CID: ఆ కేసు సీఐడీకి.. వైసీపీకి చంద్రబాబు సర్కార్ మరో షాక్! మంగళగిరి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పై దాడి కేసును సీఐడీకి అప్పగిస్తూ ఏపీ ప్రభుత్వం ఓ సంచలన నిర్ణయం తీసుకుంది.మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటిపై దాడి కేసును కూడా ఏపీ ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది. By Bhavana 13 Oct 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి Ap Govt: ఏపీ ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. రెండు కేసులను ఏపీ సీఐడీకి అప్పగిస్తూ ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. మంగళగిరి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పై దాడి కేసును సీఐడీకి అప్పగిస్తూ ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. టీడీపీ కార్యాలయం పై గత ప్రభుత్వ హయాంలో దాడులు జరిగిన సంగతిత తెలిసిందే. Also Read: ఆదివాసి హత్యలు, ఎలక్టోరల్ బాండ్లు.. టాటాపై ఉన్నవివాదాల్లో నిజమెంత? ఆ దాడుల సమయంలో కొన్ని వాహనాలతో పాటు ఫర్నిచర్ ను కూడా ధ్వంసం చేశారు. ఈ కేసును మంగళగిరి పోలీసుల నుంచి సీఐడీకి అప్పగిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఈ కేసులో మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్టయ్యారు. చంద్రబాబు నివాసంపై... మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటిపై దాడి కేసును కూడా ఏపీ ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది. Also Read: మరోసారి విరుచుకుపడ్డ ఇజ్రాయెల్..19 మంది పాలస్తీనియన్లు మృతి! గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పార్టీ నేత జోగి రమేష్ తన అనుచరులతో కలసి ఉండవల్లిలోని చంద్రబాబు నాయుడు నివాసంపై దాడికి యత్నించారని టీడీపీ ఆరోపిస్తోంది. ప్రస్తుతం ఆ కేసులో మంగళగిరి పోలీసుల ఎదుటకు జోగి రమేష్ విచారణకు హాజరయ్యారు. ప్రస్తుతం ఈ కేసును కూడా సీఐడీకి అప్పగిస్తూ ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. Also Read: ఏపీలో టెన్షన్ టెన్షన్.. ఇరు వర్గాల మధ్య ఘర్షణ! #ap-ycp #chandrababu #cid మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి