుతోంది. టీడీపీలో చేరి అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రేవంత్ సర్కార్ కు దగ్గర అవ్వాలని ఆయన ప్లాన్ చేస్తున్నారన్న టాక్ నడుస్తోంది.
తిరుమల శ్రీవారి లడ్డూ నాణ్యతపై సీఎం చంద్రబాబు సమీక్ష చేశారు. తిరుమల పవిత్రత, నమ్మకం కాపాడేలా పనిచేయాలని అధికారులకు ఆదేశించారు. లడ్డూ ప్రసాదం, అన్న ప్రసాదం నాణ్యత పెరిగిందని భక్తులు చెబుతున్నారు, ఇది ఇలాగే కొనసాగించాలని సూచించారు.
తిరుపతి లడ్డూ కల్తీ అంశంపై CBI, ఏపీ పోలీస్, FSSAI అధికారులతో సిట్ ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలను స్వాగతిస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఈ మేరకు తన X ఖాతాలో పోస్టు చేసిన చంద్రబాబు.. సత్యమేవ జయతే, ఓం నమో వేంకటేశాయ! అని పేర్కొన్నారు.
ఏపీ సీఎం చంద్రబాబు శుక్రవారం తిరుమల పర్యటనకు వెళ్లనున్నారు. స్వామి వారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో శ్రీవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున చంద్రబాబు దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. తిరుమలలో నూతనంగా నిర్మించిన వకుళామాత వంటశాలను సీఎం ప్రారంభించనున్నారు.